శ్రీమాత్రే నమః
**************
" కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ
భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తథా
బగళా సిధ్ధవిద్యా చ మాతంగీ,కమలాత్మికా
ఏతా ఏవ మహావిద్యాః సిధ్ధవిద్యా ప్రకీర్తితాః."
నమామి కమలాత్మికాదేవి మహాశక్తిం నిరంతరం.
శార్దూలము... కమల వర్ణన
చాతుర్ధార సుధా గజేంద్ర విలసత్ చాంపేయ చాముండినీమ్
హేతుర్భాగ్య విశారదా శుభద మాహేశ్వర్య దాక్షాయణీమ్
పాతివ్రత్య పరాయణీమ్ భగవతీమ్ పద్మాసనా సంస్థితామ్
జ్యోతిర్లోక పురాధి దేవి కమలజ్యోతీమ్ పరంజ్యోతినీమ్!
భావము: నాలుగు ఏనుగులు అమృత ధారలు పోయుచుండగా విలాసముగా ఉన్నది బంగారు (చాంపేయ) వన్నె చాముండి. భాగ్యానికి హేతువుగా నేర్పరి శుభాకారములను ఇచ్చు మాహేశ్వరి, దాక్షాయణి. పాతివ్రతత్త్వముకు ఆశ్రయము భగవతి పద్మాసనంలో స్థిరాసనము ఆమెది. కాలచక్రాన్ని నడిపే జ్యోతిర్లోక పురాధిపతి కమల ఆమె జ్యోతి పరంజ్యోతియే!
శ్రీ మాత్రే నమః
*************
" కాంత్యాంకాంచన సన్నిభాం హిమగిరి ప్రఖ్యైశ్చతుర్భిగజైః
హస్తోత్ క్షిప్త హిరణ్య యామృత ఘటైరా సిచ్యమానం శ్రియం
బిభ్రాణాం పరమబ్జ యుగ్మను భయం హస్తైః కిరీటోజ్వలాం
క్షౌమాబధ్ద నితంబ బింబవలితాం వందేం అరవిందస్థితాం.
నాలుగు దిగ్గజములు పసిడికలశములతో సుధాభిషేకమును చేస్తూ,సేవించుచున్నసమయమున,రెండుచేతులలో పద్మములను ధరించి,పద్మాసన సంస్థితయై బంగారు కాంతులతో ప్రకాశిస్తు,భక్తపాలనమునుచేయుచున్న కమలాంబకు నమస్కరించుచున్నాను.
ఆవిర్భావ కారణము.
*******************
భృగుమహర్షితపస్సునకు మెచ్చి,పుత్రికయై భార్గవిగా జన్మించెనని పెద్దల అభిప్రాయము.
" భద్రాణిమే దిశతు భార్గవనందనాయై."
సనత్కుమార కథనము ప్రకారము పూర్వము కృత యుగమున సృష్టిలోని సర్వజీవులు మరణమును మించిన దుఃఖకర దారిద్రముతో బాధపడుచున్న సమయమున బ్రహ్మ శ్రీహరిని దారిద్రనివారణ-ధర్మ సంస్థాపనకై శ్రీ హరిని ప్రార్థించగా,కరుణాంతరంగుడైన విష్ణువు తనహృదయకమలము నుండి కమలాత్మికను అనుగ్రహించాడని చెబుతారు.
"విష్ణు వక్షస్థల స్థితాయై నమ:."
ఆవిర్భావ విధానము
********************
శ్రీహరి హృదయపద్మమునుండి తల్లి ఆవిర్భవించినదని పురాణగాథలు తెలుపుచున్నవి.
రూపము
*******
" కోటి బ్రహ్మాండ మధ్యస్థా కోటి బ్రహ్మాండకారిణీ
శ్రుతిరూపా శ్రుతికరీ శ్రుతిస్మృతి పరాయిణీ
జ్ఞానజ్ఞేయా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయ వికాసినీ
స్వఛ్చందశక్తిః గహనా నిష్కాంపార్చిః సునిర్మలా
సురూపా సర్వగా పారా బృమ్హిణీ సుగుణోర్చిత.
కమలాత్మిక రూపమును వర్ణించి తరించిన శ్రీ ముత్తుస్వామి దీక్షితారుని స్మరించి,నమస్కరించుకుంటు అనితరసాధ్యమైన అమ్మ రూపమును వర్ణించుట మందభాగ్యురాలినైన నాతరమా? ఆ తల్లి కరుణతో గుహ్యమైన రూపవైభవమును ఒకింత దర్శించుటకు ఈ ప్రయత్నము.
" పద్మస్థా పద్మనిలయా పద్మమాలా విభూషితా
పద్మయుగ్మధరా కాంతా దివ్యాభరణభూషితా
విచిత్ర రత్నమకుటా విచిత్రాంబర భూషణా
విచిత్రమాల్య గంధాఢ్యా విచిత్రాయుధ వాహనా
మహా నారాయణీ దేవీ వైష్ణవీ వీరవందితా."
మరికొన్ని సందర్భములలో శ్వేతవస్త్రధారిణియై,నాలుగు చేతులలోను జపమాల-పుస్తకము,పాశాంకుసములను ధరించి సౌమ్య మూర్తిగా శోభిల్లుతుంటుంది.
