కదా త్వాం పశ్యేయం-26
*****************
"జిహ్వ చిత్తశిరోంఘ్రి నయన శ్రోతైః అహంప్రార్థితం
నమామి భగవత్ పాదం శంకరం లోకశంకరం."
"ఆనందామృత పూరితా హరపదాంభోజ వాలోద్యతా
స్థైర్యోపఘ్నముపేత్య భక్తి లతికాశాఖోపశాఖాన్వితా
ఉచ్చైర్మానసకాయమాన పటలీ మాక్రమ్య నిష్కల్మషా
నిత్యాభీష్ట ఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధితా."
పరమేశ్వర పాదపద్మములనే పాదునకు విస్తరిస్తున్న మనసును పందిరిగా చేసి,భక్తి యను తీగెను,అమృతజలములతో తడుపుతూ,దుష్కర్మలను కలుపులను తీసివేస్తున్న సమయమున 'నిత్యాభీష్టములను" ఫలములను అందించుటకు సిద్ధముగానున్న శంకరానుగ్రహమను వృక్షరాజమునకు నమస్కరిస్తూ,ఈనాటి బిల్వార్చనమును ప్రారంభిద్దాము.
' మా రేడు నీవని నీ పూజచేయ మారేడు దళములు నీసేవకు
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీసేవకు"
శివ శివ శంకర-భక్తవశంకర
శంభో హర హర నమోనమో".
సమీపిస్తున్న శంకరయ్య సందేహమునకు సమాధానముగా మీరు ఇప్పటివరకు చూచినవి-వినినవి-తెలుసుకొనునవి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుని,ఆలోచిస్తే సర్వము అర్థమవుతుంది అన్నాడు ప్రశాంతముగా.ఆ ఆటవికుడు.
ఎందరోచేతనులు-ఎన్నో రూపములుగా తమమనసును మలచి స్వామి సమర్పణమునకు తీసుకువెళుతున్నారు కదా.
అవును నిజమే కాని వారు తమతో పాటుగా పశువులను తీసుకుని వెళుతున్నారు.కొందరు తమ మనసంటున్నారు.మరి కొందరు భక్తి అంటున్నారు.
" పశువులనా? ఎక్కడికి తీసుకువెళుతున్నారో మీకు తెలుసా?
అమాయకముగా" దేనిని తీసుకువెళుతున్నారో చూశాను గాని,ఎక్కడికి తీసుకుని వెళుతున్నారో తెలియదు.అన్నాడు శంకరయ్య.
ఇదిగో ఇక్కడ మీదగ్గర సైతము అదే అదే..
మొదటనున్న వారు
1."పురహర చరణాలానే హృదయ మదేభం" అని అంటున్నారు.ఈయన మనస్సు ఒక మదగజమట.దానిని సమర్పిస్తానంటున్నాడు
2.రెండో ఆయన సరేసరి,
" కళ్యాణినం సరస చిత్రగతిం సవేగం
సర్వేంగితజ్ఞమనఘం ధృవలక్షణాఢ్యం
చేతః తురంగ మధిరుహ్య చర స్మరారే"
ఓ మహేశా! నా మసననెడి కళ్యాణప్రదమైన గుఱ్ఱమునెక్కి విహరించుము.నీవుస్మరుని/ మన్మథుని హరించినవాడవు కదా.నా మనసు సైతము నీ దివ్య స్పర్శనముచే/నిన్ను వహించుటచే ,విషయవాసనలను విడనాడును అని ఒక తేజోవంతమైన అశ్వమును తనతో వెంటపెట్టుకుని వెళుతున్నాడు.
3. మూడో ఆయన,
"అమితముదమృతం ముహుర్దుహంతీం
విమలభవత్పద గోష్ఠం ఆవసంతీం"
అంటూ,ఒక గోవును తీసుకుని వచ్చి,మహేశ్వర పాదపద్మములను గోశాల అంటున్నాడు.
4.దూరముగా నున్న అతను,
" మామక మనో దుర్గే నివాసం కురూ అంటున్నాడు.
5.అక్కడ కూర్చున్న వ్యక్తి,
" చేతః పుష్కర లక్షితో ..భవతి-చేదానంద పాదోనిధి"అని అంటున్నాడు.
6.ఆ వస్తున్నాయనిది మరీ విడ్డూరం.
వీళ్ళందరిని మించిపోయాడు.
" శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా
భవ మమ గుణధుర్యాం "బుద్ధి కన్యా ప్రదాస్యే"
సకల భువన బంధో సచ్చిదానంద సింధో"
ఏకముగా తనభక్తిని నూతనవధువుగా అలంకరించి,కన్యాదానమును స్వీకరించమంటున్నాడు.ఇల్లరికముగా తన దగ్గరకు వచ్చి ఉండమంటున్నాడు.
శంకరయ్యనుచూసి నవ్వుకున్నాడు ఆ ఆటవికుడు.
.
మీరుచెప్పినది నిజమే శంకరయ్యగారు.కాని వారు ఇంకొకరిని పట్టించుకోవటములేదుకదా.
వారి ఏకాగ్రత అంతా పరమేశ్వర పాదారవిందములపైనే.
బహుశా మాజాతికి వేటాడేందుకు లభించన వరమేమో ఆ ఏకాగ్రత.
తన భక్తి గోవు కనుక అయితే స్వామిపద్మములు గోశాల.అశ్వము కనుక అయితే స్వామి రౌతు.కన్య కనుక అయితే స్వామికన్యాగ్రహీత.మదగజమయితే స్వామి మావటివాడు.పుష్కరమైతే పుష్కరాసీనుడు.
అంతేకదా.వారందరిది ఒకటే గమనము.ఒకటే గమ్యము.
మరి మీరు ఎందుకు ధ్యానము...
అదా మీ సందేహము.
" కరలగ్న మృగేః కరీంద్ర భంగో
ఘన శార్దూలవిఖండనోస్త జంతుః
గిరిశో విశదాకృతిశ్చ చేతః
కుహరే పంచముఖోస్తి మే కుతోభిః.వినబడుతోంది మంద్రముగా.
విస్తుపోయాడు శంకరయ్య.
అంటే మీ హృదయమనే గుహలో పంచముఖుడు ..
కొలువై ... అంటుండ గానే ఆ ఆదికిరాతకుడు ఆది దేవునిగా శంకరయ్యకు సాక్షాత్కరిస్తూ,సముదాయిస్తున్నాడు.
కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ.
'తన్మై మనః శివ సంకల్పమస్తు
వాచే మమశివపంచాక్షరస్తు
మనసే మమ శివభావాత్మ మస్తు".
పాహిమాం పరమేశ్వరా.
(ఏక బిల్వం శివార్పణం)