TIRUVEMBAVAY-06

    తిరువెంబావాయ్-06

   ****************

 "కృపా సముద్రం సుముఖం త్రినేత్రం

  జటాధరం పార్వతీ వామభాగం

  సదాశివం రుద్రం అనంతరూపం

  చిదంబరేశం హృది భావయామి."


 సందర్భము.

  *********

 శివానుగ్రహ సంపన్నులై ఒకరినొకరు పరిహాసములాడుచున్నట్లుగా కనిపిస్తున్న ఈ కన్యలు సాక్షాత్తుగా ఆచార్యులు.నిరతరము చిదంబరేశుని ధ్యానములో చిత్తమును చిత్తగించు చున్నవారు.వారితో కలిసి నోమునకు వెళుతున్నవారు శిష్యులు.నిజమునకు వారు-వీరు పరమాత్ముని లీలావిశేషరూపములు.వారి సంబోధనలు సైతము సంకీర్తనములే.


 ప్రస్తుత పాశురములో సైతము నిదురించుచున్న కన్నియను 

 మానే-ఓ లేడికన్నులవంటి కన్నులు కలదానా అంటూ సంబోధిస్తున్నారు.


   పాశురము.

   ********

 మానేని నెన్నలై నానేవందెంగళై

 నానే ఎళుప్పవాన్ ఎండ్రను నాణామే

 పోన ఇసై పగరార్ ఇన్నం పులర్దిండ్రో

 వానే-నిలానే పిరవే అరివరియాన్

 తానై వందెన్నై తల ఎళుత్తాల్ కొండరుళుం

 వాన్వార్ కళల్పాడి వందార్కుం వాయ్ తిరవాయ్

 ఊణే ఉరువాయ్ ఉనక్కే ఉరుం ఎమక్కుం

 ఎనోర్కుం తంగోలై పాడేరు ఎంబావాయ్.



  ఓ లేడి కన్నుల వంటి కన్నులు గలదానా.నీకు నీవే నిన్ననే మాదగ్గరికి వచ్చి,నేనే వచ్చి మిమ్ములను నోమునకు సిద్ధము చేస్తానని (మా అందరిని) చెప్పావు కదమ్మ.ఎక్కడికి మాయమయిపోయావు? నీకు ఇంకా తెల్లవారలేదా? ఏమిటి ఈ మౌనము? భూమి-ఆకాశము--మిగిలిన ఇతరము అంతా వెతికినా కనపడని పరమాత్మ స్వరూపము,మనమీద దయతో మెండుగా దీవెనలు కురిపించగా తనకు తానే తరలివస్తున్నాడు.

 మనమంతా వెళ్ళి,

 దర్శించుకుని,నోరారా (వాన్వాళ్ కళలు)చిదాకాశముగా ప్రకాశిస్తున్న ఆ చిదంబరేశుని లీలావైభవమును సంకీర్తించి వద్దాము.

  దయతో నీ మౌనము వీడి (వాయ్ తిరవాయ్) మమ్ములను అనుగ్రహించు అను వేడుకుంటున్నారు.

  ఇక్కడ లేడికన్నులు మనకు సారంగపాణి విశేషమును సూచిస్తున్నది.స్వామి చేతిలో సురక్షితముగా ఉండుటకేయేగ మన తపన/తపము.చెలి అంతర్ధానమయిందా లేక అంతర్ముఖమైనదా మౌనముగా ఉండుటకు? చెలి మాట తప్పుటకు కారణము

 మహదేవుని ఆరాధనమే నేమో

.

  చెలీ/ ఓ ఆచార్య! మీ మౌనమును వీడి మమ్ములను అందరిని అనుగ్రహించమను   ప్రార్థన ఈ పాశురము.


  అంబే శివే దివ్య తిరువడిగళే శరణం.

  ఏక బిల్వం దివ్య తిరువడిగళే శరణం.


 

 

 


Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI