Monday, September 30, 2024

SARVARTHASADHAKACHAKRAMU

 


  "తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త షితేనవై

   అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి"


     ప్రాణసక్తికి నిలయమయిన వాయువ్యవస్థను వివరించు ఈ చక్రమును గురించి పరమేశ్వరుడు మాత పార్వతీదేవితో,


 " శక్తిః ఏకాదశస్థానే స్థిత్వా సూతై జగత్రయం

   విశ్వయోనిః ఇతిగ్యాతా సా విష్ణు దశరూపకం."


   పరబ్రహ్మము తాను నిశ్చలముగానుండి తననుండి పది అద్భుతశక్తులను స్థితికార్య నిర్వహణకై ఉత్పత్తి చేసినది.వైష్ణవీ శక్తి శ్రీ లలితా రహస్య సహస్ర నామములోచెప్పినట్లు,


 "కరాంగుళి నఖోత్పన్నా  నారాయణదశాకృతి" ని ప్రకటింపచేసినది.

   ఈ ఆవరణములోనికి ప్రవేశించిన సాధకుడు తాను ఐదు ప్రధాన వాయువులు-ఐదు ఉపవాయువుల మధ్యన ఉన్నానని గ్రహించగలుగుతున్నాడు.

  తనతోపాటుగా తన వెంట వశిత్వ సిద్ధిమాత-సర్వోన్మాదిని ముద్రాశక్తి మాత కనిపెట్టుకుని ఉన్నారన్న విషయమును గ్రహించగలుగుతున్నాడు.

   సర్వసిద్ధిప్రదాదేవి

   సర్వసంపత్ప్రదాదేవి

   సర్వప్రియంకరీదేవి

   సర్వమంగళకారిణీదేవి

   సర్వకామప్రదాదేవి

   సర్వ దుఃఖవిమోచనీ దేవి

   సర్వమృత్యుప్రశమనీదేవి

   సర్వవిఘ్ననివారిణీదేవి

   సర్వాంగ సుందరీదేవి

   సర్వ సౌభాగ్యదాయినిదేవి అను గౌణ నామములతో

   ప్రాణ వాయువు

   అపానవాయువు

  వ్యానవాయువు

  ఉదాన వాయువు

  సమాన వాయువు

     అను ప్రధాన వాయువులగాను

  నాగ వాయువు

  కూర్మ వాయువు

  కృకరవాయువు

  దేవదత్త వాయువు

  ధనంజయ వాయువులుగా 

     తనలో చైతన్యమును నుంపుతున్నారన్న సంగతిని గ్రహిస్తున్నాడు.

   ఈ వాయువుల సహాయము వలననే శ్వాస ప్రక్రియ,జీర్ణ ప్రక్రియ,మాట్లాదగలుగుట,కంటి రెప్పను వేయగలుగుట,ఆవలించగలుగుట,తుమ్మగలుగుట,మూత్ర-మల విసర్జనమును చేయకలుగుట తనలో జరుగుచుండుట తెలుసుకొని ఆశ్చర్య పోతున్నాడు.


  అద్భుత శక్తివంతులు కులయోగినులు.అసలు కులము అంటే?

 1.కులమనగా -సదాచారము

 2.కులమనగా పృధ్వీతత్త్వము

 3.కులమనగా-మూలాధార చక్రము

 4.జ్ఞానేంద్రియ+కర్మేంద్రియముల దేహము

 5.కులమనగా-కుండలినీ శక్తి

    దేహమునకు ఆత్మకు భేదము లేదను విషయమును తెలిసికొనుట యోగము.ఆ యోగమును జీవునకు అనుగ్రహించు శక్తి యోగిని.అవి అనేకములుగాఉంటేయోగినులు.

  సాధకుడు చక్రేశ్వరి త్రిపుర శ్రీ ఆశీర్వాదముతో "సర్వరోగహర చక్ర" ప్రవేశమునకు సంసిద్ధుడగుచున్నాడు.


   సర్వం కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.


   

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...