TIRUPALLI ELUCHCHI-01
తిరుపళ్ళి ఎళుచ్చి-01 **************** "కృపాసముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీ వామభాగం సదాశివం రుద్రం అనంతరూపం చిదంబరేశం హృది భావయామి. సందర్భము. ******** సాక్షాత్తుగా రుద్రరూపమే అయిన-స్వామి జన్మనక్షత్ర భాగ్యమును పొందిన-స్వామిచే పాలింపబడుచున్న "ఆరుద్ర" నక్షత్ర దర్శనము తరువాత పునీతులైన మన చెలులు శివనోమును తిరుపళ్ళి ఏళుచ్చితో ప్రారంభిస్తూ, స్వామి పుండరీక నేత్ర శోభను సంకీర్తిస్తూ తరిస్తున్నారు. తిరుపళ్ళి ఎళుచ్చి-01 ********************* పోట్రియన్ వాళ్ముదల్ ఆగియ పొరుళె పులందదు పూంకళత్తు ఇనైతునై మలర్కొండు ఏట్రు ఇన్ తిరుముగత్తు ఎమక్ అరుళ్ మలరుం ఎడిల్నడై కొండు ఇన్ తిరువడి తొళుకోం శేట్రిదళ్ కమలంగళ్ మలరుంగన్ వయల్సోల్ తిరుపెరుత్తురైయురై శివపెరుమానే ఏట్రియార్కొడి ఉడయాయ్ ఎన్నై ఉడయాయ్ ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందు అరుళాయె. ...... జన్మదుఃఖం జరా దుఃఖం జాయాత్ దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత. ********* పోట్రి అను మంగళాశాసనముతో ప్రారంభింపబడిన మొదటి పద...