Saturday, October 14, 2017

SAUMDARYA LAHARI-45


  సౌందర్య లహరి-45

 పరమపావనమైన నీ పాదరజ కణము
 పతిత పాలక్మైన పరమాత్మ స్వరూపము

 కన్ను మనకు గొప్పదే చూదగలిగినప్పుడు
 చెవి కూడా గొప్పదే వినగలుగుతున్నప్పుడు

 పెదవులెంత గొప్పవో పలుకగలుగుతున్నప్పుడు
 చెయ్యి కూడ గొప్పదే చేయూత కాగలిగినప్పుడు

 మనసు కూడ గొప్పదే బుద్ధితోడు ఉన్నప్పుడు
 ఇంద్రియములు నిష్ఫలము అమ్మశక్తి లేనప్పుడు

 కృతకములగు వీని కృత్యములు నీ కృపయైనపుడు
 కృపారసముతో నన్ను కృతకృత్యునిచేయగ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-46

 సౌందర్య లహరి-46

 పరమపావనమైన నీ పాదరజ కణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 మందబుద్ధి లోపమును మాతగ సవరించుట
 దారిద్ర నారాయణుని ధైర్యలక్ష్మిగ అనుసరించుట

 గడ్డిపరకకు దొడ్డదైన వజ్రాయుధ శక్తినిచ్చుట
 సాధనకు సానుకూల ఆలోచనలనిచ్చుట

 సచ్చిద్రూపమునందు  శ్రద్ధను పెంపొందించుట
 సమయాచారములను స్మృతిలో స్థిరీకరించుట

 బుద్ధి,కీర్తి,ధృతి,లక్ష్మి అను శుభలక్షణములతో
 అమ్మ ప్రత్యక్షరూపములు అవగతమగుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-47


  సౌందర్య లహరి-47

 పరమపావనమైన నీ పాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 సహనశీలమును చాటగ భూదేవిగ మారుతావు
 దాహమును తొలగించగ మేఘమువై జారుతావు

 ప్రాణికోటిని బ్రతికించగ ప్రాణవాయువవుతావు
 సూర్య-చంద్ర నేత్రములతో గగనముగా మారుతావు

 ఆరోగ్యము అందించగ ఔషధములు అవుతావు
 మా లోపలి అగ్నిగా మమ్ము నడుపుతున్నావు

 పంచభూత రూపమున మంచితనము చాటున్న
 నీ వాత్సల్యము మాకు స్తన్యముగా మారువేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-48


   సౌందర్య లహరి-48

 పరమపావనమైన నీ పాదరజ కణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 ఉపవాస-ఉపచారములు పూజకు రెండు వైపులు
 ఉచ్చారణ-విచారణలు పూజకు రెండు వైపులు

 అనురాగము-విరాగము భక్తికి రెండు వైపులు
 మౌనము-మననము ధ్యానమునకు రెండు వైపులు

 పాపము-తాపము సహనమునకు రెండు వైపులు
 శిక్షణ-రక్షణ నీ కరుణకు రెండువైపులు

 సద్గుణ-నిర్గుణములు నీ రూపమునకు రెండు వైపులు
 నీ ద్వైతము అద్వైతముయై నన్ను చూచుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి, ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-49


  సౌందర్య లహరి-49

 పరమపావనమైన  నీపాదరజ కణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 అహంకరించుచున్న అనునిత్యపు అసత్యమునుండి
 కృతకృత్యులచేయు నీవు అసలైన సత్యమువని

 మిడిమిడి జ్ఞానముతో విర్రవీగు అజ్ఞానికి
 విజ్ఞతను తెలియచేయు శుద్ధజ్ఞానమే నీవని

 ఆది అంతమేలేని అనంత దివ్య స్వరూపమువని
 అండాండ పిండాందములలో దాగిన బ్రహ్మాండము నీవని

 సత్యము-జ్ఞానము-అనంతము-బ్రహ్మము గా వెలుగుచున్న వేళ
 నిత్యమేదో తెలుసుకొని నిన్ను కొలువ సిద్ధమై

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి  ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-50

 సౌందర్య లహరి-50

 పరమపావనమైన నీపాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 ఉండి,పోవునవి యేగ మానవ నాలుగుదశలు
 ఉండి,పోవునవి యేగ మనిషి కోపతాపములు

 ఉండి,పోవునవి యేగ ఋతువులు ఏడాదిలో
 ఉండి,పోవు వారేగా రవిచంద్రులు  దినములో

 ఉండి,పోవునవి యేగ మంచి చెడులు మనుగడలో
 ఉండి,పోవునవి యేగ ఆకలిదప్పులు జీవికి

 ఉండి,పోవునదియేగ జగతి ప్రతి ప్రళయములో
 ఉండి,పోవు ఈ జీవి నీ పదముల ఉండిపోవుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.



