Thursday, January 6, 2022
TIRUPALLI ELUCHCHI-02
తిరుపళ్ళి ఎళుచ్చి-02
******************
అరుణన్ ఇందిరన్ దిశై అణుగినన్ ఇరుళ్పోల్
అగండ్రదు ఉదయం మలత్తిరు ముగత్తిన్
కరుణన్ శూరియన్ యలయళ నయన
కడిమలర్ మలరమర్క అణ్ణవన్ కణ్ణా
తిరన్ నిరై అరుపదం మురల్వన్ ఇవైయోం
తిరుపెరుంతురై శివపెరుమానే
అరుళిరి తరవరం ఆనందమలయే
అలకడలే పళ్ళి ఎళుందరుళాయె
ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివః స్స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమః సోమోహ్యపాంపతిః
**********
పోట్రి పదముతో ప్రారంభమయిన తిరుపళ్ళి ఎళుచ్చి లో స్వామి ముఖమలముల -పాదపద్మముల కాంతిని కెందామరలు తంతో వెంట తెచ్చుకొని,సూర్య కిరణముల స్పర్శానుగ్రహముచే వికసనమును పొంది ప్రకాశిస్తున్నట్లుగా వివరించారు తిరుమాణిక్యవాచగరు.
పళ్ళి ఎళుచ్చి పదిభాగములు భగవంతునికి-భాగవతులకు గల అవినాభావ సంబంధమును అందించుచున్నవే.
మన చెలులు స్వామి సుప్రభాత సేవకు వెళుతో కొలనులో వికసించుచున్న కెందామరలను తమ హృదయకమలముతో అనుసంధానము చేసుకొని అనుగ్రహపాత్రులైనారు.
కొంచము ముందుకు తమ అడుగులను కదిపారో లేదో వారి ఆలోచన కెందామరలను అనుగ్రహించిన భానుకిరణములవైపునకు మళ్ళించినాడు పరమాత్మ.
చెలి తామరలు స్వామి ముఖకాంతిని తెచ్చుకున్నాయనుకున్నాముకదా.వీటితో పాటుగా,
మలత్తిరు ముగత్తిన్-స్వామి ముఖారవింద కాంతులను,
ఈ భానుడు కూడా తనతో తెచ్చుకొని మనకు ప్రత్యక్షదర్శన (స్వామిదర్శన) భాగ్యమును అనుగ్రహిస్తున్నాడు.అనగానే
వేరొక చెలి అవునవును
అసలు ఈ సూర్యోదయమునకు స్వామి ముఖకమలమునకు అభేదము లేనేలేదు.
తూరుపు వేకువ చూస్తున్నావా చెలి
అది మన స్వామి కనులనుండి వస్తున్న
యళ యళ నయన-స్వామి కన్నుల కాంతియే కరుణతో సూర్యోదయము కదా.
స్వామి దర్శనమును పొందుచు మన కన్నులు ఆనందముతో కాంతివంతములైనవి కదా.
మన కన్నుల కాంతి-స్వామి కన్నుల కాంతికి బింబ-ప్రతి బింబలుగా భాసించుచున్నవి అని తేజస్వినులైన వారు తమ అడుగులను కదుపుతూ,మనసులో తమ ఆలోచనలను జరుపుతూ తిరిగి సంభాషణమునకు ఉపక్రమించారు.
ఇరుళ్పో-చీకట్లు బాహ్యములో-వారి ఆంతర్యములో
తొలగి,వేకువరేకలు వ్యాపించుచున్న సమయమున వారి మనసు
అలై కడలే గా మారినది.
స్వామి పూర్ణచంద్రుని ముఖదర్శనముతో ఆనందమను కడలిగా మారిన వారి మనసులో అర్చనాసక్తములైన హృదయములనే అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.
వారి మనము కడలిగా మారిన సమయమున వారి దేహములు ఆనందమలయే గా ఆనందస్వరూపముగా/ఆనందపర్వతమైన అరుణగిరిగా తననుతాను మలచుకుంటున్నది.
నిద్రా-జాగ్రత్-సుషుప్తి దశలను అధిగమించి,అంతర్ముఖమై ఆనందావృష్టిలో/
సుధాసారాభివర్షములో మునకలు వేస్తున్నది.
తిరుమాణిక్యవాచగర్ మనలను సైతము ఆ దివ్యానుభూతికి పాత్రులను చేయుటకు
ఓ మనసా! మేల్కాంచు.
స్వామి అనుగ్రహవర్షములో అనుక్షణము ఆనందించు అని తెలియచేస్తున్నారు.
అసలు మనలను తిరుపెరుంతురైలోని స్వామి దగ్గరకు చేర్చుచున్న మహానుభావుని గురించితెలుసుకొనే (క్లుప్తముగా) ప్రయత్నముచేద్దాము.
శంభుపాదాశ్రితుడు-శివజ్ఞానవతుల పుణ్యఫలము మనకు తిరువాచకమును అందించిన మహనీయుడు.వడగూరుకు చెందినవాడు కనుక ఆయనను ప్రజలు తిరువడగూరార్ అని సంబోధించేవారు.సాక్షాత్తు జగదంబ అందించిన జ్ఞానక్షీరమును పానము చేసిన మహానుభావుడు.పరమేశుని గురించి పరవశిస్తూ పాడుకునేవాడే కాని పదిమంది కోసము వాటిని భద్రపరచవలెనన్న తలపును కూడ దరిచేరనీయని తన్మయత్వముతో తరించువాడు.
భగవంతుని లీలలు బహువిచిత్రములు.భావనాతీతములు.తాను వ్రాయసగాడుగా మారాలనుకున్నాడు ఆ మీనాక్షిసుందరేశుడు.అతిథిగా వచ్చి వ్రాసే అవకాశమును,సొంతము చేసుకున్నాడు.
ఆగని అమృతధారలను ఆస్వాదిస్తూ అతి పదిలముగా భద్రపరుస్తున్నాడు ఆదిదేవుడు.అసలేమి జరుగుతోందో కూడా అవసరములేని అంతర్ముఖము ను ఆశీర్వదిస్తు,నీ మాటలు మాణిక్యములు.మరేవియును వాటిసాటిరావు అని," మాణిక్యవాచగర్" అను నామకరణమును చేశాడు వాత్సల్యముతో.కన్నులు తెరిచి చూస్తే అక్కడ అతిథిలేడు.
ఆదిదేవుని కరుణ ఆఖరి వాక్యముగా వడగూరన్ చెప్పగా అంబల్వన్ వ్రాసినట్లుగాను,సంతకము
"తిరు చిట్రంబలం" గా దీవిస్తున్నది.
అంబే శివే తిరు వడిగళే శరణం.
Subscribe to:
Posts (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...