Sunday, August 28, 2022

SARVASAMKSHOBHANA CHAKRAMU-03

శ్రీచక్ర తృతీయావరణదేవతాః
అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగినీ, అనంగాంకుశే, అనంగమాలినీ, సర్వసంక్షోభణచక్రస్వామినీ, గుప్తతరయోగినీ,

 త్రైలోక్యమోహన చక్రములోని ప్రకటయోగినులలోని మాతృకాశక్తులు సిద్ధశక్తులను ముద్రాశక్తులను అనుసంధిస్తూ,సాధకుని గమనమును సర్వాశాపరిపూరకచక్రము అదే రెండవ ఆవరనము దగ్గరకు చేర్చుటకు కారణమైనాయి.రెండవఆవరనములో నున్న పదహారు రేకుల రూపసంకేతముగా నున్న గుప్తయోగినులు సాధకునకు పంచభూతములను,పంచేంద్రియములను,జ్ఞాన-కర్మ లతో పాటుగా మనసు యొక్క పరిమానమును వివరిస్తూ,చైతన్యపరుస్తూ సద్గతికి అనుకూలమైన మూడవ ఆవరణమునకు అదే సర్వ సంక్షోభచక్రమునకు చేరుటకు సహాయపదతాయి.
 సర్వాశాపూరక చక్రమువలె ఈ ఆవరణము సైతము వృత్తాకారముగా ఊహించుకొనుచున్నప్పటికి,రేకుల విషయము ఎనిమిదిగా ఎనిమిది శక్తులు అనంతత్త్వమును పరిచయము చేస్తున్నాయి.
 వీటినే గుప్త తర యోగినులు అని కూడా కీర్తిస్తారు.
   అసలు యోగము అంటే ఏమిటే అర్థమయితే దానిని అనుగ్రహించే శక్తియే యోగినిగా గుర్తించవచ్చును.
   జీవునియొక్క పరమాత్మ సంయోగ విషయమే కదా యోగము.ఏకత్వమునకు చేరువా కావాలంటే అనేకత్వమునకు దూరముకాక తప్పదు.కాని అనేక సహాయముతో ఏకమును దర్శించి,బిందువు విస్తరణము-సంక్ష్ప్తీకరనము అదే సూక్ష్మ తత్త్వము స్థూలముగాను,స్థూలము సూక్ష్మము గాను మారు లీలావిలాసమును అర్థము చేసుకొనవచ్చును

 సంక్షోభము అనగా కదలిక చైతన్యము అను అర్థమును మనము అన్వయించుకుంటే,అనంతత్త్వ ప్రతీకగా తల్లితత్త్వమును 8 శక్తులు వివరిస్తూ,సాధకునికి సన్మార్గమును చూపిస్తుంటాయి.
 అంగ అనగా పరిమితము.పూర్ణములో కొంతభాగము.అనంగ అపరిమితము.సంపూర్ణము.దేశకాల పరిస్థితులకు అతీతము.అమ్మ స్వరూప-స్వభావము.సాధకుడు కుసుమే,మేఖలే,మదనే-మదనాతురే-అనంగరేఖే,అనంగవేగినే-అనంగాంకుశే,అనంగమాలినే అను గుప్తతర యోగినులచే మార్గనిర్దేశకుడవుతాడు.
   ఒకవిధముగా వీటిని చిత్తవృత్తులనుకొనవచ్చును.అవి అనంతములు.వాటిని నియంత్రించి,సమాధానపరచి,సద్గతినొందుటకు సహకరించేవి ఈ ఎనిమిది శక్తులు.
  సాధకునిలో ఒక వినూత్న ఆలోచనలను కుసుమింపచేసి,వానినిపరిధి మేరకు వ్యాపింపచేయు రెండు శక్తులు అనంగ కుసుమే,అనంగ మేఖలగా అనికుంటే,ఆ కొత్తగా విస్తరించిన ఆత్మతత్త్వములో మునిగి రసానుభూతిని ఆస్వాదించుచు,మరింత మునిగితేలుతున్న సాధకుని గమనోన్ముఖునిగా మలుస్తూ,అనంగరేఖే శక్తే ఒక హద్దును ఏర్పరచి,ప్రవాహచైతన్యమైన అనంగవేగినికి అప్పగించగానే ఆ ప్రవాహమునునకు ఒక నిబద్ధతను కలిగిస్తూ అనంగాంకుశిని సన్మార్గమునందు సాగిపోవుటకు సహాయముచేస్తుంటే అమ్మ అనుగ్రహమును అత్యంత సమీపముచేస్తుంది అనంగ మాలిని.అంతా అమ్మ కనుసన్నలలో అమ్మ సామీప్యమునకు తనను తాను సిధ్ధము చేసుకుంటున్నాడు సాధకుడు. సర్వాసంక్షోభణ చక్రములోని గుప్తతరయోగినుల
 వాత్సల్యమును పొందిన సాధకుడు చక్రేశ్వరియైన త్రిపురసుందరి దేవికి నమస్కరించి,నాల్గవ ఆవరణమైన"సర్వ సౌభాగ్యప్రద చక్రము"లోనికి 
 సంప్రదాయయోగినుల సహృదయతతో ప్రవేశించుచున్నాడు.

