Tuesday, January 4, 2022

PASURAM-20

తిరుచిట్రంబలం-పాశురం-20 ************************** పోట్రి అరుళగనిల్ ఆదియుం పాదమలర్ పోట్రి అరుళగనిల్ అందమాశెందరిగళ్ పోట్రి ఎల్లా ఉయర్కుం తోట్రమాం పొర్పాదం పోట్రి ఎల్లా ఉయర్కు బోగమాం పుణ్ కళల్గళ్ పోట్రి ఎల్లా ఉయర్కు ఈరా ఇలై అడిగళ్ పోట్రిముం నాన్ముగమునుం కాణాద పుండరీకం పోట్రియాం ఉయ్యాన్ కొండరుళం పొన్మలర్గళ్ పోట్రియాం మార్గళినీర్ ఆడేలో రెంబావాయ్. సర్వైశ్చ పూర్వైః ఆచార్యై ః సత్కృతాయాశ్చ మంగళం ******************* సనాతన సంప్రదాయములోని మంగళాశాసన విశిష్టతను ప్రస్తుత పాశురములో మనకు తిరుమాణిక్యవాచగరు మనకు అందిస్తున్నారు. భక్తులు /జీవులు/చేతనులు పరమాత్మకు మంగళాశాసనములను అందించుట భావ్యమేనా అన్న సందేహము మనకు కలుగ వచ్చును. అసలు ఈ పోట్రి పాశురములోని ఆంతర్యమును కనుక మనము పరిశీలించగలిగితే ఒక విధముగా భగవంతునికి చేతనులు సమర్పించే కృతజ్ఞావిష్కారము అనుకోవచ్చును. చేతనులు తమ కృతజ్ఞలను ఆవిష్కరించలవసినపుడు మంగళము ను సూచిస్తున్నారు కదా.వారు ఏ విధమైన సంస్కారముతో పరమాత్మకు మంగళము కోరుచు కీర్తిస్తున్నారు , వారి నోము ఫలించి పరమాత్మకు-ప్రపంచమునకు అభేదమును తెలిసికొనగలిగినారు. సూక్ష్మము/నిక్షిప్తము పరమాత్మగా కనుక మనము గుర్తిస్తే దాని, స్థూల రూపమే/విస్తరణయే కదా సకల భువన భాండములు. స్వామి స్వేచ్ఛాలీలా వినోదములే కదా,సృష్టి-స్థితి-సంహారములను దాగుడు మూతలు. త్వమేవ బ్రహ్మ-త్వమేవ విష్ణు-త్వమేవ రుద్ర సకలం త్వమేవ. పోట్రి ఎల్లా ఉయర్కు తోట్రామాం పొర్పాదం బ్రహ్మ అను నామరూపములతో సకలసృష్టికార్యమును నిర్వహించుచున్న నీ పొర్పాదం -బంగారు పాదములకు మంగళమగు గాక. పోట్రి ఎల్లా ఉయర్కు బోగమాం పుణ్కళల్గళ్ విష్ణు అను నామరూపములతో స్థితికార్యమును నిర్వహించుచున్న నీ పాదపద్మములకు మంగళ మగుగాక. పోట్రి ఎల్లా ఉయర్కు ఈరాం ఇనై అడిగల్. రుద్ర అను నామరూపములను సకల చేతనులకు జీవనపరమార్థమైన ,గమ్యమైన నీ పొన్మలర్గళ్ కు మంగళాశాసనములు. పరమేశా! నీవే ఆది-అంతము /ఆద్యంతరహితము అను అవగాహనను మాలో కలిగించిన నీ అనుగ్రహమునకు మంగళములు. " దర్శనాత్ అప్రశిదాసి-జననాత్ కమలాలయే కాశ్యంతు మరణాత్ ముక్తి-స్మరణాత్ అరుణాచలే" భగవత్ బంధువులారా, ఆ పరమాత్మ నన్నొక పరికరముగా అనుగ్రహించి తనను తాను తెలియచేసుకొన్న/నేను మీతో పంచుకొన్నానని భావించుకొనిన దివ్య తిరువెంబాయ అను పవిత్ర పాశురముల గురించి చదివినా-వినినా-చర్చించినా/కనీసము దోషములను గుర్తించి హెచ్చరించినా , ఆ అరుణాచలేశుడు తన అవ్యాజకరుణతో మనకు అండ-డండగానుండి, అనుక్షణము రక్షించును గాక. పరమాత్ముని అనుగ్రహముతో ఆరుద్ర నక్షత్ర దర్శనముతో నేనొక కలమునై " తిరుపళ్లి ఎళుచ్చిని" మీ ముందుంచుటకు ప్రయత్నిస్తాను. అందరకు సవినయ నమస్కారములతో. అంబే శివే తిరువడిగళే శరణం.

