Sunday, December 25, 2022

AALO REMBAAVAAY-11

 


పాశురము-11

 *************

 కుండలినిశక్తిలా చుట్టుకునియున్న జీవాత్మా  నీవు అనేక గ్రంధులను ఛేదించుకొనుచు ముగిల్వణ్ణన్ అను  సహస్రారమును  చేరవలసిన పున్మయిల్ వనమయూరివి.తాదాతంత్యతను వీడి  జాగరూకము కమ్మా అంటూ అన్యాపదేశముగా యోగరహస్యములనందించుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,అమ్మ అనుగ్రహించినంతమేరకు పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నము చేద్దాము.



   కట్రుక్కరవై కణంగళ్ పలకరందు

   శెట్రార్తిరళలియం శెన్రు శెరుచ్చెయ్యుం

   కుట్రం ఒన్రిల్లాద కోవలరం పొర్కిడియె

   పుట్రు రవల్గున్ పునమయిలే పోదారాయ్

   శుట్రుత్తు తోళీమార్ ఎల్లారుం వందు నిన్

   మూట్రం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్పాడ

   శిట్రాదే-పేశాదే సెల్వన్ పెండాట్టి, నీ

   ఎట్రుక్కు ఉరంగుం పొరుళేలో రెంబావాయ్.


   నమో భగవతే శిఖి పింఛాయ నమః.

   ************************

 ప్రస్తుత పాశురములో :కుట్రం ఒన్రిల్లాద" ఒక్క దోషమును,లేశమైనను కానరాని గోపిక నిదురలేపబడుచున్నది.

 మరొక్క విషయము కణంగళ్ -సమూహములు " అను పదము ప్రాధాన్యతను కలిగియున్నది.

 ప్రతి అంశము నిష్కళంకమే-పరమార్థ సమర్పణమే.

  కట్రుంకరవై కణంగళ్-స్వామి అనంత కళ్యాణ గుణవైభవములు-అర్థించకనే అనుగ్రహిస్తుంటాయి.అదియును పుష్కలముగా .అవియే పాశుర ప్రారంభముగా చెప్పబడుచున్న పాడి ఆవుల సమూహములు.

  1. మన గోకులములోని గోవులు కూడ గోవిందుని వీక్షిస్తూ,వేణుగానమును వింటూ,స్పర్శను అనుభవిస్తూ,గుంపులుగుంపులుగా పెరుగుతూ,అందమైన లేగదూడలను కలిగి,తమకు తామె పుష్కలముగా క్షీరమును అనుగ్రహిస్తున్నవి.పితుకకున్నను అధికముగా (అనుగ్రహమును) వర్షించుచున్నవి.

  అంటే మనపూర్వపుణ్యభాగ్యముగా మనలను అనుగ్రహించుటకు ఆచార్యులు గోకులములో గోవులవలె తిరుగుతు,గోవిందుని వీక్షిస్తూ,వేణుగానమును వింటూ,స్వర్శను అనుభవిస్తూ,గుంపులుగుంపులుగా నడయాడుతూ,అందమైన శిష్యులను కలిగి తమకుతామె క్నానాబుగ్రహమును పుష్కలముగా తమకుతామె అనుగ్రహించుచున్నారు.

 2.ఓ బంగారుతీగె! నీ అన్నలు

 కుట్రం ఇన్రు ఇల్లాద శెట్రార్తిరళలియం శెన్రు,

 అతిబలపరాక్రమవంతులు.తమకు తాము శత్రుస్థావరములను/బలమును గుర్తించి,వారిపై దండెత్తి మట్టుపెట్టువారు.అంతః శత్రువులకు సైతము అదేగతి.

 వారి పరాక్రమ ప్రదర్శన కేవలము శత్రువులమీదనే.

 శెట్రాల్-శత్రువుల

 తిరళ్-బలపరాక్రమములను తెలిసికొని

 వారిని విజృంభింపనీయక

 శెరుచ్చెయ్యం-తామే వారిపై దండెత్తి,

 అరళియం-మట్టుపెట్టి వచ్చువారు.

  మిగతా సమయములలో వారు గో-పోషణమను స్వధర్మవృత్తిని/సత్వగుణను కలిగియున్నవారు.

 గోకులమునకు శత్రువులు గోవిందుని భక్తుల శత్రువులు.వారు బాహ్యశత్రువులైన కంసాది అసురులైన కావచ్చును-అంతః శత్రువులైన ధర్మవిరుద్ధకార్యాచరులైన కావచ్చును.

   అట్టి శత్రువులను విజృంభించనీయని పరాక్రమము కలవారు.


  నీ

  ఎట్రుక్కు ఉరంగుం? నీ ఈ నిద్రాస్థితి ఏమిటి? 

  నీవు నీలమేఘుని చూడగనే పురివిప్పి నాట్యమాడు వనమయూరివి.కాని ఇప్పుడు పుట్రు రవల్గున్,

 పుట్టలో నిదురించుచున్న పామువలె చుట్టుచుట్టుకుని పడుకునియున్నావు.

   నిన్ను నోమునకు తీసుకునివెళ్ళటకు,

 

శుట్రుత్తు తోళీమార్ ఎల్లారుం వందు -బంధువులు-మిత్రులు అందరము వచ్చాము.

ఎవరా బంధువులు?


పరమాత్మ సేవాబంధమున్నవారు.


ఏమిటా మిత్రత్వము?


స్వామిపాదసేవా మిత్రత్వము.


కీర్తిస్తు వచ్చి ప్రవేశించాము.ఎక్కడికి?


నిన్-ముట్రం-పుగుందు-నీ ఇంటి ముంగిటి లోనికి ప్రవేశించాము.మమ్ములను స్వామి అనుగ్రహించుతకై,మేము స్వామిని కీర్తించగలుగుటకై నీ అంతర్ముఖత్వమును వీడి,

సెల్వన్ పెండాట్టి-ఓ భాగ్యశాలిని,

నీ-నీయొక్క,


ఉరంగు-నిద్రకు/ధ్యానమునకు,


పొరుల్-ధ్యేయము,


ఎట్రుక్కు-కారణము


మాకు తెలియకున్నది.

 నీవు మాతో


శిత్తాదే-పేశాదే-ఉలుకకున్నావు-పలుకకున్నావు.

 కోవలరం పొర్కిడియె

 గోకులములోని ఓ బంగారు తీగ ,మేల్కాంచి




,మాతో వ్రతమును జరిపించుటకు కదిలిరామ్మా, అంటూ,


ఆ గోపికను తమతో కలుపుకొని వెళ్ళుచున్న,

 ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.








TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...