EMtaTi ADBHUTA CHITRAKAARUDO

ఎంతటి అద్భుత చిత్రకారుడో- ఏమని వర్ణించగలను? ******************* భూమండలమును గిరగిర తిప్పిస్తూ,తాను నిశ్చలముగా నున్నప్పటికిని,భూమి నిశ్చలము,తాను తిరుగుతున్నాను అనే భ్రమను మనకు కలిగించే అద్భుత చిత్రకారుడు. అవ్యక్తము వ్యక్తము కావాలంటే అంతర్మథనము జరగాలి.అవరోధాలను అడ్డుకోకలగాలి.అస్పష్టత తొలగాలి. ఏ విధముగా సినీమా తెర నిశ్చలముగా ఉండి,అనేక చిత్ర కదలికలను మనకు అందిస్తుందో అదేవిధముగా మూలతత్త్వము అనేక రూపములలో వ్యక్తమగుతు మనకు అవగాహనను అందిస్తుంది.ఖండించలేని-కాదనలేని నగ్నసత్యము.నమ్ముదాము-నమస్కరిద్దాము. " కిరతి" అనగావెదజల్లు స్వభావము కలది.వెదజల్లు స్వభావము గలవి కిరణములు. 1. సహస్ర కిరణములతో సప్తవర్ణములను గగనమున ఇండ్రధనుస్సుగా,భువనమున బహుమేధతో చిత్రిస్తున్నప్పటికిని,తన చేతులను మనకు కనిపించనీయడు. 2.ఆకాసము శబ్దవాచకము అని పెద్దలు చెబుతారు.గాయత్రి-బృహతి-ఉష్ణిక్-జగతి-త్రిష్ణుప్-అనుష్టుప్-పంక్తి అను ఏడు ఛందస్సుల ఉత్పత్తికి కారణమైనప్పటికిని,మనతో మౌనముగానే ఉంటాడు. ...