DEVIKHADGAMALA-INTRODUCTION-02

దేవిఖద్గమాల-02 ****************** దేవిఖడ్గమాలా స్తోత్రమునే "శ్రీ శుద్ధశక్తి మహా మాలా మంత్రము"అనికూడా కీర్తిస్తారు. మహిమాన్విత నాదమే మంత్రము.అంతే కాదు, "మననాత్ త్రాయతే మంత్రః" ఎవరు మననము చేస్తారో/మనసులోనిధిధ్యాసము చేసుకుంటారో వారిని రక్షించేది "మంత్రము" మనము ఏ దేవతను/మూలశక్తిని సాకారముగాభావించి ఆ శక్తికిసంబంధించిన మంత్రమును మననము చేస్తామో అదిమహామంత్రము. ఆ మూలశక్తి తో పాటుగా అనేక పరివార శక్తులను సైతము ఆరాధించగలిగితే అది"మాలా మహా మంత్రము." దేవి ఖడ్గమాలా/శుద్ధశక్తి మాలా మహా మంత్రము, ప్రతి స్తోత్రము , 1 దేవత 2.ఋషి 3.ఛందస్సు 4.బీజము 5.శక్తి 6,కీలకమును కలిగియుంటాయి. దేవిఖడ్గమాలా మహా మత్రము, 1 మహా త్రిపుర సుందరి దేవతగా 2.వరుణ్-ఆదిత్యులను ఋషులుగా 3.దేవీ గాయత్రీ ఛందముగా 4,ఐం-బీజముగా 5.క్లీం-శక్తిగా 6.సౌః-కీలకముగా, సర్వాభీష్ట సిద్ధిప్రదముగావిరాజిల్లుతున్నవి. వీటి గురించి తదుపరి భాగములో వివరముగా తెలుసుకునే ప్రయత్నమునుచేద్దాము. శ్రీ మాత్రే నమః.