PASURAM-21

శివ స్వరూపులారా!ప్రణామములు. మనము "తిరుపళ్ళి ఎళుచ్చి" అను తిరుమాణిక్యవాచగరు చే విరచించబడిన సుప్రభాత సేవలోని పది భాగములను పంచుకునే ముందు, ఆరుద్ర నక్షత్రదర్శనము, ఆత్మనాథ దేవాలయమూ గురించి, కొంచము ప్రస్తావించుకొందాము. ఇప్పటివరకు మనము తిరువెంబావాయ్ అను శివతత్త్వగ్రంధము గురించి,శివానుగ్రహముతో తెలుసుకునే ప్రయత్నమును చేసాము. మనము ప్రస్తుతము ఆరుద్రనక్షత్ర దర్శనము గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము. వేదవిదులు ఆరుద్ర నక్షత్రమును ఆకాశమున దాని ఉదయమును అధ్యాత్మిక విజ్ఞానమునకు జన్మస్థానముగా భాఇస్తారు.మన చెలుల నోము ఫలించి ఆరు ఆరుద్రనక్షత్రమును దర్శించి,సామి అనుగ్రహపాత్రులై,తిరుపళ్ళి ఎళుచ్చికి/సుప్రభాత సేవకు ఉద్యుక్తులగుచున్నారు. ఇది ఆచ్యార్థము అనుకుంటే దీనిలో దాగిన ఆంతర్యము ఏమిటి అని మనము ప్రశ్నించుకుంటే, అరుద్రనక్షత్ర అధిష్టాన దైఅమైన రుద్రుడు, ఎర్రని-పచ్చని కాంతుల జ్యోతిరూపమై దర్శనమిచ్చే పుణ్యసమయము. చిదంబర నటరజ నృత్య పరమార్థమును గ్రహించగలిగే సదాకాశము. జ్యోతి సరూపముగా పరమాత్మ చేయుచున్న అద్భుత నృత్యకేళి. తిరువాదిరై/ఆరుద్ర నక్షత్ర దర్శనమను ఆధ్యాత్మిక ఆదిదేవ నైసర్గిక నృత్యము సమస్త జగములను శక్తివంతము చేయు సంకేతము.