SAUMDARYA LAHARI-51

 సౌందర్య లహరి-51

 పరమపావనమైన నీపాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 భూగోళ ఖగోళముల మిళిత జ్యోతిషముగా
 యజ్ఞ సంకేతములలో మనోజ్ఞ మధురధారగా

 అవ్యక్త శక్తియైన శివశక్తి స్వరూపిణి
 వ్యక్తం అంబామయం సర్వంగా ప్రకటితమవుతావు

 కీర్తన రూపముగా వాక్కు వ్యక్తమవుతుంటే
 జపము తపము మనసులో మిళిత శక్తులవుతుంటే

 మంత్ర తంత్ర శక్తులతో సూక్ష్మ నిశిత అల్లికగా
 నీ పురాణ శ్రవణము పురుషార్థమగుచున్న వేళ

 నీ  మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-52


  సౌందర్య లహరి-52

 పరమ పావనమైన నీపాద రజకణము
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

 శారీరక అందములు శాశ్వతములుకావను తెలివిలేక
 ఐహిక సుఖములు బహు స్వల్పములు అను ఊహలేక

 సంసార సాగరమును  నిస్సారముగా ఈదలేక
 అహంకార ప్రాకారపు హుంకారమును వినలేక

 నిరాకార నిర్మల నిరంజనిని కనలేక
 మూర్తీవభించిన అనుగ్రమును కీర్తించగ స్పూర్తిలేక

 పాతాళమునకు జారి అటుఇటు పారిపోవ దారిలేక
 పడిపోవుచున్న నన్ను పట్టి కాపాడుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలువిడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-53


  సౌందర్య లహరి-53

 పరమపావనమైన నీపాదరజ కణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 ఒడిలోన లాలించే లలిత లలిత సుకుమారిగా
 అజ్ఞానము చండాడే దేవీ చాముండిగా

 శతృసంహారమునకు శూలధారి దుర్గగా
 పత్రవసన ధారిణి బోయసాని వనదుర్గగా

 హలము-ముసలము దాల్చిన భీషన వారాహిగా
 సారస్వత రూపమైన సర్వశుక్ల సరస్వతిగా

 బాలగా,కౌమారిగా,ముదితగా,పండు ముత్తైదువగా
 బహురూప దర్శనము భక్త పరాధీనత యగుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-54


  సౌందర్య లహరి-54

 పరమ పావనమైన నీపాదరజ కణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 అమ్మ నయనములు అమరినవి అతిసుందర నగరములుగ
 విశాల నయనములేగా ఆ విశాలనగరము

 కనుల కరుణధారలేగ  ధారా నగరము
 ఆ ఇంతి అనురాగమేగ అవంతీ నగరము

 సౌభాగ్య లక్షణమేగ లక్షణ భోగవతి
 నిధ్యారహిత కటాక్షమే లక్షణ భోగవతి

 కనుల కాంతి కదిలెను కళ్యాణ నగరముగ
 నగజ తనయ జగములనేలు చున్న వైభవములో

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-55


 సౌందర్య లహరి-55

 పరమ పావనమైన  నీ పాదరజకణము
 పరమపావనమైన  పరమాత్మ స్వరూపము

 పూర్వమో  ప్రస్తుతమో తెలియని నీ కాలము
 అమ్మవో  అయ్యవో తెలియని నీ దర్శనము

 సద్గుణమో నిర్గుణమో తెలియని నీ రూపము
 దండనయో అందయో తెలియని నీ స్వభావము

 పాపమో పుణ్యమో తెలియని నీ విధానము
 అదరణో నిరాదరణో తెలియని నీ తాత్సారము

 సరియైనదో కాదో తెలియని నీ సమభావము
 నా మూఢ నిద్దుర చిన్ముద్రగా మారుచున్న వేళ,

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి  ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-56


  సౌందర్య లహరి-56

  పరమ పావనమైన నీ పాదరకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  ఆకలిలో దాగియున్న  అగ్నిహోత్ర జ్వాలగా
  ఆహారములో  సాగుచున్న సృష్టి-స్థితి  లీలగ

  అక్షరనులనేలుచున్న విలక్షణ స్వరముగా
  వీక్షణముల బ్రోచుచున్న  సాక్షాత్తు కరుణగా

  కదలని కనురెప్పల కరుణే కనుసన్నలుగా
  ఋతువులు మార్చుచున్న కాలాతీత రూపిణిగా

  సర్వకాల సర్వావస్థలలో  సన్నిహితముగా
  బ్రహ్మాండములతో నీవు బంతులాడుచున్న వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి  ఓ సౌందర్య లహరి.

