Saturday, November 2, 2019

Eka bilvam SivaarpaNam

నః ప్రయచ్చంతి సౌఖ్యం-07

" ఓం తస్కరాణాం పతయే నమః"

********************************

అదుపుతప్పుచున్న అరిషడ్వర్గములను దోచు

పెద్ద దొంగ ఒక్కడే! దిక్కొక్కడే.

దొంగ ఒక్కడే

దేవుడు-జీవుడు ఒక్కడే

ధర్మము-మర్మము తానొక్కడే.

లోకాన దొర కాదు దొంగవని చాటాను

నా పాపరాశులన్నీ దొంగల్లే దోచేశావు

అని స్తుతింపబడిన మహేశ్వరుని చోరకళా విశేషములను తెలిసికొనుటకు ప్రయత్నిద్దాము.

" భగవంతుడు-భక్తుడు ఇద్దరు దొంగలే"

దొంగలరూపములో నున్న ఈశ్వరచైతన్యమునకు నమస్కారము.ఈశ్వర చైతన్యము చర్మచక్షువులకు కానరాకుండా,సకలచరాచర జీవరాశులయందు దాగియుండి వాటిని శక్తివంతముగా ప్రకటించుచున్నది కనుక ఈశ్వరుడు గుప్తచోరుడు.

రుద్రుడు "స్తేనానం పతి". గుప్తచోరుడు.మనకు దొరకకుండ రహస్యముగా మనలోనే దాగియున్నాడు.నమో నమః.

" కకుభాయ విహంగినే స్తేనానాం పతయే నమః."

ఉభయ నమస్కార గ్రహీత అయిన మన స్తేనాపతికి అనగా రహస్యపు దొంగలకు నాయకుడైన వానికి స్వజాతీయాభిమానము ఎక్కువే.

ఏ వికారములేని పరమాత్మ అనేక ఆకారములలో

ప్రకటింపబడుతు పాపములను దోచుకొనుచు ప్రాణులను సంస్కరిస్తుంటాడు.బహురూపములైన భగవత్తత్త్వమును భజించవే ఓ మనసా!

యజ్ఞశర్మ కుమారుడైన "గుణనిధి"కథ ని (గుప్తచోరునిగా మనము పరిశీలిస్తే) శివలీలావైభవమును స్తుతించకుండ ఉండలేము.వ్యసనలోలుడైన గుణనిధి తన విలాసములకు కావలిసిన ధనమునకై,తండ్రి పాండిత్య ప్రతిభా పురస్కారముగా లభించిన వజ్రపుటుంగరమును రహస్యముగా దొంగిలించినప్పటికిని,అంత్య కాలమ్ను స్వామి దవ్వుననున్న రవ్వంత పుణ్యఫలమును దరిచేర్చి,పాపములను దొంగిలించి,సామీప్య-సాయుజ్యములనిచ్చి సంస్కరించెను." ఓం నమః శివాయ."


మరికొందరు,


ప్రకటిత దొంగలు,ప్రత్యక్ష దొంగలు వీరు.వీరికి నాయకుడు మన నిటలాక్షుడు. ఎంతటి విలక్షణుడో!విరూపాక్షుడు.

పరోక్ష దొంగను సంస్కరించిన శివయ్య, ప్రత్యక్ష దొంగయైన మల్లుని రక్షించిన విధానము కడు రమణీయము..

మైసూరు సమీపములోని నంజనగూడు ప్రాంతములో "మల్లుడు" అను తస్కరుడు కలడు.అతను దారిమూలలో దాక్కొని, బాటసారుల సంపదను భయపెట్టి దోచుకునేవాడు
.ఏ పూజావిధానము తెలియని వాడు వీడు. కాని ఏ పూర్వపుణ్యమో తెలియదు కాని,కళ్ళుమూసికొనినప్పుడల్లా ఏలినవాడు ఎదముందుండేవాడు.సహ ఉద్యోగిపై .సహృదయతకు సాఖ్యమేమో.చతుషష్టికళలలో స్థానమును సంపాదిందించిన కళ కనుక ఏ మాత్రము తప్పుగా భావించక బందిపోటుగా మారినాడు.పెరుగుట తరుగుట కొరకేగా!

" నమః స్సోభ్యాయచ ప్రతిసర్యాయచ" పుణ్య-పాపముల లోకమునందలి జీవులను అనుగ్రహించువాడా! నమస్కారములు.పరమేశ్వర ప్రణామములు.

