Saturday, December 2, 2023

KADAA TVAAMPASYAEYAM-20




  



  

 కదా   త్వాం పశ్యేయం-20


 **********************




 " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయనశ్రోతైః అహం  ప్రార్థితం


   నమామి భగవత్ పాదం  శంకరం  లోకశంకరం".


 


 " ధర్మోమే చతురంఘ్రికః సుచరితః పాపం  వినాశం  గతం


   కామ క్రోథ మదాదయో విగళితా  కాలాః సుఖావిష్కృతః


   జ్ఞానానంద మహౌషధః సుఫలితా కైవల్యనాథే సదా


   మాన్యం మానస పుండరీక నగరవ్ రాజా వసంత స్థితే."




  ఓ కైవల్యప్రదాతా!


  నా చిత్తమను సు క్షేత్రమునందు (పంటభూమి)


 నీవు క్షేత్రజ్ఞుడవై/కాపువై-భక్తి అనే విత్తులను నాటు తూ,అవి నేనే నాటుతున్నానన్న భ్రమలో నేనున్నప్పటికిని,విత్తులతో పాటుగా పెరుగుటకు ప్రయత్నించు,పాపములను కలుపుమొక్కలను పెకలించివేస్తూ,సస్యకేదారుడవై,-పంట గా  "జ్ఞానసాధనమనే ఔషధమును/ఆహారమును 'ప్రతినిత్యము(మూడు నెలలకు/ఆరు నెలలకు,ఏదాదికి ఒకసారి కాకుండా) అందచేయమనై ప్రార్థిస్తూ,నాలుగుపాదముల ధర్మము నడుచు చిత్తముతో,ఈ నాటి బిల్వార్చనమును ప్రారంభించుకుందాము.




  దిశానిర్దేశము చేయాలనుకున్న నిటలాక్షుని కరుణ శంకరయ్య ను బహిర్ముఖుని చేసింది.ఐదు ఇంద్రియములను ఈశ్వరాయత్తము చేస్తూ,మనసనే పుష్పమును సమర్పించగలగటమే అసలైన పుష్పార్చనమంటూ,ప్రసంగమును ముగించారు.


  మంగళహారతిముగిసి న వెంటనే ఒక ప్రకటన అంటూ కార్తిక మాస పుణ్యసమయ సందర్భముగా మన గురువుగారు మనలనందరికి  శ్రీశైల మహాక్షేత్ర  సందర్శనమనుగ్రహిస్తున్నారట.రాదలుచుకున్నవారు వెంటనే  సిద్ధపడవచ్చును.కాని మన ప్రయాణము కాలినడకన-కనులారా మూడుకన్నులవాని లీలా వైభవమును సందర్శిస్తూ-సంభాషిస్తూ-సత్కీర్తిస్తూ...గొంతు గద్గదమైనది ఆ వ్యక్తికి.


  ఇంతలో శంకరయ్యకు పక్షుల కలకలం వినబడింది.ఏమయ్యా శంకరయ్య-మా  జట్టు ఉందామనుకుంటున్నావా?లేదా?



  మా నెమలి షరతు గుర్తుందా అసలు నీకు? అని అడిగినట్లుగా వినిపించింది?


  ఇదం కర్తవ్యం-మహేశా అని మరొకపక్కన భక్తసమూహము మల్లన్న పిలవటము-మేము రాకపోవటమా అని అత్యుత్సాహముతో అంగీకారమును తెలుపుతున్నారు.


 క్షణంసేపు ఆలోచించి,శంకరయ్య ఏకధాటి ప్రయాణమా లేక మార్గమధ్యములలో  కొంత విశ్రాంతి తీసుకుని పయనమును సాగిస్తామా? అని అడిగాడు వారిని.


 ఏమిటో ఈ శంకరయ్య పరిస్థితి?పయనము? ఎవరెవరో వస్తున్నారు-ఏవేవో చెబుతున్నారు?ఎన్నాళ్ళిలా ఉంటావని అడకనే గుర్తుచేస్తున్నారు? ఏమిచేయాలో చెప్పకుండా తనను ఇంకొకరితో జతకలుపుతూ,వింత మలుపులు తిప్పుతూ వీక్షిస్తున్నారు.


