UGADI-VILAMBI
ఉగాది శుభాకాంక్షలు ********************** అరవైయేళ్ళ పిదప అరుదెంచుచున్నావా ఆలంబన నేనంటు ఓ విళంబి వత్సరమా! అరవై సంవత్సరాలే తెలుగులో ఎందుకు? తిథి-వార-నక్షత్ర-యోగ-కరణములలో. అతి మెల్లగ కదులుటచే ముప్పది సంవత్సరాల సమయము పట్టుతుంది శనికి చుట్టడానికి పన్నెండు రాశుల చక్రాన్ని.(మేష నుండి-మీన రాశి) మెల్లగ కదులుటచే పన్నెండు సంవత్సరాల సమయము పట్టుతుంది గురువు చుట్టడానికి పన్నెండు రాశుల చక్రాని. 30:12 సంవత్సరాల కనిష్ఠ సామాన్య గుణిజము అరవై అందుకే తెలుగులో అరవై సంవత్సరాలు. ఉగాది పచ్చడి అంటే? ఇల మమకారపు శ్రీకారము అంటున్నది కారము మెప్పులు ఉప్పంగాలని ఉప్పు చెప్పుతున్నది ప్రీతిగ ఉండాలంటు తీపి ప్రయత్నిస్తున్నది వలపు తలపు పిలుపుకై పులుపు చూస్తున్నది చిగురు పొగరును అణచమని వగరు అంటున్నది విజ్ఞామను చేదు అని చేదు అంటున్నది అరిషడ్వర్గముల తుంచు ఆరు రుచులు తిందాము అనుభవసారము అని వాని మాట విందాము. పచ్చడి...