కాల భ్రమణములో మల్లుని నియమపాలన సమయము రానేవచ్చినది రాబోవు పరిణామములకు సూచనగా.

.మల్లునికి ఒక నియమము కలదు సంవత్సరాంతమున తాను దోచిన ధనమును మొత్తము ఉపయోగించి " కాట్రేడు జాతరను" కాటి-రేడు. ఘనముగా జరిపించి అమితానందమును పొందెడివాడు.ప్రతి సంవత్సరము ఇదే వీడివరస.వీడి పేరుపై "కల్లన మూలై" ఇప్పటికి విరాజిల్లుతోంది.నాటకమును రక్తి కట్టిస్తున్నాడు నందివాహనుడు.జాతర ముగియగానే తిరిగి మొదలవుతుంది వీడి దౌర్జన్య దోపిడి.భక్తిని తోసివేస్తోంది వీడి చోరశక్తి.

అన్నీ తానైన వాడు మిన్నకుండలేడుకదా!

" నమో నిచేరవే పరిచరాయా అరణ్యానాం పతయే నమః"

దొంగలించుటకు అవకాశమునకై వేచియుండు మల్లునిని కనికరించదలచినాడు.

అంతే కాదు "నమ:సస్పింజరాయ త్విషీమతే పత్తీనాం పతయే నమః"

బాటసారులను రక్షించు పింగళవర్ణధారి అనుచు వారు చేయుచున్న ఉభయ నమస్కారములను స్వీకరించి అనుగ్రహించదలచిన స్వామి,వెంటనే,

నమో ప్రతరణాయ ఉత్తరణాయచ" గా మారి ,

మల్లుని దౌర్జన్యపు గట్టు నుండి దయార్ద గట్టునకు చేర్చ దలచాడు అనుకున్నదే తడవుగా అద్భుతాలతో మల్లుని అంతరంగం పరవశించి,

మధురం శివనామం మదిలో మరువకే ఓ మనసా

జనులకు ఇహ-పర సాధనమేపలుకగ సురుచిర పావనమే అంటూ,కౄరుడు చిత్తచోరుని కీర్తించసాగాడు.కమ్ముకున్న కాఠిన్యము కరిగి పోయింది.కరుణ కదలక కూర్చున్నది కనులారా దర్శిస్తూ స్వామిని.బందిపోటును బంధించింది విశ్వేశ్వరానుగ్రహము..శివోహం.

కాఠిన్యమును కాల్చివేసినాడు ఆ కాముని కాల్చినవాడు.

మధురం శివమంత్రం మదిలో మరువకే ఓ మనసా!


భావజ సంహార-మమ్ముల కావగ రావయ్యా. అంటూ,-

బాటసారులు తమ సంపదను స్వచ్చందగా సమర్పించేవారు.మరింత వైభవముగా మల్లుడు మల్లేశ్వరుని జాతర జరిపిస్తు,స్వామి సాన్నిధ్యమును పొందగలిగాడు మల్లుడు."

" నమ:శంగాయచ-పశుపతయేచ" సర్వజీవులకు శుభములను కలిగించు సర్వేశ్వరా! దొంగల రూపములలో నున్న ఓ పెద్దదొంగ నీవు వారి కర్మఫలములను కానరాకుండా,కనుమరుగు చేయుచున్నావు.వాటిని తిరిగి వారి దరిచేరనీయుట లేదు.వారిని జీవన్ముక్తులుగా చేయుచున్న " ప్రణత దు:ఖద్రావక" నమో నమః.

స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

( ఏక బిల్వం శివార్పణం)

ఏక బిల్వం శివార్పణం.

sambho tavaaraadhanamu-by prasad nimmagadda,

  శంభో తవారాధనము-ప్రసాద్ నిమ్మగడ్డ.

1.ఆదిగురు.. ఆదియోగి.. శ్రీ చిదానందరూపా శివోహం..

జ్ఞానోపార్జన జేసి సప్త ఋషులున్ జ్ఞాతవ్య కామ్యార్థులై
ధ్యానధ్యేయ ధురంధరున్  త్రిభువనాధారాత్మకుండెవ్వడా
నానాయోగ విశారదా విభవమా నాగేంద్ర హారుండనెన్
మౌనాంతర్ముఖ ముద్ర నిద్ర మహిమే మార్గాంతరమ్ ముక్తికిన్ !!


