SAUMDARYA LAHARI-55
సౌందర్య లహరి-55
పరమ పావనమైన నీ పాదరజకణము
పరమపావనమైన పరమాత్మ స్వరూపము
పూర్వమో ప్రస్తుతమో తెలియని నీ కాలము
అమ్మవో అయ్యవో తెలియని నీ దర్శనము
సద్గుణమో నిర్గుణమో తెలియని నీ రూపము
దండనయో అందయో తెలియని నీ స్వభావము
పాపమో పుణ్యమో తెలియని నీ విధానము
అదరణో నిరాదరణో తెలియని నీ తాత్సారము
సరియైనదో కాదో తెలియని నీ సమభావము
నా మూఢ నిద్దుర చిన్ముద్రగా మారుచున్న వేళ,
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
Comments
Post a Comment