pPASURAM-20

తిరుచిట్రంబలం-పాశురం-20 ************************** పోట్రి అరుళగనిల్ ఆదియుం పాదమలర్ పోట్రి అరుళగనిల్ అందమాశెందరిగళ్ పోట్రి ఎల్లా ఉయర్కుం తోట్రమాం పొర్పాదం పోట్రి ఎల్లా ఉయర్కు బోగమాం పుణ్ కళల్గళ్ పోట్రి ఎల్లా ఉయర్కు ఈరా ఇలై అడిగళ్ పోట్రిముం నాన్ముగమునుం కాణాద పుండరీకం పోట్రియాం ఉయ్యాన్ కొండరుళం పొన్మలర్గళ్ పోట్రియాం మార్గళినీర్ ఆడేలో రెంబావాయ్. సర్వైశ్చ పూర్వైః ఆచార్యై ః సత్కృతాయాశ్చ మంగళం ******************* సనాతన సంప్రదాయములోని మంగళాశాసన విశిష్టతను ప్రస్తుత పాశురములో మనకు తిరుమాణిక్యవాచగరు మనకు అందిస్తున్నారు. భక్తులు /జీవులు/చేతనులు పరమాత్మకు మంగళాశాసనములను అందించుట భావ్యమేనా అన్న సందేహము మనకు కలుగ వచ్చును. అసలు ఈ పోట్రి పాశురములోని ఆంతర్యమును కనుక మనము పరిశీలించగలిగితే ఒక విధముగా భగవంతునికి చేతనులు సమర్పించే కృతజ్ఞావిష్కారము అనుకోవచ్చును. చేతనులు తమ కృతజ్ఞలను ఆవిష్కరించలవసినపుడు మంగళము ను సూచిస్తున్నారు కదా.వారు ఏ విధమైన సంస్కారముతో పరమాత్మకు మంగలము కోరుచు కీర్తిస్తున్నారు , వారి నోము ఫలించి పరమాత్మకు-ప్రపంచమునకు అభేదమును తెలిసికొనగలిగినారు. సూక్షమము/నిక్షిప్తము పరమాత్మగా కనుక మనము గుర్తిస్తే దాని, స్థూల రూపమే/విస్తరణయే కదా సకల భువన భాండములు. స్వామి స్వేచ్ఛాలీలా వినోదములే కదా,సృష్టి-స్థితి-సంహారములను దాగుడు మూతలు. త్వమేవ బ్రహ్మ-త్వమేవ విష్ణు-త్వమేవ రుద్ర సకలం త్వమేవ. పోట్రి ఎల్లా ఉయర్కు తోట్రామా పొర్పాదం బ్రహ్మ అను నామరూపములతో సకలసృష్టికార్యమును నిర్వహించుచున్న నీ పోపాదం-అంగారు పాదములకు మనగలమగు గాక. పోట్రి ఎల్లా ఉయర్కు బోగమాం పుణ్కళల్గళ్ విష్ణు అను నామరూపములతో స్థితికార్యమును నిర్వహించుచున్న నీ పాదపద్మములకు మంగలమగుగాక. పోట్రి ఎల్లా ఉయర్కు ఈరాం ఇనై అడిగల్. రుద్ర అను నామరూపములను సకల చేతనులకు జీవనపరమార్థమైన ,గమ్యమైన నీ పొన్మలర్గళ్ కు మంగళాశాసనములు. పరమేశా! నీవే ఆది-అంతము /ఆద్యంతరహితము అను అవగాహనను మాలో కలిగించిన నీ అనుగ్రహమునకు మనగళములు. " దర్శనాత్ అప్రశిదాసి-జననాత్ కమలాలయే కాశ్యంతు మరణాత్ ముక్తి-స్మరణాత్ అరుణాచలే" భగవత్ బంధువులారా, ఆ పరమాత్మ నన్నొక పరికరముగా అనుగ్రహించి తనను తాను తెలియచేసుకొన్న/నేను మీతో పంచుకొన్నానని భావించుకొనినా దివ్య తిరువెంబాయ అను పవిత్ర పాశురముల గురించి చదివినా-వినినా-చర్చించినా/కనీసము దోషములను గుర్తించి హెచ్చరించినా , ఆ అరుణాచలేశుడు తన అవ్యాజకరుణతో మనకు అండ-డండగా అనుక్షణము రక్షించును గాక. పరమాత్ముని అనిగ్రహముతో ఆరుద్ర నక్షత్ర దర్శనముతో నేనొక కలమునై " తిరుపళ్లి ఎళుచ్చిని" మీ ముందుంచుటకు ప్రయత్నిస్తాను. అందరకు సవినయ నమస్కారములతో. అంబే శివే తిరువడిగళే శరణం.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...