TIRUPALLIELUCHCHI-04
తిరుపళ్ళి ఏలుచ్చి-04 ****************** "కృపాసముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీ వామభాగం సదాశివం రుద్రం అనంతరూపం చిదంబరేశం హృది భావయామి." సందర్భము ********* శివనోమును ప్రారంభింపబోతున్న మన కన్నియలకు స్వామి నేత్ర పుండరీకములు,ముఖబింబము,స్వామిని సేవిస్తున్న నాదము అనుగ్రహించాయి .అసలు స్వామి నోము సంకల్పమే నోము సాఫల్యము.దానికి వారు చేయుచున్న సన్నాహములు-స్నానములు-సన్నుతులు స్వామి కటాక్షమే.ప్రతి అడుగు వారిని స్వామి పాదపద్మములకు చేర్చుచున్నదే. నానారూపములకు భక్తి నర్తిస్తూ ఏ విధముగా నానారక అనుగ్రహపాత్రులను చేస్తుందో మనకు తిరు మాణిక్యవాచగరు వివరిస్తున్నారు. ఎళుచ్చి. ******* తిరుపళ్ళి ఎళుచ్చి-04 ******************* ఇన్నిశయై వీణయర్ యాళినుర్ ఒరుపాల్ ఇరుక్కొండుం తోత్తిరం ఇయంబినార్ ఒరుపాల్ తున్నియ పిణై మలర్ కయ్యనర్ ఒరుపాల్ తొళుకయ్యర్ అళుకయ్యర్ తునళ్కయ్యర్ ఒరుపాల్ సెన్నియల్ అంజలి కుప్పినార్ ఒరుపాల్ తిరుప్పెరుంతురై శివపెరుమానే ఎన్నయుం ఆండ్రుకొండుం ఇన్నరుళ్ పురియం ఎం పెరుమ...