SIVA RAKSHAA STOETRAMU
శివ రక్షా స్తోత్రము ********************** యాజ్ఞ్యవల్క్యుని ధన్యతనొందించినది కల నారాయణోపదేశము ప్రాప్తించినది ఇల అవతరించెను భళ "శివరక్షా స్తోత్రము" ఆదిదేవుని దయ అవ్యాజము అవని పునీతము. ఓం నమః శివాయ. *************** గౌరి-గణేశ విరాజితుడు దశభుజుడు సచ్చిదానందుడు కరుణాసముద్రుడు ఐదు ముఖముల వాడు-మూడు కన్నుల వాడు సర్వాంగ సుందరుడు-సర్వాంగ రక్షితుడు హరహర మహాదేవ శంభో రక్షమాం. _____________________________________ గంగాధరుడు నా శిరమును రక్షించు గాక చంద్రశేఖరుడు నా నుదుటిని రక్షించు గాక మదన సంహారి నా కనులను రక్షించు గాక నాగాభరణుడు నా చెవులను రక్షించు గాక ఓం నమః శివాయ *************** త్రిపురాసురుడు నా నాసిక రక్షించుగాక విశ్వాత్మకుడు నా జిహ్వ తానుండు గాక వేదపూజితుడు నా మెడను రక్షించు గాక గరళ కంఠుడు నా కంఠము రక్షించు గాక ఓం నమః శివాయ ...