Posts

Showing posts from June 18, 2024

NAALGAVA MAJILEE-SARVA SAUBHAAGYADAAUAKA CHAKRAMU AMTE?

Image
    " భక్తుడు భగవంతుడా నువ్వెప్పుడు బయటకు వస్తావు నేను నిన్ను చూడటానికి అని అనుకుంటాడట,    భగవంతుడు భక్తుడెప్పుడు తనలోనికి తొంగి చూస్తాడా కనపడదామని అనుకుంటాడట."     ఎంతటి నగ్నసత్యము.  ఏకాకిని "భూమరూపా" నిర్ద్వైతా ద్వైతవర్జితా అని పరమేశ్వరిని కీర్తిస్తుంది స్రీ లలితా రహస్య సహస్రనామస్తోత్రము.  అన్నిరూపములుఇందే ఆవహించెను అని కీర్తించాడు అన్నమాచార్యులు.    అంతర్యామిగా అన్ని ఉపాధులు తానైన పరమాత్మ ఏదో ఒక ఉపాధితో మనకు మనలను తెలుసుకోవటానికి చేతిని అందిస్తూనేఉంటాడు.  ఆ చేతిని నమ్మకముతో గట్టిగా పట్టుకుని,విడువకుండా మరొక మెట్టును ఎక్కించేది/ఆవరనములోనికి ప్రవేశింపచేసేది "సౌభాగ్యము" .  ప్రయాణికుడు అమ్మదయతో పదునాలుగుకోనములు కల వృత్తాకార చక్రము లోనికి ప్రవేశిస్తున్నాడు.దీనినేచతుర్దశార చక్రము అని కూడా పిలుస్తారు.  మూడు అవస్థలను దాటి,మూడు దేహములను అర్థముచేసుకుంటూ,స్పూక్ష్మము వైపునకు అడుగులు వేయిస్తున్నాయి ఈ పదునాలుగు కోణములు.చురుకుదనమును మెదడుకు అందిస్తూ.  పదునాలుగురు మాతలు ఈ ఆవరణములో ప్రకాశముతో వెలిగిపోతున్నారు.జడత్వమునకు తావులే...