స్వభావము
*********
" అకలంకా నిరాధారా నిస్సంకల్పా నిరాశ్రయా
అసంకీర్ణా సుశాంతా చ శాశ్వతీ భాసురీ స్థిరా
అనౌపమ్యా నిర్వికల్పా నిర్యంత్రా యంత్రవాహినీ
అభేద్యా భేదినీ భిన్నా భారతీ వైఖరీ ఖగా."
శ్రీహరిహృత్కమలమనే జగత్సముద్రములోనుండి ఆవిర్భవించిన కమలాంబ శ్రీవిద్యాకమలము.ధన-ధాన్య-లావణ్య సౌభాగ్య-సంతాన ,సత్సౌఖ్యములన్నిటిని ప్రసాదించు తల్లి కమలాంబిక.ఇది తెలిసిన త్యాగరాజస్వామి,కమలాంబ నా చింత తీర్చవమ్మా, అని ప్రార్థించి,పరమానందభరితులు కాగలిగినారు.సౌందర్య ప్రతీక-మహారాత్రియైన కమలాంబ సదాశివుని శక్తిని కలుపుకొని పరిపూర్ణమవుతుంది.మార్గశీర్ష అమావాస్య తిథి తల్లికి ప్రీతిపాత్రము.మూల బిందువు నుండి నైరుతి మూలకు విస్తరిస్తుంది.
సప్తశతి ప్రాధమిక దశలో కమలాంబను ప్రధానప్రకృతిగా వర్ణిస్తారు.పార్థివ దేహములలోని దివ్యభావములను ప్రదర్శించే శక్తి కమలాంబయే.
ఆయుధములు
**********
"శూలినీ చక్రిణీ మా చ పాశినీ ఖడ్గధారిణీ
గదినీ ముండమాలాచ కమలా కరుణాలయా."
నివాసస్థానములు.
****************
" సర్వశక్త్యాత్మికాచైవ విశ్వం వ్యాప్త వ్యవస్థితా
సర్వైశ్వర్య గుణోపేతా నిత్యశుధ్ధ స్వరూపిణీ
ప్రాణశక్తిః పరాహ్యేషా సర్వేషా ప్రాణినా భువిః."
శుధ్ధోపాసనల సచ్చిదానంద కమలాంబ అనాహత చక్రనివాసిని.ఎక్కడ ధర్మము తేజరిల్లుతుంటుంద కమలాంబిక అక్కడ ఉంటుంది.
దేవాలయములు
*************
తిరువారూరు లోని త్యాగరాజ దేవాలయ సమీపమున గల కమలాంబ కొలను,కమలాంబ దేవాలయము
"జయంకరీ మధుమతీ హరితా శశినీ శివామూలప్రకృతిః ఈశనీ యోగమాతా మనోజవా" మంగళాశీస్సులతో మనలను అనుగ్రహించు చున్నవి.
అంతరార్థము
***********
మత్స్యావతారమునకు ప్రతీకగా భావించే కమలాంబికను ,
మత్స్యపురాణములో సర్వాభరణధారిగను,ఎడమచేతిలో పద్మము-కుడిచేతిలో బిల్వపత్రముతో మత్తేభ కుంభ సుధాభిషేకముతో,గంధర్వ గణ సేవలతో తల్లిని భావించారు.
అగ్నిపురాణము శంఖ-చక్ర-గద -పద్మ ధారిణిగా కీర్తించింది.
స్వతంత్రమూర్తిగా ఉన్నప్పుడు,విష్ణు సంపర్కము లేని శక్తి) నాలుగు చేతులలో పద్మము-అమృతపాత్ర-శంఖము-బిల్వ పత్రములను ధరించి సింహాసనారూఢయై చిద్విలాసముతో ఉంటుంది.శంఖము అదృషమునకు ప్రతీక.బిల్వములు ప్రపంచమునకు గుర్తుగా చెప్పబడినవి
జగస్థితే-జగన్మాత యైన కమలాంబిక పవిత్ర చరణములకు సభక్తిపూర్వక సమర్పణమును చేస్తూ,
" త్రిలోకజననీ తంత్రా తంత్రమంత్ర స్వరూపిణి
తరుణీచ తమోహంత్రీ మంగళా మంగళాయనా."
" యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవి శ్రీమాతానమో స్తుతే.
అపరాధసహస్రాణి క్రియంతే అహర్నిశం మమ
దాసో యమితి మాతా క్షమస్వ పరమేశ్వరి.
యాదేవీ సర్వభూతానాం కమలాంబరూపేణ సంస్థితాం,
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః.
శార్దూలం వృత్తం
వ్యక్తావ్యక్త చిదంబరీమ్ త్రినయనీం వ్యాఘ్రామ్ మహోద్వేగినీం
ముక్తా విద్రుమ హేమ నీల ధవళా మూర్తిం మనోల్లాసినీమ్
శక్తిమ్ స్త్రీ దశవర్గ శోభి కరుణా సంధాయినీమ్ శాంభవీమ్
భక్తిమ్ దేహి మదీయ హృత్కమల శోభాలంకృతాడంబరీమ్!
సర్వేజనా సుఖినో భవంతు-సమస్త సన్మంగళాని భవంతు.
స్వస్తి.మాతా నిర్హేతుక కృపాకటాక్ష ప్రాప్తిరస్తు.