Wednesday, January 12, 2022

TIRUPALLI ELUCHCHI-06

తిరుపళ్ళి ఎళుచ్చి-06 ******************* పప్పర విట్టిరుందునరుం నిన్ అడియార్ పందనై వందరుదా అవరుం పలరుం మైపురు కణ్ణియ మానుడత్త ఇయల్బీ వణంగు కిరార్ అనంగిన్ మణవాలా శెప్పొరు కమలంగళ్ మలరుందన్ వయల్సోల్ తిరుపెరుంతురైయురై శివపెరుమానే ఇప్పిరప్ప అరుందెమ్మై ఆండరుపురియం ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె. భవబంధ విమోచనాయ పోట్రి ************************ ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగర్ స్వామీ నీవు మానుడత్తి ఇయల్బీ-తగిన వరుడవు ఎవరికి నీవు సరియైన వరుడవు అంటే, మైపురు కన్నియ-లేడి కనుల మా అమ్మకు/ఉమాదేవికి ఇది వాచ్యార్థము. సహజకవి బమ్మెర పోతమాత్యులు వివరించినట్లు, "తగు నీచక్రి విదర్భరాజ సుతకున్ తథ్యంబు వైదర్భితుం తగునీ చక్రికి" అన్నట్లుగా ఉమాదేవి నీకు తగిన కన్య-స్వామి నీవు మా ఉమాదేవికి తగిన వరుడవు ఇంత మంచిదవునే దాంపత్యమీ ఇద్దరిని తగులన్ కట్టిన బ్రహ్మ నేర్పరి కదా. శివ పార్వతుల దాంపత్యము లౌకికముగా అన్వయించుకోలేనిది. స్థితి-గతుల సమాగమమే సృష్టి సంకల్పము శివ-శక్తుల సంగమమే సమస్త భువన భాండములు. ఇది కాదనలేని ఒక సిధ్ధాంతమైతే, మరొక విశ్లేషణ ప్రకారము పరమాత్మ యొక్కడే పురుషుడు/భర్త. చేతనులన్నె పరమాత్మచే భరింపబడేవే. ఏ విధముగా రాధామాయి,మీరాబాయి,సక్కుబాయి,అన్నమయ్య,గోపన్న స్వామి సేవించి,భగవత్-భక్త దాంపత్యమును మనలను దర్శింపచేసినారో, అదేవిధముగా శివనోమును ఓచుకొనుచున మన చెలులు తిరుపెరుంతూరు లో జరుగుచున్న సంఘటనలను అర్థముచేసుకొనుచున్నారు. అటుగా వెళుచున్న వారికి ఒక పెద్ద, పందనై-సమూహము కనిపించింది. వారు అడియారు-ఓ దైవమా అని పలవరిస్తూ,పులకరిస్తూ,కోలాహలమును చస్తూ వీరిని సమీపిస్తున్నారు. ఇక్కడోక విచిత్రము ఏమిటంటే వారు, "యతో యతో నిశ్చయతి మనస్ చంచలమస్థిరం తతః తతో నియం ఏతత్ ఆత్మాన్ యేవ వశం నయేత్" చంచలమైన మనసును మనము దైవము మీదకు కేంద్రీకరించుటకు ప్రయత్నించునపుడు,అది అప్రయత్నముగనే దానిని వీడి ఐహికములవైపునకు పరుగులు తీస్తుంది.అయినప్పటికిని మనము తిరిగి దానిని నిశ్చలత్వము వైపునకు నిర్విరామముగా ప్రయత్నమును చేస్తుంటే అది కుదురుకుని పరమాత్మ అనుగ్రహప్రాప్తిని పొదగలుగుతుంది. అట్తి స్థితిలో ఆంతర్యము నిశ్చలమై ఆనందిస్తూ,బాహ్యము నర్తిస్తుందికదా చెలులారా. పదండి.మనమును వారిని దర్శించుకుని పునీతులమగుదాము అంటు వారికి నమస్కరించి,వారి ఆనందోత్సాహములకు కారనమును తెలుసుకొనగోరిన వెంటనే వారు దయాంతరంగులై, పప్పర విట్టిరుం-ప్రపంచ బంధములనుండి విముక్తులమైనామని,పరమాత్మ తత్త్వములో పరిమళిస్తూ/పరవశిస్తూ,తిరిగి వెంటనే అంతర్ముఖులైనారు. వారి హృదయములవలె.మన చెలుల హృదయములు సైతము, మలరుందన్-పుష్పములు విచ్చుకొనుచున్నట్లు, శెన్-పొరు-శెప్పొరు -ఎర్రని బంగరు కమలంగళ్ పద్మములు అవ్యును వయల్సోల్-విచ్చుకొనుచున్న కెందామరల వంటి హృదయములతో శివనోమునకు వెళ్ళుచున్నారు. ఈ రోజు మనము మాణీక్యవాచగరులో కలిగిన పరివర్తనమును గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము. ఓ అడియార్-ఓ మా సమ్రక్షకుడా ఎన్ పప్పర్ విట్టినందు-నా ప్రపంచ బంధములు వీడినవి నేను ఇప్పుడు నీ పరివ్రాజకుడను కాని పాండ్యదేశ ప్రధానమంత్రిని కాదు. ఆశ్వముల అవసరము నాకులేదు.ఇంద్రియలౌల్యమును నేను కోరుకోను. అని స్థిరనిశ్చయుడై,అత్యంత వైభవముగా ఆత్మనాథుని కోవెల పునర్నిర్మాణమునకు ఉద్యుక్తుడై,సఫలీకృతుడైనాడు. పది ఎకరముల విస్తీర్ణతతో యున్న స్థలములో నిర్మించబడిన ఈ కోవెలలోని మూల విరాట్టునకు రూపములేదు.ఆత్మ తత్త్వముగా భావించి ఆత్మనాథుడను నామముతో కొందరు పిలుస్తారు/కొలుస్తారు. కొన్ని మెట్లు దర్శనమిస్తాయి కనుక అవుడియార్/మెట్లస్వామి అని అవుడియార్ కోవెల అని తలుస్తారు/కొలుస్తారు. కొలిచేవారికి యోగ్యతను ప్రసాదిస్తారు కనుక ఇక్కడ నంది-నందివాహనుడు కానరాకున్నను, యోగనాథుడు-యోగాంబిక అని ,జగతం పితరే వందే పార్వతీ-పరమేశ్వరం గాను ప్రార్థిస్తారు. ఇదిక్కడ ఇలా ఉంటే అక్కడ పాండ్యరాజు గుర్రములను తీసుకొని వస్తున్న వధూరూరునకై వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు. మూడుకన్నులవాడు ఏమివేడుకనో చేయబోతున్నాడో రేపటి పాశురములో తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము. అంబే శివే తిరువడిగళే శరణం.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...