Thursday, July 11, 2019

DASAMAHAVIDYA-SHODASI


    శ్రీమాత్రే నమః
    **************
 " కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ
   భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తథా
   బగళా సిధ్ధవిద్యా చ మాతంగీ,కమలాత్మికా
   ఏతా ఏవ మహావిద్యాః సిధ్ధవిద్యా ప్రకీర్తితా

 నమామి షోడశీ మహాశక్తిం నిరంతరం.
శార్దూలము... త్రిపుర సుందరి వర్ణన.

పంచక్లేశ నివారిణీమ్ భగవతీమ్ పంచస్థితీమ్  ధారిణీమ్
పంచబ్రహ్మ మహాత్మ్య తత్వమఖిలమ్  భావార్ధమూలాత్మికామ్
పంచర్జ్యోతి శుభాంగరూప సహితమ్ పంకేరుహాలోచనీమ్
పంచప్రాణ నియంత్రిణీమ్ త్రిభువనీమ్ భృంగార తేజస్వినీమ్!

పంచక్లేశాలు = అవిద్య, అహంభావం, రాగము, ద్వేషము, సాహసము

పంచస్థితి = సృష్థి, పెంపుదల , లయ, అంతర్లీనము, అనుగ్రహము

పంచ బ్రహ్మ = సద్యోజాత, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశాన దేవతారూపములైన పరమశివుడు.

పంచ జ్యోతిర్లింగ సహితురాలు ; పద్మముల వంటి కన్నులు గలది
త్రిభువన = త్రిపుర
భృంగార తేజస్వినీమ్ = బంగారు తేజము కల ఓ త్రిపుర సుందరీ!









 ఆవిర్భావ కారణము
 ***************

   మార్కండేయ పురాణ కథనము ప్రకారము శివునిచే కాల్చబడిన మన్మథుని శరీర భస్మము నుండి తయారుచేయబడిన ఆకారము,బ్రహ్మ భండ-భండ (బాగు-బాగు) అనుటచే భండుడిగా,అతనిని తమోగుణము కప్పివేయగా అసురీగుణములకు లోబడుటచే,ధర్మమునకు గ్లాని జరుగుచున్న సమయమున వానిని సంహరించి,దైవకార్యములను కొనసాగించుటకు తల్లి ఆవిర్భవించినది.


   ఆవిర్భావ విధానము
  ********************
   స్వయంప్రకాశి,తన ప్రకాశముతో సర్వమును-సకలమును ప్రకాశింపచేఊగలతల్లి చిదగ్నికుండమునుండి ఆవిర్భవించినది.

 "చిదగ్నికుండ సంభూతా-దేవకార్య సముద్భవా" నమోనమః.

 రూపము
 *******

     " మనోరూపేక్షు కోదండా -పంచతన్మాత్ర సాయకా
       నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండలా" యైన తల్లి మనలను కరుణించి,బాలగా, షోడశిగా,త్రిపుర సుందరిగా,రాజరాజేశ్వరిగా,లలితగా ఏకానేక రూపములను లీలగా ధరించి మనలను దీవిస్తుంటుంది.ఏకానేక సమన్వయే తల్లి. శ్రీ మాత్రే నమః.సిందూర వర్ణముతో సుందరాతిసుందరముగా ఉంటుంది.నాలుగుచేతులలో పాశము-అంకుశము-చెరుకు విల్లు-పూలబాణములను ధరించి ఉంటుంది.పంచబ్రహ్మాసనాస్థితయై ఉంటుంది.
లోకాతీత సౌందర్యవతి లలిత.


  స్వభావము
  ***********

  సౌమ్య దశమహావిద్య యైన  షోడశి శ్రీకులమునకు సంబంధించినది.దక్షిణమార్గాధిదేవత.మార్గశీర్ష పూర్ణిమ తిథియందు ప్రీతికలది.కల్కి అవతారముతో సారూప్యము కలది.తల్లి సింహాసనపు నాలుగు కోళ్ళు బల్ల సృష్టి-స్థితి- సంహార-తిరోధాన-అనుగ్రహమను అను ఐదు అవస్థలకు అతీతమైన తురీయము తల్లి.అందువలన వానిని తన అధీనమునందుంచుకొని ఆసీనురాలైనది."పంచ బ్రహ్మాసనస్థితా-పంచ బ్రహ్మ స్వరూపిణి."

  తల్లి ఆయుధముల తత్త్వమును తెలుసుకోవాలంటే అనురాగము పాశము.అది ఇచ్ఛాశక్తి.ద్వేషము అంకుశము.రాగద్వేషములు పాశాంకుశములు.అంకుశము ఇచ్ఛాశక్తిని సంస్కరించే జ్ఞాన శక్తి.చెరుకు విల్లు-ఐదు పూలబాణములు క్రియాశక్తులు.

  తానై యున్న ఆత్మను తనకన్నా వేరుగా భావించేది పాశము.ఈ ద్వంద్వభావములను తొలగించేది జ్ఞానశక్తియైన అంకుశము.అదే తల్లి అనుగ్రహము.


  నివాసస్థానము
   *************
   శ్రీచక్రము త్రిపురసుందరికి ప్రతీక.అందులోని మహాబిందువు నుండి ఈశాన్య మూలకు విస్తరించిన శక్తి షోడశి.మణిద్వీపములోని ఏడు ఆవరణములను సర్వరోగహర చక్రముగా భావించి,ఆరాధిస్తారు.అదియే తల్లి నివాసము.  దేవి ఎనిమిదవ ఆవరణ మర్మచికిస్తా విధానమునకు ప్రాతిపదిక కనుక ఈ చక్రములో తల్లిని పూజించే నామాలు బాణి-చాపిని-పాశిని-అంకుశిని మొదలగు నామములు ఆకుపంక్చర్ విధానమే.

 అంతరార్థము
 ************

    వేదాంతసార ప్రకారము తల్లి సర్వరోగహర చక్ర నివాసిని.మూల మంత్రాత్మిక.సూక్ష్మ జ్ఞానకళగా మన శరీరములో కన్నులు-శిరము-కంఠములో నుండి మనలోని తమోగుణ ప్రభావములను తరిమివేయు,

  "శింజాన మణి మంజీర మండితశ్రీ పదాంబుజములకు సభక్తి సమర్పణమును చేస్తూ,

 " అవ్యాజ కరుణామూర్తి-అజ్ఞాంధకార దీపికా
   ఆ బాలగోప విదితా-సర్వానుల్లంఘ్య శాసనా"

ఫలసిధ్ధి
 *******

  శ్రీషోడశీమాత సాధకుల సకల కష్టనష్టాలను తొలగించుటయే కాక, వారికి మానసిక శాంతిని,భోగ-మోక్షములను ప్రసాదిస్తుంది.

https://www.youtube.com/watch?v=mySMnHywLUg&feature=youtu.be

" యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్
  తత్సర్వం క్షమ్యతాం దేవి శ్రీమాతానమో స్తుతే.

  అపరాధసహస్రాణి క్రియంతే అహర్నిశం మయ
  దాసో యమితి మాతా క్షమస్వ పరమేశ్వరి.

  యాదేవీ సర్వభూతానాం షోడశీరూపేణ  సంస్థితాం,
  నమస్తస్త్యై  నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః.














TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...