  

SAUMDARYA LAHARI-57

       సౌందర్య లహరి-57

 పరమ పావనమైన నీ పాదరజ కణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 అర్చన సమయములో రూపముగా ప్రకటించుచు
 సంస్తుతి చేయునపుడు స్తోత్రముగా  పలికించుచు

 చింతనావస్థనున్నప్పుడు హృదయముగా భాసించుచు
 తత్త్వ విచారమందున్నప్పుడు  సర్వత్రా వ్యాపించుచు

 లక్షనమగు ప్రతిపనికి లక్ష్యముగా రాజిల్లుచు
 మణితోరణమనే కరుణ అరుణకాంతులతో

 చమత్కారముగా చలించు శ్వాసచేయుచున్న
 అజపామంత్రము వింతగ అతిపవిత్రమగుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYALAHARI-58

 సౌందర్య లహరి-58

 పరమ పావనమైన నీపాద రజ కణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 దాతకు కీర్తిని ఈయగ దానముగా మారుతావు
 ధాత్రికి నీడను ఈయగ బీజములో చేరుతావు

 దారుణకాండలు ఆపగ కరుణగా కదులుతావు
 మేథకు స్పూర్తినీయగ నాదమునే నిలుపుతావు

 బాహ్యాంతర పరిశీలన భక్తి అని చాటుతావు
 పిపీలకాది పర్యంతము పరమాత్మను చూపిస్తావు

 నా కలవరమును తొలగింపగ బహుముఖముల కాపాడుచు
 నా స్వల్పకాలిక లయము అంగరక్షణగా మారువేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-59







    సౌందర్య లహరి-59

 పరమ పావనమైన  నీ పాదరజకణము
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  ధర్మాచరణములు సంకెలలను భావించు నేను
   కర్మాచరణముమర్మమెరుగలేని నేను

  ఒక్కసారి నీ నామము చక్కగ పలుకలేని నేను
  లిప్తపాటు చిద్రూపము చిత్తమున ముద్రించలేను నేను

  కుటిలమగు మనసుతో నీ పటిమను పలుకలేని నేను
  నర్మగర్భమాయ యందు నడయాడుచున్న నేను

  మత్తు తొలగి చిత్తును చూడాలనుకొన్న నా మనసు
  చిత్తు కాగితముపై నీ దయ చిత్రముగా మారువేళ



 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి  ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-60


   సౌందర్య లహరి-60

 పరమ పావనమైన  నీ పాదరజకణము
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

 ఆధారము  ఆధేయము  రెండు నీవేనని
 ధ్యానము ధ్యాత  ధ్యేయము మూడు నీవేనని

 బాల్య కౌమార యవ్వన వార్ధక్యము నాలుగు నీవేనని
 నీరు నిప్పు నింగి నేల గాలి ఐదు నీవేనని

 కామక్రోధాది గుణదోషములు  ఆరు నీవేనని
 తిర్యక్ జడములు నరులు అంతా నీవేనని

 నవావరణలోని ననవోన్మేషమూర్తి నీవు
 పిపీలకాది బ్రహ్మాండము నిర్ద్వందము యగుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి  ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-61

  సౌందర్య లహరి-61

  పరమపావనమైన  నీపాదరజ కణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  నీ నయన సంకేతమే ఇల సాంకేతికమని
  నీ కరుణ ప్రవాహమే ఇల సాగు  వాహినులని

  నీ కొనగోటి కల్పనలే ఎనలేని వనరులని
  నీ పుట్టింటి చుట్టరికమే రక్షించే గుట్టలని

  సేదతీర్చు నీ ఒడే  నాసేద్యపు ఒరవడి అని
  ఆగ్రహానుగ్రహములు హెచ్చరిక మచ్చుతునకలని

  పట్టి విడుచు గ్రహణములని గ్రహియించిన రవి-శశి వలె
  నా అపరిణిత సూక్తులు నవ విధభక్తులగుచున్న వేళ

  నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి

SAUMDARYA LAHARI-62


   సౌందర్య లహరి-07

  పరమ పావనమైన నీ పాదరజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  నేను కసురుకున్నా గాని ముసిముసి నవ్వే అనుకో
  నేను విసిగించిన గాని నాది పసితనమే అనుకో

  నేను చేయి పట్టుకోనన్నా నన్ను గట్టిగా పట్టుకో
  నేను  మారాములు చేసినా  గారాబు పట్టిని అనుకో

  వట్టిమాటలే అయినా  కట్టుకథలు  కావనుకో
  గాజుకళ్ళతో నిన్ను చూసినా రాజీ పడిపో

  నీ ఆలన-పాలనలో నేను తేలి ఆడా
లనుకో
  తెలిసో-తెలియకో నిన్ను నేను  వేడుకొనుచున్నవేళ

  నీ మ్రోలనే ఉన్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.

SAUMDARYA LAHARI-63


      సౌందర్య లహరి-63

  పరమ  పావనమైన  నీ పాదరజకణము
  పతిత  పాలకమైన  పరమాత్మ స్వరూపము

  గులకరాయిలా  నన్ను గుర్తించినదే  తడవుగా
  పాద ధ్యానమునకు నన్ను తరలించినదేమో

  భావనా మాత్రతతో నా భావోద్వేగమును  తొలగించగా
  అనుక్షణము శుభలక్షణములను అలదినదేమో

  పరిశుద్ధ మనమునకు పరిపక్వతనందించగా
  అతిశయమగు కరుణతో అజ్ఞానము తొలగించినదేమో

  జాడ్యములను తొలగించి  జ్ఞానమును  కలిగించగా
  సానపెట్ట  రాతిమనసు  సాలగ్రామమగుచున్న వేళ

  నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి ! ఓ సౌందర్య లహరి.

  

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...