2.గంగా జీవనదీ ప్రవాహ వరదాం  కాంతార్ధ దేహస్థితామ్  
భృంగస్వాంత విజృంభినీం రిపుహరీం భాండారి భార్యామణీమ్
సాంగోపాంగ సమస్త సృష్టి దమనాం సంవర్తకం  వర్తకామ్
శృంగశ్రేణి హిమాలయాలయకరాం  శాంతిప్రియాం శంకరమ్!

3.పూర్తింగొల్వ సుషుప్తి తృప్తి సుఖముల్ పూర్ణానురాగంబులున్
  మూర్తీ రూపముదాల్చి ముందు నిలిచెన్ ముక్తిన్ సదా జూపుచున్
  కార్తికంబునకామితార్థఫలముల్ కాత్యాయనీ నాథులున్
  ఆర్తిం దీర్చెడి ఆదిదంపతులనే యాచించి నే వేడెదన్.

4.4.ఆస్తుల్ దెచ్చు సమస్త బంధుజనముల్ ఆదంబరాలున్!గతిర్
  నాస్తిన్ నీ పదసేవతప్ప  గిరిజా నాథేశ్వరా! శంకరా
  మస్తిష్కంబును మీదుగట్టి మదిలో మంత్రంబుగా మార్చితిన్
  స్వస్తిశ్రీ శశిభూషణా త్రినయనా సర్వజ్ఞ సర్వాత్మకా.

5. ఎట్టి శ్రీశుభ మూర్తి రుద్రుడదిగో ఏకాదశ స్వామియే 
   జుట్టేమో సరిగంగ తానములహో జూటంబు బంధింపగా
   జట్టై యా దమరు త్రిశూలములవే చండ ప్రచండంబులౌ
   పెట్టిందా చిరుచంద్రవంక శిఖిపై ప్రేరేపణా శీతలా


 6.  బొట్టే,మో ప్రళయాగ్ని నేత్రరుచితో భూతాలకే సూచనై
     గట్టి శ్రేష్టి విషంబు కంఠవశమై గాంభీర్య్క్షేమప్రదా
     చుట్టూ చుట్టిన వాసుకీ చలనమే స్తోత్రించు నీ నామమే
     కట్టీందా కరిచర్మ మర్మమదిగో కారుణ్య వాత్సల్యమై

.7. పుత్రీ పర్వతరాజ నిశ్చిత యయెన్ పూజించి సేవించగన్
   నేత్రాగ్నిన్ నిశితంబు చేసి నిలిపెన్ నీరయ్యనా మారుడున్
   మైత్రీబంధము దారిచూపెను గదా మాంగల్య మంత్రంబుగన్
   చిత్రం విష్ణువు సూక్ష్మ సూత్ర కథనం సేనాధిపున్ జన్మమున్.

8.శ్రీరుద్రుండు భవాని శంకరుడటుల్ శ్రీకారమున్ జుట్టగా
  మేరున్నేలుచు మిథ్యలన్నియునవే మిన్నీరగున్ స్వామియే
  లేరన్నట్టి విశిష్ట వాదులెపుడో లీలామృతం గ్రోలుదుర్

  వేరే జన్మ నివారణంబవునుగా వేదాత్మలో లీనమై.



9.చిక్కేదారిని కోరిచేరి సలిపెన్ క్షీరాబ్ధిలో మంథననం
  దిక్కే తోచక దీనులైరి దివిజుల్ తేలింది హాలాహలం
  ముక్కంటిన్ ముదుతుణ్ణీ చేయ ముసలం ముద్రించె కంఠంబునన్
  పెక్కున్ జోతలు పర్చి కూర్చిరికదా పింగాక్షునిన్ దక్షతన్.

10.నానాసృష్టి విశిష్ట పుష్టి లయమున్  నైమిత్తికా న్యాయముల్
లీనంబై సమవర్తి చెంత మెదులున్  లీలా తిరోధానమున్
మౌనంగా  సమయానుకూల గతిలో మంత్రించి సృష్టింతువే
నీ నాట్యశ్రుతి పంచ తాండవములే  నిర్దిష్టముల్ నిత్యముల్!

