ఆదిత్యహృదయం-శ్లోకము-03
*********************
ప్రార్థన
*****
"జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం
హిరణ సమిత పాప ద్వేష దుఖస్య నాశం
అరుణకిరణ గమ్యం ఆసిం ఆదిత్యమూర్తిం
సకల భువన వంద్యం భాస్కరం తం నమామి."
శ్లోకము.
********
"రామ రామ " మహాబాహో శృణు గుహ్యం-సనాతనం"
యేన సర్వాన్ అరీన్ వత్స! సమరే విజయిష్యతి."
పూర్వ రంగము.
************
సంఘర్షణతో నిండియున్న రామచంద్రునికి ధైర్యమును కలిగించుటకై/ఉపాయమును సూచించుటకై,
"అభ్యాగతో స్వయం విష్ణుః" గా అగస్త్య మహాముని దేవతలతో కూడి వచ్చి,తానొక్కడే రామునికి దగ్గరగా వెళ్ళి,ఏదో
సూచించబోతున్నాడు.
స్తోత్రమును ఉపదేశించుటకు ముందే స్తోత్ర ఫలసిద్ధిని అందించారు మహర్షి.స్తోత్ర లక్షణమును-రక్షణమును తెలియచేశారు.
కురుక్షేత్ర యుద్ధములో గీతోపదేశము వలె ఈ సూర్యోపాసన స్తోత్రము సైతము అన్యులకు గోచరము కానిదని పెద్దలు చెబుతారు.ఇదియేకగా క్షిప్రప్రసాద లక్షణము.
మహర్షి రామం ఉపాగమ్య అన్న పదములను గమనిస్తే,
రామునికి మరింత దగ్గరగావచ్చి ఉపదేశించబోతున్న స్తోత్రము,రెండు శుభలక్షణములను కలిగి యున్నది.
1.గుహ్యత కలిగినదిగుహ్యం.ఏ విధముగాగమనమును కలిగినది గమ్యమో గుహ్యతను కలిగినదిగుహ్యం.
గుహ్యత అంటే రహస్యముగాభావింప చేసే రహస్యము కానిది.
"అణురణూయాన్ మహతో మహీయాన్
ఆత్మా గుహానాం" అన్నది వేదము.
అణువు కన్నా సూక్ష్మముగా -మహత్తు కన్నా మహనీయముగా హృదయమనే గుహలోనున్న చైతన్యశక్తి "గుహ్యము"
" పరేన నాకం విహితం గుహాయాం."
హృదయకుహరమునందలిచైతన్యము "గుహ్యము"
మన నేత్రములు భానుమండల మధ్యస్థ గుండ్రని సూర్య బింబమును ఉదయాస్తమాన సమయములలో దర్శించగలవు.కాని ఆ బింబములోని అనంత విశ్వశక్తిని దర్శించలేవు.అనుగ్రహమును పొందగలవు కాని ఇది అని వర్ణించలేని పరమాత్మ తత్త్వమే గుహ్యము.
" తత్ స్రట్వా తదేవ అనుప్రావిశత్"
తాను ప్రకాశిస్తూ-తన సృష్టిలో ప్రవేశించి, ప్రకాశింపచేయువాడు "గుహ్యుడు"
కనుకనే,
' యద్భాసా భాస్వతే సూర్యో
యద్భాసాభాస్యతే జగత్" అని ఆర్యోక్తి.
అంతేకాదు,
ఈస్తోత్రము,
అరీన్ విజయిష్యతి-శత్రువులనుజయించగలది.
ఒకరిద్దరినికాదు
సర్వాన్ అరీన్విజయిష్యతి-బాహ్య-ఆంతరంగిక ప్రతిబంధకములను తొలగించి,విజయమును చేకూరుస్తుంది.
రామ-రామ అను ఆమ్రేడితను ప్రయోగించారు వాల్మీకి.
1.ఆత్రుత-హెచ్చరికతతో కూడిన తడబాటుగా అన్వయిస్తారు కొందరు.
2.ఆజానుబాహ-రామా-స్వరూపము
మహాబహో-రామ -సామర్థ్యము, అని రామచంద్రుని స్వరూప-స్వభావములుగా ఇంకొందరూన్వయిస్తారు.
3.మరికొందరు,
సర్వాంతర్యామి-రామా
అయోధ్యాపతి-రామా అని
పరమాత్మ విశేషముగాను-అవతారవిశేషముగాను భావిస్తూ,
రమించువాడెవరురా-రఘోత్తమా నిను వినా అని రమిస్తూ,తరించే వారు ఎందరో.
అటువంటి రాముని,
వాత్సల్యముతో,
వత్సా!అని సంబోధించారు అగస్త్యుడు.
వత్సము అంటే ఆవు దూడ.శాకాహారి యైన గోవు తనదూడ మావిని పూర్తిగా తననోటితో తీసివేస్తుంది,అది వాత్సల్యము.మాతృ వాత్సల్యము.
వత్సా-శృణు-వినుము.
యత్ స్తోత్రం,
అరీన్ విజయిష్యతి-శత్రువులనుజయిస్తుంది.
సమరే-సర్వాన్-అరీన్-విజయిష్యతి.
సమరములో-సర్వములైన-శత్రువులను-జయిస్తుంది.
కనుకనే,
"రోగార్తే ముచ్యతే రోగాన్"
సాంబుడు ఆదిత్యుని స్తుతించి ఆరోగ్యవంతుడైనాడు.
బంధోముచ్యేత బంధనాత్,
అల్లరిపిడుగు-నిలకదలేని ఆంజనేయుడు,
స్వామిని సేవించి సకలవిద్యాపారంగతుడైనాడు.
అహమన్నం-అహమన్నాదచ కనుకనే,
పాండవులు అక్షయ పాత్రను పొందగలిగినారు.
యాజ్ఞవల్క్యుడు శాప విముక్తుడైనాడు.
ఓ రామా! ఆదిత్యహృదయ స్తోత్ర పారాయణమును చేసి,కష్టమును దాటివేయుము అని శ్రేయో మార్గమును సూచించుచున్న తరుణములో,
" తం సూర్యం ప్రణమాయహం.