00009

ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-09 ******************************** ఇప్పుడు నేనేమి చేద్దామనుకుంటున్నాను?దేనిని చూద్దామనుకుంటున్నాను? అక్కడ శిల్పాలను చెక్కుతున్నారు.అనుకోకుండా నా దృష్టి అటువైపు మరలినది. సాధనా పంచకమును మనకందించిన శ్రీ శంకర భగవత్ పాదులకు సవినయ నమస్కారములేఓ. గమనిస్తున్నాను.పెద్దశిలలోని కొన్ని సకలములను తీసివేస్తున్నాడు.అద్భుతముగా శిల్పము ఆవిష్కరింపబడుతున్నది. అంటే ఆ శిల్పి .. శిలలోని కొన్నిశకలములను పరిత్యజిస్తూ,మిగినదానిని పరిగ్రహిస్తూ పనిచేస్తున్నాడు కాని సృష్టించలేదు. అంటే.. నేనుకూడ నా చుట్టు ఉన్నవాటిలో నుండి పనికిరాని వాటిని గుర్తించి,తొలగించగలిగితే,మిగిలిన దానిని గమనించుకొనగలిగితే,అద్భుతావిష్కరణమే కదా. బాహ్యదృష్టి శిలలో దాగియున్న శిల్పమును గుర్తించలేనట్లు,విసేషదృష్టిలో దాగిన సామాన్యమును గుర్తించుట వీలుకాదు కదా. నేను కూడ ఇప్పటివరకు సోగ కన్నులు,నీలి కన్నులు,లేడి కన్నులు,తేనె కన్నులు,కలువరేకులు అంటు బాహ్యనేత్ర సౌందర్యమును అభివర్ణించానే గానే వాటన్నిటిలో దాగి ప్రకటితమగుతున్న అద్భుతశక...