Posts

Showing posts from November 2, 2017

OMTARI MAEGHAMU.

Image
   ఒంటరి మేఘం        **************   ఒంటరి మేఘంలా  మింటను దిగులుగా  వెంటాడే దు:ఖంతో  జంటగా సాగుతుంటే  తలవని తలపుగా  తారస పడ్దాయి  మెచ్చుకోలు రూపాలుగా  పచ్చనైన పూలు  కిలకిల కేరింతలతో  చిరుగాలుల జావళులకు  తలలూపుచు మోహనముగా  ఆహా! అనిపించేలా  ఏటిగట్టు చెలిమితో  అలల పలకరింపులకు  తలపడుతూ పోటీగా  రాగం! వినిపించేలా  మిస మిస పరుపులతో  సువాసనల  తరలింపుకు  తలవాలిచి ముద్దుగా  సేవే! కనిపించేలా  కనలేమని కలవరముతో  తామె వచ్చు ఊహలకు  తలమానిక ధర్మంగా  అందం! అదిరిందనేలా. ( శ్రీ వర్ద్స్ వర్త్ గారి  డఫడల్స్ స్పూర్తితో -- )  నిమ్మగడ్డ సుబ్బ లక్ష్మి.

O! EKAAMTAMAA

Image
ఓ ఏకాంతమా!!!! ***************** కమ్మనైన రాగమేదో తీస్తున్నది విరిబోడి కొమ్మచాటు కోయిలేదో దాస్తున్నది తడబడి పిడికిలిలో కొడవలి కోస్తున్నది వరిమడి గడసరిగ కనుగవ చూస్తున్నది జతపడి ఓ.......ఏకాంతమా! ఏమరుపాటుగా ఈ కాంతను వీడకు ఎలనాగ ఆనందము చేజారనీయకు కమ్ముకున్న శోకమేదో దాగినది మథనము నమ్మలేని మైకమేదో సాగినది మధురము తమకములో గమకములే చేరినవి హరితము మమేకముగ గమనమే మారినది మురిపెము ఓ.....సంగీతమా! పంతువరాళినే కొత్తపుంతలుగా సాగనీ సరికాదను వారిని సడిసేయక సాగనీ చెమ్మగిల్లి యుగళమై కొండకోన పాడినది చెమ్మచెక్క తాళమై నింగినేల ఆడినది బొమ్మరిల్లు రూపమై లోయహాయి కూడినది అమ్మదొంగ అమ్మాయై కడలి అల ఓడినది ఓ......సౌందర్యమా! నీదైన ప్రవాహమే కలువల కాసారము శ్రమైక జీవనమే సకలవేద సారము. తెమ్మెరలై ప్రతినోట ఆమెపాట తాకినది ఉమ్మడివై ప్రతిచోట పని-పాట సాకినవి ఏమ్మహిమో ప్రసరిస్తూ ప్రతిపూట వేకువైంది అమ్మాయిని సంస్తుతిస్తూ సకలము మోకరిల్లుతోంది ఓ సాహితీ సౌరభమా! అనుభవమే అనుభూతిగ భావితరము చేరనీ తరిస్తూ,తరలిస్తూ తరాలు తరియించనీ. ( శ్రీ వర్ద్స్ వర్త్ గారి "ది సాలిటరి రీపర్" స్పూర్తితో)

SAMAAMTARA PRAYAANAMU.

Image
సమాంతర ప్రయాణం ********************* అప్సరసలు-అభిఘాతలు అందుకోలేరు అంటూ పదాతిదళ పౌరుషముగ పరుగులు తీస్తున్నది రైలు పశువులు-పచ్చికలు పాడి పంటలు అంటూ పచ్చదనపు ముచ్చటగ చొచ్చుకుపోతున్నది రైలు ఉత్తానము-పతనము అనివార్యము అంటూ నల్లని బెర్రీల బాలునిగ కూతలు పెడుతున్నది రైలు పర్వతములు-కందకములు ఎత్తు పల్లములు అంటూ ఎత్తుగడల గమ్మత్తుగ కొత్తగ తోస్తున్నది రైలు కర్షకులు-కార్మికులు నదులు మరలు అంటూ మనసైన చిత్రకారునిగ రంగులద్దుతోంది రైలు సుకుమారము-శ్రమ వైనము డయిజీలు డయిలీలు అంటూ బడుగుకు ఓదార్పుగ బడియగుచున్నది రైలు లిప్తపాటు-శాశ్వతము సమాంతరమే అంటూ అనుభవాల అనుభూతిగ జేజేలైనది రైలు (బోగి) శ్రీ రాబర్ట్ లూయీ స్టీవెన్సన్ గారి (ఫ్రం ఎ రైల్వే కేరేజ్ )స్పూర్తితో

LAMCHAM DAMDAKAM.

Image
"లంచం"దండకం =============== దాసోహమమ్మా,ఇహలోక సంచారిణి, బహురూప వరదాయినీ,చిద్రూప చింతామణి. ఓ విదుషీమణీ మస్కాలకు,నమస్కారాలకు ఆస్కారమే లేదంటు శూన్యమై, ధన,కనక,వస్తు,వాహనాదులకు ఆస్వాదనే వేదమంటు సూక్ష్మమై, మనోవాక్కాయ కర్మాభిలాషలను భేషుగ్గా అందించు ప్రత్యక్షమై, ఓ శుభలక్షణా తూర్పు తిరిగిన దండంబునకు ఓదార్పుగా పడమర చేరి కనుమరుగవని ఓ నేర్పుగా ఉత్తరువులందించు ఉత్తరపు ఓ మార్పుగా ప్రదక్షిణలు చేయించు ఓ కూర్పుగా ఓ పరాత్పరీ వీలుకానిదేదీ లేని పలు వీలునామాల నందించు వకీలుగా నైవేద్యో నారాయణో హరి కీర్తింపబడుచున్న ఆచారిగా మిథ్య విద్యాలయాలఓ గుణపాఠాలు నేర్పించే ఒకే ఒజ్జగా తడిసిన   ఇరుచేతుల  వరముల జడివానలు కురిపించు ఓ వరుణిడిగా అలివేణి కరుణామయి నీవు తాత్సారపు వాత్సల్యమా కార్యాలయాలకేరింతలాడు ఉత్సాహమా తారుమారులకు వీరతాడగు ప్రోత్సాహమా తాను జతకూడనను వాని బతుకు జుగుప్స వా ఓ ఈప్సిత ప్రదాయినీ, మూఢులు   కాంచనంబొల్లకే ఇనుము కోరు చందంబున, ఉంచమని అందిస్తూ,లంచమని నిందిస్తూ,తుంచమని చిందులేస్తుంటే. సూతుడు శూరతనొందుట,శూరుడు నిర్వీర్యుడగుట(కర్ణ...