HAPPY VISVAVASU UGADI-2025
ఉగాది శుభాకాంక్షలు.
*****************
వసుధను వసుమయం గావించు
సమయమాసన్నమయినదని
,అరవై వత్సరముల తరువాత, అరుదెంచుచున్నావా "విశ్వావసు వత్సరమా"
"ఆత్మీయ స్వాగతము."
గ్రహముల గుణదోషములను
ఆగ్రహానుగ్రహములను గణన
ఉన్న ఉండొచ్చును కాని,
అసలు,
అతిమెల్లగ కదులుటచే ముప్పది సంవత్సరాల
సమయము పట్టుతుంది శనికి చుట్టడానికి
పన్నెండు రాశుల చక్రాన్ని.
మెల్లగ కదులుటచే పన్నెండు సంవత్సరాల
సమయము పట్టుతుంది గురువు చుట్టడానికి
పన్నెండు రాశుల చక్రాన్ని
30:12 సంవత్సరాల కనిష్ఠ సామాన్య గుణిజమే 60
అందుకే తెలుగు సంవత్సరాలు అరవై.
ఓరుపు నేర్పిస్తాయి నేరుపుగ ఈ గ్రహములు,
, అరవై సంవత్సరములు,
జాబిలి కూతురులో లేదా నారద కుమారులో
వాటిపేర్లు ప్రభవ నుండి అక్షయ అని
వరాహమిహిరుడు అన్నాడు భృగుసంహితలో
వారించబడక కొనసాగుతున్నాయి కాల గతిలో
గురువు-శని తమ గమనములో ప్రతికూలమో/అనుకూలమో
కదులుతూనే ఉన్నారుగా.
గుణ-దోష భూఇష్ఠముల వాటిగమన పరిణామములే
ప్రతి ఒక్కరి ముందునున్న పంచాంగ ప్రమాణాలు.
ఏది ఆదాయమో/ ఏది రాజ పూజ్యమో
వ్యయము వ్యవహారమేమో/ అసలేది అవమానమో
అతిగా ఆలోచించారా( గురువు-శని)
సమయమెక్కువవుతుందని సగములో ఆపరు కదా
సతమతమగు నడక యని సహనము కోల్పోవరు కదా
బలము- చెలిమి కలిసి వసు ప్రదముగా మారి
విశ్వ శ్రేయ పథము వైపు పదములను కదిలిస్తూ
శుభకామానలందిస్తూ, అభయము తానౌతుంది.
Comments
Post a Comment