  అసలు నాకేమైంది?ఇప్పుడు నేనేమి చేయాలి అనుకుంటుండగా,ఒక బోయవాడు కన్ను పెరికి అర్పిస్తున్నాడు కన్నులముందు.రక్తంకారుతోంది.


 ఉలిక్కిపడ్డాడు.

 ఎదురుగుండా ,


" శ్రీశైలం శిఖరం దృష్ట్వా పునర్జన్మ న..."


 అని అత్యుత్సాహముతో గంతులేస్తున్నారు. 


  అప్పుడే అన్నీ సర్దేసుకుంటున్నారా అని వారిని అడిగాడు శంకరయ్య ఆశ్చర్యముగా.


 ముక్తకంఠముతో వారు,


 'నిన్ను విడిచి ఉండ లేమయా శ్రీశైలవాసా 


  నిన్ను విడిచి ఉండలేము మా


  కన్నతండ్రి నీవు కాద


  నన్ను వదిలివెళ్ళిపోకయా ఓమనోవాసా


  వెన్నుదండ నీవుకాదా


  మార్గబంధు తోడురావయా


  మారాము లేక,


  మార్గ బంధు తోడు రావయా,


 అని ఎగిరి గంతులు వేస్తున్నారు.

  శంకరయ్య మాటలు వినే పరిస్థితిలో వారులేరు.


 స్వామికి ఏమి సమర్పించాలో ఏ రూపములో సమర్పించాలో అనుకుంటుంటే,తన్మయత్వముతో వారిలో ఒకడు,


" భక్తిః మహేశ పుష్కరమా  వసంతీ


  కాదంబనీవ కురుతే పరితోష వర్షం"


  అంటూ నేను నాభక్తిని  మేఘమాలను చేసి స్వామి పాదయుగళ మనే ఆకాశమునకు అలంకరిస్తాను.పరమపావనమైన పాదస్పర్శచే ఆ మేఘమాల పులకాంకితమై ఆనందమను సుధను వర్షిస్తుంది.


 మీరు కూడా నాభక్తి మేఘమాల అని నాతో పోటీకి రాకండి అంటున్నాడు తక్కినవారితో.


 ఇంకొకడు సరేలే నేను నా భక్తిని,


 "ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం


  భిత్వా మహబలిభిః ఈశ్వరనామ మంత్రైః'


   


  నేను నాభక్తిని అంజనముగా చేయమని స్వామిని ప్రార్థించి,నా కన్నులకు అలంకరించుకొని,నిన్ను కాననీయని చీకటిని తొలగించుకుని...అని ఏదో చెప్పబోయే లోపున,




  ఈ సారి కథా కాలక్షప  అవకాశము స్వామి,మీకు అనుగ్రహించాడు.


  రేపు ప్రొద్దున బయలుదేరినప్పటి నుండి ఒక్కొక్క  కథతో మన పయనము.


 ముందుగా స్వామి విభూతి/మహిమ ను కథనము చేసుకుందాము.


  మీరు ఇప్పటివరకు ఏకాగ్ర భక్తి ఎన్ని వింతలు చేస్తుందో అన్న అంశమును తీసుకుని,విశ్వేశ్వర  విభూతి శ్రవణమును కొనసాగిద్దాము. 


  ప్రథమకథను మీలో ఎవరు చెబుతారు? అని ప్రశ్నించారు గురువుగారు?


  వెంటనే చేతినెత్తి,నేను,


 "శంకరయ్యను" ,మొదటి కథను ప్రారంభిస్తాను అన్నాడు అప్రయత్నంగా.


 అవాక్కయారు అక్కడనున్నవారు.


     కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ.

    'తన్మై మనః శివ సంకల్పమస్తు

     వాచే మమశివపంచాక్షరస్తు

     మనసే మమ శివభావాత్మ మస్తు".

     పాహిమాం పరమేశ్వరా.

    (ఏక బిల్వం  శివార్పణం)













  


TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...