తా: సృష్టి, పుష్టి, లయము నియమించబడిన (నైమిత్తిక) న్యాయములు. లయమైన పిదుప యముని చెంత తిరోధానములో సంచరణ జరుగుతుంది. ఆ స్వామి సమయము వచ్చినపుడు సృష్టి చేస్తాడు. ఈ కాలచక్రము ఇలా తిరుగుతూనేవుంటుంది. ఓం నమః శివాయ:

11మేమూ మాది అనేటి  నేటి జనమే మిథ్యా ప్రలోభంబులో  
సామర్థ్యంబును డబ్బుతో కొలుతురే సాయంబుకైనా సరే
సామీ జంగమ జాతి నీది  అటగా  జాగ్రత్త భిక్షంబులో
ఏమీలేని మసీధరుండవు గదా ఏమిత్తురో  ఏలికా!!


12. శార్దూలము... త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్...

తీగెన్ తెంచుకు కింద పండు పడుటల్ తీర్మానమౌ రీతిగన్
రాగద్వేషము రాలిపోవును యిసీ రామప్రియారాధనల్
సౌగంధ్యంబను పుష్టివర్ధనునినే స్థైర్యంబుతో గొల్వగన్
వేగంగా సుమగంధ సౌరభమునే వేద్యంబుగా నిచ్చుగన్   !

13.శార్దూలము.. తస్కరాణాం పతయే నమోనమః

దారిన్ గాచెడి దొంగలందరిని సర్దారై సమర్ధింతువే
వేరే వృత్తి నివృత్తి జేసి వడిగా విత్తంబుపై చిత్తమే
స్వారీ జేయని పద్ధతేదొ దొరికే  సాయమ్మునందింతువే
ఓరీ టక్కరి శంకరా భవహరా సోపానమే నీవురా!

14.భిక్షుండే యని గేలి చేసితిరి  గంభీరాకృతిన్ జూసిరిన్
దాక్షిణ్యమ్ము నుదార రూపు శివునిన్ ధ్యానించి వేడెన్  మరిన్
దక్షున్ ప్రాణము మేకతో నిలిపెగా  తధ్యంబయెన్ ధ్యేయమే
సాక్షీభూతుడు కాలభైరవు మహా సాష్టాంగమర్పించిరిన్!

15.నందీ వ్యాఘ్రము సింహ వాహనము లున్నారూఢులౌ వారుయున్
చిందేవేసెడి బొజ్జ నొజ్జయును మోసే మూషికంబున్ మరిన్
కందుండున్  శిఖివాహనంబు నెరుగన్  కామ్యార్థ రూపంబవన్
స్పందించే ప్రతి జీవి, దేహము సహా  సర్వంబు నీలాస్యముల్ !

బొజ్జ నొజ్జ = గణపతి
కందుడు = కుమారస్వామి

16.అన్నంబై యవనీతలంబు ఖలులన్ అంతంబునొందింతురే
మిన్నున్ వాతము నాయుధంబవునుగా  మేధమ్ముకై దుర్జనుల్
విన్నేధారలు గార్చి మేఘములవే విభ్రాజ దంభోళులున్
ఎన్నోవేలుగ రుద్రమూర్తి మసలున్ ఏకాత్మతత్వంబుతో!

తా: వేలవేలు రుద్రులు గా పృథ్వి మీద అన్నరూపములో ఖలులను అంతమొందిస్తారు, అంతరిక్షంలో వాయు రూపములో చీల్చి ఖండిస్తారు , దేవతా లోకంలో వర్షము రూపములో మేఘములు ప్రకాశవంతమై పిడుగులుగా దుష్ట శిక్షణ చేస్తూ ఉంటారు. ఇదంతా చేసేది ఆ ఏకాత్మకుఁడు సాంబసదాశివుడే!!

16.సర్వం సృష్టిలయంబునుస్థితిగతిన్ సామర్ధ్యమేవ్వాడిదో
పూర్వంబున్ పరమున్ యదార్థమెవఁడో  పూర్ణంబులో శూన్యమై
నుర్వీభృత్తు  నిమిత్త చిత్తు డెవడా  నూనంబు నేతృత్వమున్
గీర్వాణుండెవడా దధీచివలె సంఘీభావనోత్సాహుడై

  17.నిర్వాణంబున కాలవాలమెవఁడో నీకాశ సోపానమై
పర్వాంతంబున లీనమున్నెవడిలో ప్రాకార మధ్యంబునన్
సర్వశ్వేతుడు శాంతమూర్తుడెవడో  సర్వస్వమున్ తానయున్
శర్వుండాత్మభవుండునీశ్వరునికే  సాష్టాంగముల్ జేతుగన్!!

