OM NAMA SIVAAYA-96

ఓం నమ@ శివాయ-96 *************** కొంతమంది రుద్రులుగా భూమిమీద సంచరిస్తూ తినకూడని ఆహారము తినిపించేస్తుంటావు మరికొంతమంది రుద్రులుగా గాలిలో విహరిస్తూ ఆయాసము-ఉబ్బసము విజృంభింప చేస్తావు ఇంకొంతమంది రుద్రులుగా నీటిలోన చేరుతూ క్రిమికీటక జలములతో వ్యాధులు పెంచేస్తావు కొంతమంది రుద్రులతో గగనములో దాగుతూ అతివృష్టి-అనావృష్టి నష్టము చేస్తుంటావు ఆయుధమవసరములోని యుధ్ధమని అంటావు అపచారము సవరించే పరిహారము అంటావు సకలమును సన్స్కరించు పధ్ధతి యేనా ఇది? టక్కరి కొక్కెరవటర నీవు ఓ తిక్క శంకరా. . భువనం నమః శివాయ-గగనం నమః శివాయ దండన నమః శివాయ-దండము నమః శివాయ. శంకరుడు అనేకానేక రూపములను తనలాగ ఉండువారిని సృష్టించి,వారిని నింగి-నేల-జలము మొదలగు పంచభూతములనే ఆయుధములుగా మలచుకొని,వాటి ప్రభావము చేతనే జనులను సదాచార పరులను చేయమంటున్నాడు.ఈ ప్రణాళికలో జనులు వ్యాధిపీడితులుగా,ఆకలి బాధితులు గా మారి,పశ్చాత్తపడి సన్మార్గమున నడిచేవారిని,క్షమిస్తూ,పధ్ధతి మార్చుకోని వారికి ముగింపు తెస్తు,నిర్దాక్షిణ్యముగా శివుడు ...