GIRISAMCHA- ABHICHAAKASI

శివానుగ్రహము అర్థముగానిది.అద్భుతమైనది.అట్టడుగననున్న వారిని గట్టిగా పట్టుకుంటుంది.కొత్తదనమును చూపిస్తుంది.మత్తుకళ్ళను తెరిపిస్తుంది.పరమ కరుణాంతరంగుడైన పరమేశుడు నన్నొక పరికరమును చేసి నా చేయి పట్టుకుని తనకు తాను వ్రాసుకొనుచున్న వాక్యములే ఈ గిరిశంచ-అభిచాకశీ. ఇక్కడ పెద్దలు గిరిశంచ అను పదములోని గిరి శబ్దమునకు మూడువిధములైన అర్థములను వివరించారు. 1 మొదటిది గిరి కొండయందుండి (మన గుండెయందుండి) శం శుభములను కలిగించువాడు. 2.గిరులు-వేదములు వేదములయందుండి జగములకు మోదము కూర్చువాడు. 3.గిరి-ఇచ్చినమాట యందుండి ఆర్తరక్షణమును చేయువాడు. ఇట్టి మహిమాన్విత స్వభావుడు పరమశివుడు రుద్రుడై -అభిచాకశీ అన్ని వైపులా తన తేజముతో ప్రకాశిస్తూ,వానిని సమర్థవంతము చేస్తున్నాడు. భోళాశంకరుడు నేను ఏమి కోరుకోవాలో,ఎలా కోరుకోవాలో,ఎప్పుడు కోరుకోవాలో తానే నాకు స్పురింపచేసి నన్ను అనుగ్రహించుగాక.స్వామి దయతో మనము చమకముతో మమేకమై ఆనందసాగరములో మునిగి తేలుదాము. నమకములో సత్యం-శివం-సుందరమును దర్శించగలిగితే స్వామి కరుణ మనము కోరుకునే ప్రతి అభ్యర్థన మన ఆధ్యాత్మిక సాధనకు...