DASAMAHAVIDYA-MATANGI

శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ వాణీం చతుర్బాహునీమ్ గీతం వాచక నాద నృత్య నిధి సంఘీభావ సంపూజనీమ్ మాతంగీమ్ హరితాం సుశోభి సుమతీమ్ మంత్రిత్వ సంచాలకీమ్! భావము: ఆశ్రయము (ఊతం) ఇచ్చి భద్రంగా చూసే విష్ణురూప (సుభద్ర) రుద్రకామినీ ఉచ్చిష్ట చండాలిని గా పేరుపొందావు. ఎరుపు వస్త్రములతో ఆభరణములతో కాంతివంతముగా కప్పుకున్న (సంపుటి) నాలుగు బాహువులు గల సరస్వతీ. నృత్య నాట్య సంగీత వాచకములకు నిధివి, ఐకమత్య బోధకురాలివి కడుపూజనీయురాలివి. ఓ మాతంగీ! ఆకుపచ్చ రంగులో శోభిల్లు బుద్ధిమంతురాలివి, ఆ లలితా మాతకు ప్రధాన మంత్రి గా సంచాలకము చేస్తున్నావు. నమస్కారములు! శ్రీ మాత్రే నమః ******************** " మాణిక్యవీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళా వతంసే కుచోన్నతే కుంకుమరాగ శోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్ప బాణ హస...