.18.గంగాతీర పవిత్ర దర్భలవిగో కాలాగ్ని తత్వమ్ములై
హంగుల్జూపెడి ఫేన్యమే మెదలె నాహార్యంబు హారంబుగన్
శృంగారించిన సైకతంబు వెలసెన్ సౌందర్య లింగమ్ముగన్
చెంగల్వల్లట తేలుచున్నిలబడెన్  జీవప్రవాహంబులోన్!
19.వాడెన్ బాలుని కంఠమున్ దునుమటల్  వాటైన  శూలంబునున్
చూడన్ శాంతము చిహ్నమౌను జగతిన్ సూచించుగా న్యాయముల్
వేడెన్ రాము పినాకధారి మహిమన్ విశ్వేశ్వరున్ శంకరున్
జాడన్ జూపె పినాకమే రణమునన్ జంపెంగ కోదండమై!

20.నాశంబైనది యజ్ఞవాటిక; "నమో" నామమ్ము మార్మోగెగా    
"మే" శబ్దంబును మేళవించి యగినిన్ మేలైనదే గోర మా-
హేశుండుత్రిశతాధికంబు వరముల్;  హేఠంబు తగ్గించుటల్;
ఆశీర్వాదము నిచ్చి మెచ్చ చమకంబాయెశ్రుతీ వేదమై!
 21.అన్నంబై యవనీతలంబు ఖలులన్ అంతంబునొందింతురే
మిన్నున్ వాతము నాయుధంబవునుగా  మేధమ్ముకై దుర్జనుల్
విన్నేధారలు గార్చి మేఘములవే విభ్రాజ దంభోళులున్
ఎన్నోవేలుగ రుద్రమూర్తి మసలున్ ఏకాత్మతత్వంబుతో
 22.వేలం వేయు దళారులైరి అకటా వేధించు వారందఱున్
పాలించే ప్రతివాడునూ ప్రమథుడై భారంబు తగ్గింపగన్
కాలం మారెడి కోరికే నిజమయే  కాత్యాయనీనాథుడా
శూలం వాడిన సూచనే కనపడే సూక్షమ్ము జూపింపుమా!
 23వాడెన్ బాలుని కంఠమున్ దునుమటల్  వాటైన  శూలంబునున్
చూడన్ శాంతము చిహ్నమౌను జగతిన్ సూచించుగా న్యాయముల్
వేడెన్ రాము పినాకధారి మహిమన్ విశ్వేశ్వరున్ శంకరున్
జాడన్ జూపె పినాకమే రణమునన్ జంపెంగ కోదండమై!
24గంగాతీర పవిత్ర దర్భలవిగో కాలాగ్ని తత్వమ్ములై
హంగుల్జూపెడి ఫేన్యమే మెదలె నాహార్యంబు హారంబుగన్
శృంగారించిన సైకతంబు వెలసెన్ సౌందర్య లింగమ్ముగన్
చెంగల్వల్లట తేలుచున్నిలబడెన్  జీవప్రవాహంబులోన్!

25.శార్దూలము.. నీ పద సన్నిధి... ఎన్నడో..

ఏమీలేని సమంజసంబు నదియే ఏకాత్మ భిన్నత్వమున్
స్వామీ నీపద సన్నిధే సుకృతమై శాంతమ్ము శోభిల్లఁగన్
సామీప్యంబు సదా సుదీర్ఘ గతియౌ సాధ్యమ్మయే సూచనల్
భూమీవాసుల కెన్నడున్  దొరుకునో  భూతాధిపా శంకరా!
26.శార్దూలము.. |నమో దున్దుభ్యాయచా హనన్యాయచ నమో ధృష్ణవేచ ప్రమృశాయచ|

ఆయనే
1. దుందుభినాదము;
2. దుందుభియును, మ్రోగించువాడును, మ్రోగించే కర్రయూ ఆయనే;
3. వెనుదిరగని  వీరుడూ ఆయనే;
4. శత్రువుల విషయములు సేకరించి యుద్ధ సన్నద్ధుడగు ప్రతిభాశాలి ఆయనే..

కింది పద్యములో శివాంశ సంభూతుడు మారుతికియున్న అటువంటి యుద్ధ కౌశలం  వర్ణన... దశపాదముల శార్దూలము.