  శ్రీమాత్రే నమః. 
  
   

 

SARVASAPARIPURAKACHAKRAMU-02

శ్రీచక్ర ద్వితీయావరణదేవతాః
కామాకర్షిణీ, బుద్ధ్యాకర్షిణీ, అహంకారాకర్షిణీ, శబ్దాకర్షిణీ, స్పర్శాకర్షిణీ, రూపాకర్షిణీ, రసాకర్షిణీ, గంధాకర్షిణీ, చిత్తాకర్షిణీ, ధైర్యాకర్షిణీ, స్మృత్యాకర్షిణీ, నామాకర్షిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ, అమృతాకర్షిణీ, శరీరాకర్షిణీ, సర్వాశాపరిపూరక చక్రస్వామినీ, గుప్తయోగినీ,
 సర్వాశాపరిపూరకము
 ****************
 'మనోబుద్ధయహంకారచిత్తాను" అంటూ ఆదిశంకరులు చిత్తవృత్తులను చిదానందముగా విపులీకరించారు.
 
 " కంజాక్షునకు గాని కాయంబు కాయమే" అంటూ ప్రహ్లాదుని ద్వారా అదే సత్యమును నొక్కివక్కాణించారు.
   షోడశదళపద్మముగా తన శక్తులను 16 విభాగములు చేసి,తనకుతాను పలుమారులు ఆవృత్తమగుచు జీవులను తమకుతాము స్వయంసమృద్ధులుగా భావింపచేస్తోంది అడ్డుగా నిలిచిన మాయ.
 ప్రతి మనిషి తన పంచేంద్రియములద్వారా,పంచభూతముల సహాయముతో,పంచతన్మాత్ర పరంపరతో ప్రకటింపబడుట వెనుక దాగిన పరమరహస్యమే,అజ్ఞాతముగా దాగి,ఆసరగా నిలబడుచున్న పదహారుశక్తుల ప్రస్తావనము.
  ఈ శక్తులను గుప్తయోగినులు/ఆకర్షణశక్తులగాను  భావిస్తారు.
 చిత్తమనే భరిణెలో మనస్సు-బుద్ధి-అహంకారము మొదలగు చిత్తవృత్తులు కొంతసమయముంది మరలినను,వాటివాసనలు జ్ఞాపకములుగా ముద్రింపబడిఉంటాయి.
 కామాకర్షిణి,బుద్ధ్యాకర్షిణి,ఆత్మాకర్షిణి,అహంకారాకర్షిణి,స్మృత్యాకర్షిణి ,శరీరాకర్షిణి మొదలైన సహాయక శక్తులు సాధకుని విచక్షణను స్పష్టీకరిస్తుంటాయి.
 సర్వాశాపరిపూరక చక్రములోని గుప్తయోగినుల
 వాత్సల్యమును పొందిన సాధకుడు చక్రేశ్వరియైన త్రిపురేశి దేవికి నమస్కరించి,మూడవ ఆవరణమైన"సర్వ సంక్షోభణ చక్రము"లోనికి గుప్తతరయోగినుల సహృదయతతో ప్రవేశించుచున్నాడు.

  శ్రీమాత్రే నమః. 

 

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...