DASAMAHAVIDYA-BHUVANESVARI.

శ్రీమాత్రే నమః ************** " కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమవతీ తథా బగళా సిధ్ధవిద్యా చ మాతంగీ,కమలాత్మికా ఏతా ఏవ మహావిద్యాః సిధ్ధవిద్యా ప్రకీర్తితాః." నమామి భువనేశ్వరీదేవి మహాశక్తిం నిరంతరం. శార్దూలము.. భువనేశ్వరీ దేవి వివరణ. ఆవిర్భావము జేసె శక్తి తన ఛాయారూప సంకల్పమున్ దేవీ రాజస భైరవాంక నిలయా దేదీప్య ప్రేతాసనుల్ దేవీజ్ఞాన శిరోవిభూషణి సదా దేవేశ్వరీ ప్రేరణల్ దేవీపట్టణ రత్నకాంతులు మణిద్వీపస్థితంబుల్ దివిన్! భావము: ఆదిశక్తి సంకల్పంతో తన ఛాయా రూపమును భువనేశ్వరిగా సృజించింది. భైరవుని సహచారిణిగా ఆయన ఒడిలో పంచప్రేతాసనాసీనులై ఉంటారు భైరవుడు, భువనేశ్వరి. ఆమె దేవతలకే ఈశ్వరి, దేవతలను ప్రేరేపిస్తూ ఉంటుంది. అత్యుత్తమజ్ఞాన శిరోవిభూషణి. ఆమె నివాసము - మణిద్వీపములోని దేవీపట్టణము (శ్రీపురం లేదా శ్రీచక్రము). శ్రీమాత్రేనమః *********** " ఓం భువనేశీ భువారాధ్యా భవానీ భయనాశినీ ...