Sunday, November 3, 2024

TANOTU NAH SIVAH SIVAM-03


      

   తనోతు నః శివః శివం-03

   ******************




 




 " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే


   జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ."


       (మహాకవి కాళిదాసు)




  మహాదేవుని కరుణ మాటలలో చెప్పలేనిది.మనసుతో ఆస్వాదించవలసినది.


   గంగమ్మను-వాసుకిని-డమరకుమును ప్రపంచమునకు పరిచయము చేసిన విశ్వేశ్వరుడు తన విశ్వరచనమును మరింత విస్తృతము చేస్తున్నాడు.


  "గంగాతరంగ కమనీయ జటాకలాపం-"


  తనజటల స్వరూపమును మార్చివేస్తున్నాడు.


 చిక్కులతో విడదీయరాని అటవి గమ్మత్తుగా పెద్ద గంగాళముగా తన రూపును సవరించుకుంటోంది.ఇది గంగమ్మకు ఒకపెద్ద సవాలు.తన పాటికి తాను ప్రశాంతముగా ప్రవహిస్తూ,స్వామి జటలను పావనముచేస్తూ,నాట్యవేదికను పవిత్రమొనరించానని తన సామర్థ్యమునకు పొంగిపోదా మనుకుంటే,

          అబ్బే1

 ఆ అవకాశమే లేకుండా చేస్తోంది స్వామి జట.ఎటువెళ్ళాలో తెలియక భయముతో కూడిన ఆశ్చర్యముతో సుడులుతిరగ తప్పదనుకుంటోంది పాపం.


  మహాదేవుడు తన లలాటమును విష్ణుపాదముల నుండి ఆవిర్భవించిన గంగాతరంగ భ్రమణము యొక్క కాంతులతో(వల్లరులు) తేజరిల్లునట్లు సేవాభాగ్యమును కల్పించినాడు.గంగమ్మ తల్లినిచూసిన మూడవకన్ను తాను సైతము ఎర్రని వస్త్రముగా స్వామి నుదుటిని సేవించుకుందామనుకుంటుమ్న్నది


   ఇదియే కదా చమత్కారము.


 నీరు-నిప్పు సహనముతో-సమన్వయముతో స్వామి నుదుటను ప్రకాశించుట.(అగ్ని-సోమాత్మకము)


 పంచభూతములలో(భూతము  అనగా ఉనికిని ప్రకటించుకొనినది)  మూడవ భూతమైన అగ్ని ,భూమి-జలములతో వచ్చిచేరినది.


 అభిషేకము జరిగినది.  తదుపరి  అలంకారము సహజముకదా.


 "సీతాంశు శోభిత కిరీట విరాజమానం" 

       మహాదేవుడు  తన శిఖపై బాలచంద్రుని సిగపూవుగా అలంకరించుకొనుటకు ముచ్చట పడుతున్నాడేమో.


  ఈ బాల చంద్ర ధారణ రహస్యము మనకు ముందుముందు అర్థమవుతుంది.


 మొదటి చరణము "వీక్షణమును" ,   అనుగ్రహిస్తే,

       రెండవ చరణములో 

 స్వామి కరుణ అవ్యాజమై స్వామితో క్రీడించవలెనని అదియును నిండు మనసుతో,. ప్రతిక్షణము/అనిశము మహేశహృదయ క్రీడాసక్తగా మారాలనుకుంటున్నది

        నా మనసు.అంతలా మార్చివేస్తున్నాడు మహదేవుడు .


 మనసుకు -స్వామి కి మధ్యన సారథియైన రెండవ చరణ ము.


 " జటా కటాహ సంభ్రమ భ్రమ న్నిలింప నిర్ఝరీ


   విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధనీ


   ధగద్ధగ ధగజ్జ్వలల్లలాట పట్ట పావకే


   కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ."


   


     ఈ చరణ విశేషములను రేపటి బిల్వార్చనములో తెలుసుకునే ప్రయత్నము చేస్తాను.


   కదిలేదిప్రపంచం-కదలనిది పరమాత్మ.


    భజ శివమేవ నిరంతరం.


         ఏక బిల్వం శివార్పణం.



   




TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...