జన్మదిన శుభాకాంక్షలు
******************
శ్రీ సీతారామ శాస్త్రిగారు చేబ్రోలు
వినమ్ర వందనాలు వేలవేలు.
శారద నీరదతల్లికి గారపుబాలుడు ఇలను
సిరివెన్నెలలను కురిపించుట సిత్రమని అంటారా?
"చదువులతల్లి పోలికేమో"
శ్రీ.సి.వి.యోగి తనయునకు ఇలను
అద్భుతయోగము ప్రాప్తించుట సిత్రమని అంటారా
"తండ్రిగారి పోలికయేమో"
శ్రీమతి సుబ్బలక్ష్మి తనయునికి,అబ్బురపు పాటలు సిత్రమా
" కన్నతల్లి పోలికేమో"
పూజ్యులు శ్రీ సత్యారావుగారి శిష్యునికి,
జీవిత సత్యము చెప్పుట సిత్రమని అంటారా?
" గురువుగారి పోలికేమో"?
చిదానంద శివానంద కర్తకు,పది నందులు
సిత్తరమని అంటారా?
"పరమేశ్వరుని పోలికేమో"
త్రిభువనముల శుభముకోరు సుకవికి, కలమును ఖడ్గముచేయుట
సిత్రమని అంటారా?
"బహుశా ! సంస్కారపు పోలికేమో,"
కడలినే ఓడగ మలచు,ఘనకీర్తివరునికి ,నా పలుకులు
సిత్రమని అంటారా?
సిత్రముగాక మరేమిటి?
మనసులోని మమకారపు పోలికేమో?