Friday, January 7, 2022

TIRUPALLI ELUCHCHI-03

తిరుపళ్ళి ఎళుచ్చి-03 ******************* కూవిన పుంకుయిల్ కూవిన కోళి కురుగుకళ్ ఇయంబిన ఇయంబిన శంగం ఓవినై తారకై ఒళి ఒళి ఉదయత్తు ఒరుప్పుడు కిన్రాడు విరొప్పుడు నమక్కు తేవన చెరికళల్ కాడినై కాట్టాయ్ తిరుంపెరుంతురై యురై శివపెరుమానే యాం వరుం అరివరియాయ్ యమక్కు అడియాయ్ ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె. ........ ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినాం కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమోనమః" *********** ప్రస్తుత పాశురములో తిరుమాణిక్య వాచగరు బ్రాహ్మీముహూర్తము ఏ విధముగా పరమాత్మకు నాదార్చననో చేయుచున్నదో వివరిస్తున్నారు. పోట్రి-అరుణన్ పాశురములలో ఏ విధముగా పరమాత్మ ముఖకాంతిని పద్మములు-సూర్యుడు తమ వెంట తెచ్చుకొని ప్రకాశిస్తున్నారో ప్రస్తుతించి,ఈ పాశురములో నాదోద్భవమును-నాదార్చనను వివరిస్తూ,చెలులు ఏ విధముగా స్వామి విరుప్పొడు నమక్కు నీ దివ్య మంగళ విగ్రహమును దర్శించి సేవించాలి అని కోరుతూ, అంతలోనే కాదు కాదు, తేవన చెరికలల్ కాట్టాయ్-నీ యొక్క శోభాయమానముగా ప్రకాశించు పాదములు పటుకొనగలిగిన చాలును ఓ పరమాత్మా! మా యందలి అనుగ్రహముతో నీ యోగ నిద్రను (లాంఛన నిద్రను) చాలించి మేల్కాంచి,నీ పాదసంసేనా సౌభాగ్యమును ప్రసాదించు అని వేడుకుంటున్నారు. యాం వరుం-మేమందరము వచ్చాము నీ దగ్గరికి పద్మములకు-పద్మాకరములకు స్వామి ముఖతేజము వెంటవచ్చి ప్రకాసముగా ప్రకటితమైనది. పూంకుయిల్ కూవిన కోయిలల కూజితములతో,కోళ్ళ మేల్కొలుపులతో,పక్షుల వైవిధ్య పిలుపులతో,శంఖనాదములతో సమస్త జీవరాశులు నిన్ను తమ శక్త్యానుసారముగా సంకీర్తిస్తున్నవి. మనకు సందేశమును అందిస్తున్నవా అన్నట్లుగా చెలుల సంభాషణము అనిపిస్తున్నది.కోయిల పంచమ స్వరము వసంత ఋతువునకే పరిమితము.కోడి మేల్కొలుపు బ్రహ్మీ ముహూర్తమునకే మహోత్కృష్టం.వాటి ప్రాభవము కాలనకు/కాల పరిమితికి లోబడి యున్నది కదా అనగానే మరొక చెలి ఓ సుభాషిణి అంతే కాదు.నాదము బహుముఖములుగా విస్తరిస్తూ గగన విహారము చేస్తున్నది.మన ఇంద్రియములను కోడికూతతో మేల్కొలిపినప్పటికిని,అనేకానేక ఆలోచనలనే పక్షులు,ఆశలనే తమ రెక్కలను చాచుకొని మనలను తికమక పెట్టుట ప్రారంభించినవా అన్నట్లు అనిపిస్తున్నది అనగానే కాదు చెలి ఎందరో అరివరియాయ్-యోగులు/జ్ఞానులు అహంకార-మమకారములను రెక్కలను ఎగురనీయక ,భక్తి-శ్రధ్ధలను రెక్కలతో అజ్ఞానమును తరిమివేస్తు,ఆత్మానందముతో (ప్రణవమును-ఓంకారమును) శంఖనాదము ద్వారా చేస్తున్నారు. సత్వగుణ సంపన్నులైనారు.సత్వరమే మనము సైతము స్వామి సుప్రభాతసేవకు సన్నధ్ధులమగుదాము. మనము నిన్నటి భాగములో తిరు మాణిక్యవాచగరు పరమేశునిచేఏ విధముగా /ఎందులకు నునామకరణము చేయబడినాడో తెలుసుకున్నాము. ఈ రోజు తిరుపెరుంతురై శివపెరుమానే అని తిరుపళ్లిఎళుచ్చిలో సంబోధింపబడుతున్న స్వామి కి మాణిక్యవాచగరునకు కల అనుబంధమును గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము( స్వామి కరుణతో) . తిరుపెరుంతురై తమిళనాడులోని పుదుక్కోట జిల్లాలోని పుణ్యక్షేత్రము. మన కంచర్ల గోపన్నకు ,తిరుమాణిక్యవాచగరునకు దేవాలయ నిర్మాణ విషయములో పోలిక కలదు. వృత్తి పరముగా తిరువడరూరు వరగుణపాండ్యరాజాస్థాన ప్రధానమంత్రి.రాజాజ్ఞగా కొన్ని సమర్థవంతమైన అశ్వములను కొనుటకు తగిన పైకమును తీసుకుని తిరుపెరుంతురై వైపునకు పయనమయినాడు.పాలించవాడు మాణిక్యవాచగరు పయనమును ఏ మలుపు తిప్పుతాడో తరువాతి పాశురములలో తెలుసుకుందాము. అంబే శివే తిరువడిగలే పోట్రి.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...