TANOTU NAH SIVAH SIVAM-11@SIVATANDAVASTOTRAMU
తనోతు నః శివః శివం-11 ******************* "వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వండే పార్వతీ పరమేశ్వరౌ" " కనిన జనని కన్న ఘనదయ దాయక ఇదియ అనుగ్రహము అరుణాచల " అంటున్నాడు రావణుడు.(ఇది నా ఊహ) తన తల్లి నిత్యశివపూజ-సైకత లింగము సముద్ర తరంగములచే రూపు మారుట-తల్లి ఆవేదనము-ఆత్మలింగమును అభ్యర్థించుటకై తన కైలాస ప్రయాణము-స్వామి దర్శనమునకు అనుమతించని నందీశ్వరునిపై/స్వామిపై ఆగ్రహం కైలాసమును కదిలించబోయి తన అహంకారము అన్నీ అదృశ్యమైనవి. స్వామి తాండవమును తన్మయుడై చూడగలుగు దర్శనశక్తి లభించినది. "అళగు సుందరముల వలె చేరి నేను నీవు ఉందము అభిన్నమై అరుణాచలా" అంటున్నాడు. అవ్యాజకరుణ తథాస్తు అన్నదా అన్నట్లుగా, "ఓం జాతవేదసే సునవా మసోమ" అంటూ దుర్గా సూక్తము శ్రవణానందమును కలిగిస్తున్నది. మరొక పక్కన " తాం ఆవహజాతవేదో లక్ష్మీం అనపగామినీం" అంటూ శ్రీసూక్తము శృతి శుభగముగా వినిపిస్తున్నది. " త్రయంబకం యజామహే సుగంధిం...