తోకన్ జూసి శివాంశు బోల్చక ఖలుల్ తుచ్ఛంబులాడెన్ మరిన్
నాకేయా శివుడిచ్చెగా వరమునున్ నన్నేమి జేయున్ కపిన్
శోకంబే తగుశిక్ష దూతకు నికన్ చోద్యమ్ము జేయండనిన్
మైకంబెక్కిన  మూర్ఖరావణుడు సన్మానించె వాలమ్మునున్
దూకెన్ మారుతి లంకలో పిడుగులా దుందుభ్య సందోహము-
ద్రేకంబుప్రమథాది ధృష్ణునివలెన్ రేయిన్ బగల్ జేసెగన్
ఘీకారంబులికప్రతిధ్వని మహాకేరింతలున్ జేయుచున్
రాకాసుల్ గమనించు లోపు వడిగా  ప్రాకారముల్ జ్వాలలై
శ్లోకంబున్ జపియించి సేకరణమున్ జోడీల సామర్ధ్యమున్
నీ కారుణ్యము చేతనే విజయమున్ నిశ్చింతయున్నిల్చెగన్!


శార్దూలము.. శంభోతవారాధన మకుటము.. 19 శివావతారముల వర్ణన.

మర్మంబా శని  పిప్పలాదు కధలో మాహాత్మ్యమున్ జూపగన్
నిర్మాల్యంబును  నందిరూప ధృతితో  నిర్మూలనా న్యాయముల్
కర్మన్యాసము దక్షయజ్ఞ  సమిధల్  గంభీర  భద్రుండవై
నిర్ముక్తమ్ము నిరాశ నిస్పృహ సహా నిత్యాభియుక్తుండయెన్
తీర్మానంబుగ   బ్రహ్మ మార్మెడ నయెన్  దేవీ స్థలోధ్ధారణా
ధర్మంబున్ ధరియించి రక్షణము  యాద్యంతంబుగన్  భైరవున్
ధర్మద్రోణ కుమారుతో  భరత యుద్ధమ్మే సమాప్తంబయెన్
మార్మోగెన్  శరభున్ నృసింహ రణమున్ మాయావిలాసంబుగన్
కర్మానుష్ట శివాంశతో గ్రిహపతే  ఖ్యాతిన్ గనెన్ దిక్పతై
ధార్మిక్యంబున రూపకల్పన యదార్థంబైన దుర్వాసుడున్
ఊర్మిన్ బెంచెడి రావణున్ మరణమున్ ఊహించగా  మారుతిన్
దుర్మార్గంబును జంప నీవు వృషభా  దుర్భుద్ధి దూరమ్మయెన్
ధర్మాధర్మము నీవె సాక్షి యతినాథా గ్రాహకానుగ్రహా
మర్మార్థంబును కృష్ణ దర్శనమునున్ మర్మంబుగా జూపగన్
కర్మాకర్మ విశేష శేషములు భిక్షాన్నంబుగా భోజ్యమౌ
కర్మస్వాంత కిరాతకున్ గెలిచెగా కామ్యార్థుడై పార్ధుడే
కర్మణ్యమ్మవధూత నింద్రునికికన్  గర్వమ్ము ఖర్వమ్మయెన్
దుర్మానంబు హరింప జేయు విధులున్ త్రోవేగ యక్షేశ్వరా
ధర్మాత్ముండిక  సుంతతారకునిగా దాక్షాయణిన్ గోరెగన్
కర్మాధ్యక్ష పరీక్ష యింద్రునివలెన్;  ఘాటించగన్  భక్తుడున్
మర్మంబైన సురేశ్వరుండు నిలిచెన్ మాతాసమేతుండయిన్
ధర్మస్థాపన జేసె నీ నవదశా తత్వార్ధముల్ సూక్ష్మముల్! 

ఏ భాషా పలికించలేని పలుకుల్ ఎంతేని నిశ్చింతగన్
నా భారమ్మును తానె మోయుచును  నాణ్యంబైన నాథుండయెన్
శోభాలంకృతినిన్ స్తుతింప కదిపెన్  స్తోత్రమ్ములై  పద్యముల్
సౌభాగ్యంబది నీశ్వరేఛ్చయునదే శంభోతవారాధనల్ !!






Om Saanti :

..




TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...