AALO REMBAAVAAY-08
.jpg)
పాశురము-08 ************ గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,అనుగ్రహించినంతమేరకు పాశురమును అనుసంధానము చేసుకుందాము. కీళ్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు మేయాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైకళుం పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు కూవువాన్ వందునిన్రోం కోగులం ఉడయ పావాయ ఎళుందిరాయ్ పాడి పరై కొండు మావాయ్ పిళందనై మల్లనె మాట్రినాయ్ దేవాదిదేవనై శెన్రునాం సేవిత్తాల్ అవావెన్రు ఆరాయంద్రు అరుళేలో రెంబావాయ్. ఓం నమో నారాయణాయ ******************** తెల్లవారుచున్నది.తూరుపున వెలుగురేఖలు కనబడుచున్నవి.పశువులు చిరుమేతకు తరలినవి. దేవాదిదేవుని నోమునకు వెళ్లుచున్నవారిని/వెళ్లుటకు సిద్ధమగుచున్నావరిని,కొంతసమయము నిలువమని మేము నిన్ను మేల్కొలుపుటకు వచ్చి,నీ గుమ్మము ముందర నిలబడి నిన్ను పిలుస్తున్నాము.అన్నది వాచ్యార్థము. కోగులం ఉడయ-కుతూహలము కొత్తచిగురులు తొడుగుచుందగా 1.తూరుపుదిక్కు చీకట్లను పారద్రోలుచు వెలుగు రేఖలను ప్రసరించుటకు కుతూహల పడుచున్నది. 2.పశువులు (ఎరుమై) కొంచము...