CHIDAANAMDAROOPAA- KARAIKKAAL AMMAYAARU NAAYANAARU

చిదానందరూపా-కరైక్కాల అమ్మవారు ****************************** కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా కరైక్కాలలోని వైశ్య ధనదత్తుని కూతురు పునీతవతి కళ్యాణముతో అయినది యోగ్యుడు నిధిపతి శ్రీమతి శివానుగ్రహము ప్రసాదించినది రెండు మామిడి పండ్లను శివయోగికి ఆతిథ్యము ప్రసాదించినది అనేక మామిడిపండ్లను భార్యలో మానవాతీత శక్తులున్నవని భావించెను నిధిపతి మానవ మాత్రుడు తానని మళ్ళీ వివాహమాడెను సాంబశివుని తన సౌందర్యమును హరించమని వేడెను సాధ్వి భూతనాథుని కొలువగ భూతపు రూపును ఇచ్చెను స్వామి " న భూతో న భవిష్యత్ " అను నానుడి తీరున కైలాసమున శిరముతో నడచుట కైవల్యమునకు కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును కరైక్కాల్ లోని ధనదత్తుడను వైశ్యుని కుమార్తె పునీతవతి.ఎదుగుతు ఎదుగుతు శివధ్యానములో కాలను గడుపుచుండగా,వాగై ఓడరేవు పట్టణమునందు గల నిధిపతితో శాస్త్రోక్తముగా వివాహమును తండ...