TIRUVEMBAVAY-04
తిరువెంబావాయ్-04
****************
"కృపా సముద్రం సుముఖం త్రినేత్రం
జటాధరం పార్వతీ వామభాగం
సదాశివం రుద్రం అనంతరూపం
చిదంబరేశం హృదిభావయామి"
సందర్భము
***********
శివనోమునకై భాగ్యశాలురు ఒకరినొకరు మేల్కొలుపుకొనుచు,స్వామి లీలా విశేషములను సంకీర్తనము చేసుకుంటూ నాల్గవ కన్నియ దగ్గరకు వచ్చారు.
ప్రస్తుత పాశురము లోని కన్నియ తేజోశాలి.నిరంతరము అంతర్ముఖములో నుండెడిది.కనుక చెలులతో కన్నులు తెరువకనే మాటలాడుచున్నది.
ప్రస్తుత పాశురములో తిరు మాణిక్య వాచగరు నోమునకు కావలిసిన యమ-నియమములను (ఓఅటించవలసినవి/పాటించుటకు నిషేధించబడినవాటిని)సూచిస్తూనే స్వామి లీలావైభవమును ప్రసాదిస్తున్నారు.
పాశురము
*****
ఒణ్ణిత్తిల నగయా ఇన్నం పులందిండ్రో
వణ్ణిన్ కిళిమొళియార్ ఎల్లారుం వందారో
ఎన్నికొడు ఉళ్ళవా చుళ్ళుకో మప్పళవున్
కణ్ణి తుయిల్ అవమే కాలత్తై పోగాదే
విణ్ణికొరు మరుందై వేదవిదు పొరుళై.
కణ్ణుక్కు ఇనియానై పాడి కసిం ఉళ్ళం
ఉళ్నెక్క నిన్రురుగై యామాట్టో నీయే వందు
ఎన్ని కురైయిల్ తుయిల్ యేలో రెంబావాయ్.
ఓ దరహాస చంద్రిక ! నీకు ఇంకా తెల్లవారలేదా? ఇంకా కన్నులు మూసుకునియే ఉన్నావు.మేమందరము(అందరము) శివనోమునకు సిద్ధమై వచ్చాము.ఈ నిద్దుర నీకు తగదు.మేల్కాంచుము అనిరి.
పాశురము సంభాషణ చమత్కారముతో ఉండి సదాశివుని కొనియాడుతుంటుంది.
వారికి బదులిస్తూ ఆమె మీరందరు వచ్చారా?మీరు లెక్కింస్తుంటే నేను మనసులోనే లెక్కపెంటుకుంటాను.లెక్క అయిన తరువాత మీ దగ్గరకు వస్తాను అంటూ కళ్ళుమూసుకుని ఆత్మానందాన్ని అనుభవిస్తున్నది.
పంచదార చిలుకల నేర్పుగల వారు ఓ చెలీ లేచివచ్చి నీవే మమ్ములను లెక్కించు.నీ పావన స్పర్శచే ,
కురైయిల్ తుయిల్" మా దోషములు తొలగి సంస్కరించబడుతాము.
అంతే కాదు .కాల స్వభావము నీకు తెలియనిదా.ఎవ్వరి గురించి ఆగకుండా సాగిపోతూనే ఉంటుంది.
స్వర్గ మాథుర్యము/మందారమకరందము-వేదస్వరూపము అయిన స్వామిని కనులారా చూస్తూ,అర్ద్రత నిండిన మనసుతో పరవశముగా ప్రస్తుతిస్తూ నోమును నోచుకుందాము.
నీవు వచ్చి మమ్ములను లెక్కించి లెక్క సరిపడకున్నచో నీ నిదురను కొనసాగించవమ్మా అని వేడుకుంటున్నారు.
ఏమిటి ఈ లెక్క?కేవలము చెలుల సంఖ్య అనుకుంటే పొరబాటు.అవి మన పంచేంద్రియములు
.అవి పరిశుద్ధమయినవా అని పరికించుటయే ఆ లెక్క.
ఆహారసిద్ధి-ఆసనసిద్ధి-ఆరాధ్యసిద్ది-ఆనందసిద్ధి పొందాలంటే స్వామి అనుగ్రహము మనకు కావలిసినది.
అంబే శివే దివ్య తిరువడిగళే శరణం.
ఏక బిల్వం శివార్పణం.

Comments
Post a Comment