TIRUVEMBAVAY-04
తిరువెంబావాయ్-04 **************** "కృపా సముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీ వామభాగం సదాశివం రుద్రం అనంతరూపం చిదంబరేశం హృదిభావయామి" సందర్భము *********** శివనోమునకై భాగ్యశాలురు ఒకరినొకరు మేల్కొలుపుకొనుచు,స్వామి లీలా విశేషములను సంకీర్తనము చేసుకుంటూ నాల్గవ కన్నియ దగ్గరకు వచ్చారు. ప్రస్తుత పాశురము లోని కన్నియ తేజోశాలి.నిరంతరము అంతర్ముఖములో నుండెడిది.కనుక చెలులతో కన్నులు తెరువకనే మాటలాడుచున్నది. ప్రస్తుత పాశురములో తిరు మాణిక్య వాచగరు నోమునకు కావలిసిన యమ-నియమములను (ఓఅటించవలసినవి/పాటించుటకు నిషేధించబడినవాటిని)సూచిస్తూనే స్వామి లీలావైభవమును ప్రసాదిస్తున్నారు. పాశురము ***** ఒణ్ణిత్తిల నగయా ఇన్నం పులందిండ్రో వణ్ణిన్ కిళిమొళియార్ ఎల్లారుం వందారో ఎన్నికొడు ఉళ్ళవా చుళ్ళుకో మప్పళవున్ కణ్ణి తుయిల్ అవమే కాలత్తై పోగాదే విణ్ణికొరు మరుందై వేదవిదు పొరుళై. కణ్ణుక్కు ఇనియానై పాడి కసిం ఉళ్ళం ఉళ్నెక్క నిన్రురుగై యామాట్టో నీయే వందు ఎన్ని కురైయిల్ తుయిల్ యేలో రెంబావాయ్. ...