NAH PRAYACHCHAMTI SAUKHYAM-20

నః ప్రయచ్చంతి సౌఖ్యం-20 ******************************* భగవంతుడు చర్మధారుడు-భక్తుడు చర్మకారుడు " గజచర్మావృత తనుం స్ఫురత్ ప్రహరణోజ్వలం సర్వపాపహరం ధ్యాయేత్ దేవం కుంజర భేదినం." పరమేశ్వరుడు గజచర్మమును ధరించి యుండెను.శత్రువులపై ప్రయోగించుటకై చేతిలో చేతిలో ఆయుధములతో ప్రకాశిస్తున్నాడు.భక్తుల సర్వపాపములను హరించుచున్న రుద్రునకు నమస్కారము. లోకకళ్యాణమునకై త్రిలోక సంచారి-త్రిలోకవేది యైన నారద మహర్షి గజాసురుని సభకు వెళ్ళి,గజాసురా! నీవు అతిబలవంతుడవు కావున నీ తపోమహిమతో శివుని నీ ఉదరమునందు నివసించు వరము కోకోమనెను.ఉచితానుచితములను మరచిన గజాసురుడు అదేపని చేసెను.స్వామిని కైలాసమునకు తిరిగి తీసుకొనివెళ్ళుటకు గంగిరెద్దుల మేళముతో బ్రహ్మ-విషుణు ంతక్కిన సురలు విచిత్రవేషములతో గజాసురుని కొలువునకు వచ్చిరి.గంగిరెద్దుల మేళముపై అత్యంతాసక్తి గల అసురుడు వారు ఆడుటకు అనుమతినిచ్చెను.విష్ణువువు చేయుచున్న స్తుతులకు భోళా శంకరుడు అమితముగా పొంగిపోవుటచే,భరించుటకు గజాసురునికి కష్టమాయెను.మాయతొలగిన మనసు విషయమును గ్రహించినది.వినయముతో తలవంచినది.జాలిగుండె శివుడు వా...