Posts

Showing posts from December 17, 2017

ADIVO ALLADIVO -POIGAI ALWAAR

Image
  అదివొ-అల్లదివొ--పొయిగై  ఆళ్వారు   ********************************   సంభవామి యుగే యుగే -సాక్ష్యములైనవి హరి ఆయుధములు   ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన  మన ఆళ్వారులు   యథోత్తకారి సన్నిధిని పుష్కరిణి స్వర్ణపుష్పమున   ప్రకటించబడినది పాంచజన్యము తిరుసంగు గ   జ్ఞాన సంకేతమైన  సరోయోగి ముక్తిని అందీయగ   ముక్త పదగ్రస్తమైన ముదల్ "తిరువందాయ్" తేనెలు చిందెగ   ప్రపంచము ఒక దీపము, ప్రజ్వలన తైలము సాగరములు   సంసారము  ఒక సాగరము ,సరంగు  ఆ పెరుమాళ్ళు   నామ సంకీర్తన దివ్యదేశములను పావనమొనరించె   శుభ సంకల్పము  విజయ శంఖమును పూరించెగ   నిత్య-నిర్గుణ-నిరంజనుని నిరతము మది నిలుపుకొని   పరమార్థము చాటిన పోగయి ఆళ్వారు పూజనీయుడాయెగ.