OM NAMASIVAAYA-98

ఓం నమః శివాయ-38 ********************* అంతా ప్రకాశమే నేనంటూ ఆర్భాటము చేస్తావు అభిషేకములు జరిగేవి అంతంత మాత్రమేగ ఋషుల తపోశక్తులను సర్పములుగా మలిచావు నాగాభరణుడనంటు సాగదీస్తు ఉంటావు ఋషిపత్నులపై శంకవేస్తు పులిని పుట్టించావు వ్యాఘ్రేశ్వరుడను అంటు గుడిని కట్టించావు పసిడిబిల్వహారములతో పరిచయము అవుతావు తెరచాటుగ కథలను దొంతెరలుగ నడుపుతావు కొమ్ములున్న వారమంటు నెమ్మది తీసేస్తావు కాళ్ళులేని వాడివంటు ముళ్ళు గుచ్చమంటావు నిన్ను కొలుచు పతంజలికి నిలువెల్ల పరీక్షలని మొక్కుటెందుకటర నిన్ను ఓ తిక్కశంకరా. ఆ-సమస్తాత్- ఆ అంటే అంతట.కాశము-వెలుగు.అంతట వెలుగుతో నిండినది ఆకాశము.శివుడు అది నేనే అని గొప్పలు చెప్పుకుంటాడు కాని అక్కడ తనకు (మూలవిరాట్) రోజు అభిషేకము చేయరని మాత్రము చెప్పుకోడు.ఋషుల యజ్ఞ ఫలమును సర్పములుగా మార్చునట్లు వారిచే చేయించి,వాటిని తాను ఆభరణములుగా ధరిస్తాడు.ఋషిపత్నులపై ఋషులకు అనుమానమును కలిగించి వారిచే ఒక పులిని సృష్టింపచేసి,దాని తోలుతో ఒక వస్త్రమును-ఆసనమును చేసుకొన్...