Thursday, March 29, 2018

SAUNDARYA LAHARI-68

 సౌందర్య లహరి-లలిత పరాభట్టారిక

 పరమ పావనమైననీ పాదరజ కణము
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

 బ్రహ్మా0ణడ పురాణంతర్గత  బ్రహ్మాండరూపిణి
 ప్రాతఃకాల స్మరణము పరమ రమణీయము

 హయగ్రీవ-అగస్థ్య సంవాద సుందరి
 ప్రాతఃకాల భజనముసర్వ పాప భంజనము

 చిదగ్నికుండ ప్రకటితమైన చిద్విలాసిని
 ప్రాతఃకాల వందనము  ఆనందనందనము

 వశిన్యాది-వాగ్దేవతా సేవిత శ్రీమన్నగర నాయకి
 లలితా పరా భట్టారికగా కొలువుతీరియున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి.

 "లాలనాత్ ఇతి లలితా".లాలనతో మనలను అనుగ్రహించు తల్లి లలితాదేవి.జ్ఞాన శాస్త్రమయమైన శ్రీ లలితోపాఖ్యానము,శ్రీ లలిత సహస్ర రహస్యనామ స్తోత్రములు,త్రిశతి,పంచరత్మ్న స్తొత్రము అనేకానేక విధములుగ జగములను ఉద్ధరించుచున్నవి.భక్తుల హృదయములలో క్రీడించు పరాశక్తియే లలిత.అనాది-అఖిలాధారయైన తల్లి,జ్ఞానముచే మాత్రమే దర్శనమును అనుగ్రహించు తల్లి,
"లలిత-లలిత-శ్రీ లలిత-విశ్వ మోహిన శ్రీమాతగా భజింపబడుతు,నామ రూపములను అధిగమించి,తత్త్వ ప్రకాశినిగా అవగతమగుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

SAUNDARYA LAHARI-67


8:00 AM (1 hour ago)

  సౌందర్యలహరి-సరస్వతి

 పరమపావనమైన  నీ పాద రజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 జిహ్వాగ్రమున వసించు సరస్వతి జ్ఞానశక్తిగా
 పలుకులే కావ్య-నాటక-అలంకారములుగా

 మీమాంస-పురాణములు తల్లి కంఠపు పైగీతగ
 ఆయుర్వేద-ధనుర్వేదములు కంఠపు నడిమి గీతగా

 చతుషష్టి కళల చతురత క్రిందనున్న గీతగా
 బాహువుల సంకల్పమే తంత్రాది రూపములుగా

 అంతర్వాహినిగా  మా ఆపాద మస్తకము బ్రహ్మజ్ఞానముగా 
 సురపూజిత  భాసురముగ ప్రవహించుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి.

"కేయూరాని న  భూషయంతి పురుషం హారాన చంద్రోజ్జ్వలా
 న స్నానం విలేపనం  న కుసుమం న అలంకృత మూర్ధజాః
 వాణ్యేక సమలం కరోతిపురుషం య  సంస్కృత ధార్యతే

 క్షీయంతే ఖలు భూషణని సతతం వాగ్భూషణం భూషణం"

 ఆభరణముల అలంకరించుకున్నను,విలేపనములు అలదుకొన్నను,పన్నీటి స్నానములు చేసినను,సుగంధ పుష్పమాలములను అలంకరించుకొన్నను విద్యావిహీనుడు వాక్కునే భూషణముగా గల పండితునితో సరికాలేడు.
    
      జలప్రవాహముగా సరస్వతి నదిగా,జ్ఞాన ప్రవాహముగా సరస్వతి మాతగా తల్లి ఆరాధింపబడుచున్నది.బ్రహ్మ వైవర్త పురాణ కథనము ప్రకారము మాఘశుద్ధ పంచమి ఉషోదయ శుభసమయమున మాత సరస్వతి గా అనుగ్రహించి,బ్రహ్మ జిహ్వాగ్రమున పలుకుగా మారి,బ్రహ్మచే మొదటిసారిగా పలుకుల తల్లి భావమునకు వాగ్రూపమున ఆవిర్భవించినది.పలుకు  చిగురించిన పంచమి శుభదినమును శ్రీ పంచమి-వసంత పంచమి అను పేరుతో సరస్వతీపూజలను జరుపుకుంటారు.సరస్వతీ అనుగ్రహముతో యజ్ఞవల్క్యముని కోల్పోయిన తన జ్ఞాపక శక్తిని తిరిగి పొందగలిగాడట.వాక్కు-బుద్ధి-విద్య-వివేకం-జ్ఞానం ఇలా శాఖోపశాఖలుగా విస్తరించిన సరస్వతీ మంత్రమును ఆదికవి వాల్మీకి వ్యాసుల వారికి ఉపదేశించినారట.మంత్రబలమేమిటో జగద్విదితమే.

 "శ్రీ సరస్వతీ నమోస్తుతే వరదే" అంటూ వాక్ప్రవాహమై తల్లిని వర్ణించుచున్న 
సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచి పెట్టకమ్మా.అనేక నమస్కారములు.
       





TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...