TIRUVEMBAAVAAY-08
తిరువెంబావాయ్-08
**************
"కృపా సముద్రం సుముఖం త్రినేత్రం
జటాధరం పార్వతీ వామభాగం
సదాశివం రుద్రం అనంతరూపం
చిదంబరేశం హృది భావయామి."
సందర్భము
*********
చిత్తములోదాగి చింతలను తొలగిస్తున్న చిదంబరేశుని అవ్యాజకరుణను మరింత స్పష్టముచేస్తూ నిదురిస్తున్న తమ చెలిని వ్రతమునకు సిద్ధముచేయుచుచున్నారు మేల్కొలుచు.
పాశురము
********
తిరువెంబావాయ్-008
******************
కోళి శిలంబ చిలంబుం కురుగెంగు
ఎళిలియంబ ఇయంబువేన్ శణ్గెంగుం
కేళిల్ పరంజోది కేళిల్ పరంకరుణై
కేళిల్ విళుప్పోరుల్కళళ్ పాడినో కేట్టిలైయో
వాళియిదెన్న ఉరక్కుమో వాయ్ తిరవాయ్
ఆళియున్ అంబుదమై ఆమారుమివ్వారో
ఊళి ముదల్వనాయ్ నిన్ర ఒరువనై
ఏలై పంగాళనయే పాడేరేలొ రెంబావాయ్.
స్వామి "ఊళి ముదల్వాన్" ఆది ప్రళయానంతరమున మిగిలినది పరమాత్మ మాత్రమే.అట్టి పరమాత్మ తన కరుణను అనుదినము నాలుగు సంకేతములతో ప్రసరిస్తున్నాడు.మనలకు అది అవ్యాజకరుణ ప్రారంభము.అవియే
1.శిలంబ కోళి-కోడి కొక్కొరొకో (ప్రణవనాదము)
2.శిలంబ కురంగే-ప్రాతః కాల ఉషస్సు
3.శిలంబ ఎళిలియంబ-సప్తస్వర నాదముగా
4.శిలంబ వెణ్సంగం-తెల్లని శంఖంపు ధ్వని గా
స్వామి కరుణ శబ్దిస్తూ మనలను స్పర్శిస్తున్నది.
అంతే కాదు ఆ స్పర్శ మనకు స్వామి యొక్క
1.పరంజ్యోయోతి తత్త్వమును
2.ఆ జ్యోయి కిరణముల కరుణ కాంతులు
3.ఆ లీలా రూపములను
గమనించి,గ్రహించేటట్లు చేస్తున్నది కదా.
పోతనగారు చెప్పినట్లు,
లోకములు లోకేశుడు అలఒకంబగగు పెంచీకటిలో నిండిన వేళ,ఆవల నెవ్వండేకాకృతి నుండు వానిని నే భజియింతున్.
ఆ ఏకాకృతి యొక్క కరుణయే
దిక్కెవ్వ్వరు ప్రహ్లాదుకు,దిక్కెవ్వరు పాండు సుతకు ,దీనులకెపుడును,వాడే నాకు దిక్కు అనిపిస్తోంది.
వాని అనేకానేక రూప ప్రకటనములు,
అంతః బహిశ్చ యత్సర్వం వ్యాప్త నారాయణ స్థితః అని కద వివరిస్తున్నది.
అట్టి చిదమ్రేశుని దివ్యపాదార్చన అను శివనోమునకు సిద్ధము కాలేని ఈ వింత నిద్దుర ఏమిటి? చెలి,మమ్ములను అనుగ్రహించి లేచివచ్చి,మాచే శివ వ్రతమును చేయించవమ్మా అంటున్నారు భాగ్యశీలురయిన కన్నియలు.
అంబే శివే దివ్య తిరువడిగళే శరణం.
ఏక బిల్వం శివార్పణం.
.jpg)
Comments
Post a Comment