HAPPY VISVAVASU UGADI-2025

ఉగాది శుభాకాంక్షలు. ***************** వసుధను వసుమయం గావించు సమయమాసన్నమయినదని ,అరవై వత్సరముల తరువాత, అరుదెంచుచున్నావా "విశ్వావసు వత్సరమా" "ఆత్మీయ స్వాగతము." గ్రహముల గుణదోషములను ఆగ్రహానుగ్రహములను గణన ఉన్న ఉండొచ్చును కాని, అసలు, అతిమెల్లగ కదులుటచే ముప్పది సంవత్సరాల సమయము పట్టుతుంది శనికి చుట్టడానికి పన్నెండు రాశుల చక్రాన్ని. మెల్లగ కదులుటచే పన్నెండు సంవత్సరాల సమయము పట్టుతుంది గురువు చుట్టడానికి పన్నెండు రాశుల చక్రాన్ని 30:12 సంవత్సరాల కనిష్ఠ సామాన్య గుణిజమే 60 అందుకే తెలుగు సంవత్సరాలు అరవై. ఓరుపు నేర్పిస్తాయి నేరుపుగ ఈ గ్రహములు, , అరవై సంవత్సరములు, జాబిలి కూతురులో లేదా నారద కుమారులో వాటిపేర్లు ప్రభవ నుండి అక్షయ అని వరాహమిహిరుడు అన్నాడు భృగుసంహితలో వారించబడక కొనసాగుతున్నాయి కాల గతిలో గురువు-శని తమ గమనములో ప్రతికూలమో/అనుకూలమో కదులుతూనే ఉన్నారుగా. గుణ-దోష భూఇష్...