87
ఓం నమః శివాయ-73 ***************** అసత్యమాడు బ్రహ్మపుర్రె అంతగా నచ్చిందా ఆభరనముగా చేసి అలంకరించుకున్నావు హింసకు గురిచూసే బోయకన్ను నచ్చిందా రక్తాశ్రువులను కార్చ అనురక్తిని చూపావు అమ్మ దగ్గర ఉండనన్న అర్భకుని వాక్కు నచ్చిందా అమృతధారగ మారి ఆర్ద్రతనందించావు స్వార్థమే నింపుకున్న కరి ఉదరము నచ్చిందా ఉదారతను చూపిస్తు ఒదిగిఒదిగి పోయావు పృష్టభాగమున పూజలందు ఆవుచెవి నచ్చిందా లంకకు నేరానంటు గోకర్ణమున నిలిచావు పెంపును అందించుతావో పంపు అని చంపుతావో పెక్కుమాటలేలరా ఓ తిక్క శంకరా.