Posts

Showing posts from December 20, 2025

TIRUVEMBAVAY-06

Image
    తిరువెంబావాయ్-06    ****************  "కృపా సముద్రం సుముఖం త్రినేత్రం   జటాధరం పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం హృది భావయామి."  సందర్భము.   *********  శివానుగ్రహ సంపన్నులై ఒకరినొకరు పరిహాసములాడుచున్నట్లుగా కనిపిస్తున్న ఈ కన్యలు సాక్షాత్తుగా ఆచార్యులు.నిరతరము చిదంబరేశుని ధ్యానములో చిత్తమును చిత్తగించు చున్నవారు.వారితో కలిసి నోమునకు వెళుతున్నవారు శిష్యులు.నిజమునకు వారు-వీరు పరమాత్ముని లీలావిశేషరూపములు.వారి సంబోధనలు సైతము సంకీర్తనములే.  ప్రస్తుత పాశురములో సైతము నిదురించుచున్న కన్నియను   మానే-ఓ లేడికన్నులవంటి కన్నులు కలదానా అంటూ సంబోధిస్తున్నారు.    పాశురము.    ********  మానేని నెన్నలై నానేవందెంగళై  నానే ఎళుప్పవాన్ ఎండ్రను నాణామే  పోన ఇసై పగరార్ ఇన్నం పులర్దిండ్రో  వానే-నిలానే పిరవే అరివరియాన్  తానై వందెన్నై తల ఎళుత్తాల్ కొండరుళుం  వాన్వార్ కళల్పాడి వందార్కుం వాయ్ తిరవాయ్  ఊణే ఉరువాయ్ ఉనక్కే ఉరుం ఎమక్కుం  ఎనోర్కుం తంగోలై పాడేరు ఎంబావాయ్. ...