Friday, November 5, 2021

pusalar nayanar

పూసలరు నాయనారు ****************** : శ్రీ మదాత్మనే గుణైక సింధవే నమఃశివాయ ధామలేశ ధూతకోక బంధవే నమః శివాయ నామశోషితాన మద్భవాంధవే నమః శివాయ పామరేతర ప్రధాన బంధవే నమః శివాయ. 1.శుభలక్షణమైన ఆత్మస్వరూపమునకు దండాలు శివా చిన్ని కాంతి సూర్యుడైన చిత్ప్రకాశమునకు దండాలు శివా సంతాపనాశకమైన చిదానందమునకు దండాలు శివా భవతారకమైన భక్త బాంధవునకు దండాలు శివా. ప్రకటిత భక్తి ప్రాధాన్యమునకు నిలువెత్తు నిదర్శనమైనాడు రాజసిమ్హ బిరుదాంకిత పల్లవరాజు కదవర్కన్.మోక్షక్షేత్రమైన కాంచీపురములో అత్యద్భుత కైలాసనాథర్ దేవాలయమును అత్యంత బ్రహ్మాండముగా కట్టించాడు. శివలీలను గ్రహించగలుగుట సామాన్యమైన విషయమా? ఆటను ప్రారంభించాడు ఆదిదేవుడు. అదే రాజ్యములో,అదే కాలములో,అదే వేగముతో భిక్షాటనతో జీవనము చేస్తున్న అతి నిరాడంబర0గా నున్న, పూసలర్ మానసమందిర నిర్మాణమునకు నాంది పలికినాడు నందివాహనుడు.అదియే "హృదయేలేశ్వరాలయము" అంతా గోప్యము.అదియే దాని గొప్పతనము. పూసలర్ నాయనర్ తొండైమండలములోని తిరునిన్రాపురములోని పరమ శివభక్తుడు.కాని సామాన్యుడు.మానసికోపాసన మహోత్కృష్టతను చాటిన మహనీయుడు. " రత్నైకల్పితమాసనం హిమజలైః స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజి చంపక బిల్వపత్ర రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం." అంటూ మనసులోనే రత్నసిమ్హాసనము ఆసనముగా నిలిపి పరమేశుని ఆహ్వానము/ఆవాహనము చేసేవాడు.చల్లనినీటితో స్నానమును సమర్పించేవాడు.దివ్యమైన వస్త్రములను కట్టేవాడు..కస్తూరి మొదలగు సుగంధ ద్రవ్యములతో కూడిన చందనమును అలదేవాడు.జాజి-చంపకములు మొదలగు దివ్య కుసుమములతో పాటుగా, " త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పనం" అంటూ బిల్వార్చనను భక్తితో చేసేవాడు.మంచితలపులను ధూపముగా,మించిన భక్తిని దీపముగా సమర్పించి సతుష్టుడయ్యేవాడు.స్వామియును సంబరముతో నిరాడంబర భక్తికి దాసుడయి,అరాధనమునకు ఆనందపడేవాడు. అవధులు లేని ఆనందము మానసికభక్తిని మహోన్నతము చేయాలనుకున్నట్లుగా,పూసలర్ మనసులో పరమేశ్వర మందిరనిర్మాణమునకు తొందరచేసింది.రొక్కము అవసరములేని సొక్కపు భక్తి అది. చిత్తములో విత్తును నాటినవాడు, మొలకెత్తి పెద్దదగుటకు తన కటాక్షమను గంగను కురిపించినాడు.అనుకూలతకు అన్ని హంగులను సరంజామలను పూసలారు తాను సమకూర్చుకున్నానని భావించేలా చేశాడు. మంచి సమయమున మానసికముగా శంఖుస్థాపన చేసి ,తనకు నచ్చిన విధముగా నందివాహన మందిరమును నిర్మించి,స్వామి ప్రతిష్ఠకు స్థిర ముహూర్తమును నిశ్చయించుకొని,స్వామికి విన్నవించాడు కరుణించి విచ్చేయమని స్వామిని పూసలారు. కాదనగలడా కన్నతండ్రి. అప్రకటిత భక్తి అనిశము ఈశుని సేవిస్తుంటే నేనున్నానంటు ప్రకటిత భక్తి పందెము వేస్తూ కాడపరాజు రూపములో కంచిలో కైలాసనాథదేవాలయమును బ్రహ్మాండముగా నిర్మింపచేసి,స్వామి ప్రతిష్టకు అదే ముహూర్తమును సుముహూర్తముగా నిర్ణయింపచేసినది. "పరీక్షపెట్టు పరమేశ్వరుడు వాడే- కటాక్షించు సర్వేశ్వరుడు వాడే" ఆసక్తికరమైన ఆటను ప్రారంభించాడు.అ భ్యర్థించిన తన భక్తుడైన రాజుకు స్వప్న సాక్షాత్కారమునందించి ముహూర్తమునకు రాలేని తన నిస్సహాయతను వివరించాడు.దానికి కారణము తాను అంతకు ముందే పూసలర్ నాయనర్ నిర్మించిన మందిరములో జరుగబోవు కుంభాభిషేకము నకు ు ఉండవలసివచ్చుట.ఆడిన మాట తప్పలేని అడ్డంకి. నిర్ఘాంతపోయాడు రాజు. కాచేవాడి మాటను కాదనలేని వాడు.మేల్కొని తాను పూసలర్ నాయనారు నిర్మించిన ఆలయమును దర్శించవలెనని తిరునినాపురమునకు వెళ్ళాడు. ఆలయమెక్కడ కనపడలేదు.డమరుకనాథుడు కనపడలేదు.అటు-ఇటు చూశాడు.అటుగా వెళుతున్నవారిని అడుగగా వారు అపహాస్యముచేసారు పూసలరు వింతప్రవర్తనను. భక్తి-భగత్వము-భక్తుడు అను మూడుగా విభజించబడినవి మమేకమై ప్రకాశిస్తున్నవి.భవతాపపరిహారములైనవి. కుంభాభిషేక నెపము మెల్లమెల్లగా తనపని తాను చేసుకుని పోతున్నది.మాయపొరలు క్రమక్రమముగా కనుమరుగవుతున్నవి. " ఆత్మానాం గిరిజాపతి" తన ఆరాధనను రాజుకి అవగతము కాసాగినది. . భక్త హృదయములలో కరుణగంగను వర్షించాడు. పునీతులను గావించిన పరమేశుని కరుణగంగ సకలలోకములను సంరక్షించును గాక. పూసలర్ అవర్గళ్ దివ్య తిరువడిగళే శరణం. ( ఏక బిల్వం శివార్పణం.)

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...