ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM-NITYAM YAKSHA SEVITAM
.jpg)
ఋషులు-గంధర్వులు-నాగులు-అపసరసలు-యక్షులు-రాక్షసులు-దేవతలు అను సప్తగణములతో స్వామి సేవింపబడుతున్నాడు.యక్షుల గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము. వీరిని ఉపదేవతలు అని కూడా అంటారు.దివ్యశరీరులు.దయార్ద్రహృదయులు. వీరు ఒక్కొక్క మాసములో ఒక్కొక్కరు సుర్య రథ గమనమునకు ముందు అశ్వములను అనుసంధానము చేస్తారని ఐతిహాసికము చెబుతున్నది. వైజ్ఞానిక పరముగా ఆలోచిస్తే వీరు భూగర్భ సంపదలను-వృక్షమూల సంపదలను పరిరక్షించుతకు అనుకూలముగా సూర్యకిరణ సముదాయమును నిర్దేశిస్తారట. యక్షుల తెగకు అధిపతిగా కుబేరుని ప్రస్తుతిస్తారు. సనాతనము సూర్యభగవానుని 1.జన్మదాత 2.అన్నదాత 3.స్థితిదాత 4.జ్ఞానదాత 5.భయత్రాత గా కీర్తిస్తుంది.దీనికి ఉదాహరణముగా, పరమాత్మ, 1.మధుమాసములో-రథకృత్ అను యక్షుడు 2.మాధవ మాసములో-అతౌజుడు అను యక్షుడు 3.శుక్ర మాసములో-రథస్వనుడు అను యక్షుడు 4.శుచి మాసములో-చిత్రస్వనుడు అను యక్షుడు 5.నభః మాసములో-శ్రోతస్వామి అను యక్షుడు 6.నభస్య మాసములో-అశరణుడు అను యక్షుడు 7.ఇష మాసములో-శతాజిత్ అను యక్షుడు 8.ఊర్జ్...