Wednesday, May 8, 2024

TRILOKAMOHANACHAKRAMU-PARICHAYAMU-03




   అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా
     అని శ్లాఘిస్తున్నది పరమేశ్వరిని లలితారహస్య సహస్రనామ స్తోత్రము.
  న-ఇతి,ఇది కాదు ఇదికాదు అంటూ ముందుగా చిత్శక్తి ని గుర్తించే విధానములో కానిదానిని గుర్తించి,తొలగించుకొనమని "కేనోపనిషత్తు"చెబుతోంది.

  " శ్రీ లలిత శివజ్యోతి సర్వకామదా
    శ్రీ గిరినిలయా నిరామయా సర్వమంగళా"

  ఈ మానవ ఉపాధి ఎంత విచిత్రమైనది." ఆహార నిద్రా భయ మైథునశ్చాఅన్న నాలుగు అవసరములను తీర్చుకుంటూ,తన మనసును ఇంద్రియభోగములపై కేంద్రీకరించి,తన అవసరములు ఏ విధముగా తీరుతున్నాయి? ఎవరు తీరుస్తున్నారు? బాహ్యములో కనపడుతూనా/లేక అంతః ముఖముగానుండి  అనే ఆలోచన రానీయకుండా ఆజగజ్జనని మాయ తెరలను కప్పుతూనే ఉంటుంది.అంతలోనే దయాంతరంగయైవాటిని విప్పుతుంటుంది.
  ఆ ప్రక్రియలో మనకు సులభముగా అర్థమగుటకై ఎన్నోరూపములను ధరించి,ఎన్నెన్నో స్వభావములతో,సహాయకారిగా 
  ఆశివప్రకాసమైన శివాని సర్వాభీష్ట సిద్ధికై,సర్వ మంగళకారిణిగా,ప్రకృతిగా/ప్రపంచముగా  తనను తాను ప్రకటించుకుని,
 "ఆహో పూరిషికగా" ఆవిర్భావము చెంది వాటన్నింటికి మూలముగా/ఆధారముగా అలరారుచున్నది.
 ఆ జగజ్జనని "మహా లావణ్య శేవథిః" తన స్వరూపమునకు/తన సౌందర్యమునకు తానే సరిహద్దులను ప్రకటిస్తుంటుంది.
ఆ విధముగా పంచభూతాత్మికమైన పృథ్వీ తత్త్వముగా,బిందువు విస్తరించి "త్రైలోక్యమోహన చక్రముగా/భూపురముగా" సాధకునికి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికిచేర్చుటకు సహాయపడుచున్నది.
 తన అంశలను మూడు చతురత్స్రాకారములలోను,అష్టసిద్ధులుగాను,సప్తమాతృకలుగను,ముద్రాశక్తులను అధిష్టింపచేసి,తాను వారినిక్కూడి "ప్రకట యొగిని" స్వరూపముగా చక్రేశ్వరి యైన "త్రిపుర"తో విరాజమానమైనది
  ఈ ఆవరణము పృథ్వీ తత్త్వప్రతీక.మూలాధారైక నిలయగా తల్లి చర్మ చక్షువులు గమనించగలుగు ప్రకట సిద్ధులతో,మహాలక్ష్మి సమేత సప్తమాతృకలతో,స్పందన/చైతన్యవంతమైన ముద్రాశక్తులతో,సాధకుని స్వస్వరూప దర్శన దిశానిర్దేశమునకు సహాయపడుతుంది.
 త్రైలోక్యమోహన చక్రములో నున్న సాధకుడు ద్వైత ప్రకృతిలోనే ఉంటాడు.తనౌపాధి-తన ఎదురుగా నున్న శక్తి,ఆ శక్తి అనుగ్రహముతో సాధన పురోగమనము చేయగలుగుతాడు.
  ఇది సాధకుడు తనలోని "అంతర్యామిని" అర్థము చేసుకునే అన్వేషణము యొక్క ప్రారంభదస్శ.ఎన్నో ఆకర్షణలు/ప్రలోభములు అడ్డుకుంటూనే ఉంటాయి.ఇంద్రియాలు చెప్పిన మాటవినమని మొరాయిస్తుంటాయి.
 అట్టి స్థితిలోనున్న సాధకునికి తమ శక్తి ద్వారా వస్తు ప్రపంచము శాశ్వతము కాదని,దానిమీది వ్యామోహము తగ్గకున్న సాధన దుర్లభమని తెలియచేస్తాయి.
ఉదాహరనమునకు,
 అణిమా సిద్ధి చిన్నపరిమాణముగా మారుట,చేతనులు తమకు తాము విషయవాసనలను తగ్గించుకుని సిద్ధము అయితే కాని ,బ్రహ్మీ స్థితిని పొందలేమని సత్యమును గ్రహించమంటుంది.అణిమ+ బ్రాహ్మీ సాధకుని స్పందన శక్తియైన/చైతన్య శక్తి యైన సర్వ సంక్షోభిణి శక్తికి పరిచయము చేసి,పంచేంద్రియ+పంచభూత సమన్వయ కర్తయై యోగసిద్ధికి సహాయపడుతుంది.
 శుక్ల-పీత-అరుణ వర్ణితమైన భూపురము త్రిపుర చక్రేశ్వరి అనుగ్రహముతో  సాధకుడు రెండవ ఆవరణమైన "సర్వాశాపరిపూరక చక్ర"ప్రవేశార్హతను కలుగచేస్తుంది.
   దేవీతత్త్వమును పరిపూర్ణముగా  ఆకళింపుచేసికొనిన మహనీయులు,
 అష్టసిద్ధుల విస్తార శక్తులే మహాలక్ష్మి సమేత సప్తమాతృకా శక్తులుగా,వాటి సహకరణ శక్తులేముద్రాశక్తులుగా  ఆరాధిస్తారు.
 ప్రకట యోగినుల సహాయ సహకారముల వలననే సాధకుడు రెండవ ఆవరణప్రవేశార్హతను పొంది సాధనను కొనసాగించ కలుగుతాడు.
  యాదేవి  సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
  నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.

   

 

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...