Monday, March 6, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(AKSHAYAM PARAM SIVAM)-05

 ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు-వినాశనమ్ ।

జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ ॥


 ప్రస్తుత శ్లోకము సర్వాంతర్యామిని సంకేతిస్తూ,అఖిలమునకు మూలమైన ఆదిత్యహృదయ స్తొత్రమును నిత్యము జపించిన కలుగు ఫలప్రాప్తిని వివరించుచున్నది.
 జయము-శివము-నిత్యము అను మూడు విశేషములు ప్రస్తావించబడినవి.పదములలో దాగిన నిగూఢార్థములను గ్రహించే ప్రయత్నము చేద్దాము.
 1.ఆదిత్య అను శబ్దమునకు అనేకానేక సమన్వయములు చెప్పబడినవి.
 ప్రణవముగా ఆదిత్యశబ్దము కీర్తించబడుతున్నది.
 ప్రకాశముగాను స్పష్టమగుచున్నది.
 కాలగమనమునకు సంకేతముగాను నిర్ధారింపబడుచున్నది.
 కిరనముల ద్వారా ప్రత్యక్ష వ్యాపకత్వముతో పరిపాలించుచున్న పరమాత్మ అనుట నిజమే.
 
 హృదయము అనగా మూలము.అనంతవిశ్వరచనకు ఏది మూలమో,అనంతవిశ్వభ్రమణమునకు ఏది కారనమో,అనంత పోషకత్వమునకు ఏది ప్రధానమో,అనంత వికాసమునకు ఏది ఆధారమో అదే ఆదిత్యహృదయము.
 సాహిత్య పరముగను-సాంకేతిక సమన్వయమునకు అనుసంధానము చేయుచున్న అద్భుత చేతనాశక్తియే ఆదిత్యహృదయము.

 జపము అను పదము  అట్టి మహత్తర చైతన్యశక్తిని నామము-స్మరనము-సమయము-సమర్పణము-విశ్వాసము అను నమః చేయుచున్నది నేను అనిపిలువబడు ఉపాధికాదు-దానిలో దాగిన నీ చైతన్యమే అని గుర్తించి-గౌరవించు స్వభావము.
  నిత్యము-నిత్యము అనే పదము పరమాత్మ యొక్క శాశ్వతత్త్వమునకు-జీవుని జపమునకు-సాధనకు-దాని వలన లభించే సత్ఫలితములకు అన్వయించి తెలియచేయటమైనది.
 సాధకుని పరముగా
 జపేత్-నిత్యం
 ఫలితముల ప్రకారముగా
 పుణ్యము-నిత్యం
 జయం-నిత్యం
 శివం-నిత్యం
 పరం-నిత్యం
 అక్షయం-నిత్యం
 మనము పైన చెప్పబడిన నిత్యమును సమయమునకు అన్వయించుకుంటే 
 అది ఒక్కరికి-ఒక్కసారి అని కాదు అని స్పషటము చేస్తూ
 సర్వ శత్రు-వినాశనం అని అవి లభించటానికి అవసరమైన మలినములను సైతము తొలగిస్తుందట.లోపల దాగిన శత్రువులను-ఉపాధులతో ప్రకటనమగు శత్రువులను తొలగించి,అనుగ్రహమును పొందుటకు అవకాశమును కలిగిస్తుంది.
 ప్రస్తుత శ్లోకము స్తోత్ర వైశిష్త్యమును
 అక్షయ్యం అను పదముతో అనిర్వచనీయము చేస్తున్నది.
 1.ధర్మరాజుకు అనుగ్రహింపబడినది అక్షయపాత్ర.వాచ్యార్థమును గమనిస్తే రాగి పాత్ర.కాని పరిశీలిస్తే భూమండలము.సూర్య భగవానుడు భూమండలము అనే పాత్రలో తన కిఋఅణముల ద్వారా ఋతువులను మార్చుతూ,అనేకానేక ఆహారములను,ఔషధములను,అధ్యయమును అందిస్తున్నాడు.పాత్రతను అనుగ్రహిస్తున్నాడు ఉపాధులకు జీవించుటకు.
 2.అక్షయము అనగా ఆకాసము-అనంతము.తాను దానిని తన శక్తిని కిరణములుగా ప్రసరిస్తూ పాలించుటకు కేంద్రము చేసుకొనినది.
 3.అక్షయము అనగా క్షయము కానిది.నిరంతర నిధి నిక్షేపములను అనుగ్రహించునది.
  పరము అయిన శివము-అనగా చెదిరిపోని మానసిక స్థితిని నిత్యము కలిగించునదిగా అగస్త్యునిద్వారా అనుగ్రహించబడినది,
 తం సూర్యం ప్రణమామ్యహం.


 

ANIRVACHANEEYAM-ADITYAHRADAYAM(GUHYAM-SANATANAM)-04

 రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ ।

యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ॥ 3 ॥


 ప్రస్తుత శ్లోకము ఒక విధముగా ఫలసృతి అని భావిస్తారు.
 ఇందులో గుహ్యం-సనాతనం అని శ్లోకము ద్వారా స్తోత్ర వశేషము చెప్పబడినది.
 మననాత్ త్రాయతే మంత్రం-వేదవాక్యము.
 అగస్త్యుడు రామునకు అదిత్యహృదయ మంత్రమును ఉపదేశించాడు అనుట మంత్ర మర్యాదను పాటించమనుకోవచ్చును.
 ఆది-అంతములేని నిత్యనూతన తత్త్వమే సనాతనము.
 ఆదిత్యహృదయ స్తొత్ర పఠన ఫలితము కేవలము శ్రీరామ చంద్రునికి మాత్రమే కాదు సర్వులకు-సర్వకాల సర్వావస్థలయందును సంస్కరించునది అని చెప్పకనే చెప్పబడినది.
 అంతే కాదు ఒక్క శత్రువును సంహరించునది మాత్రమే కాదు
 సర్వన్-అరీన్-సర్వశత్రువులను అనగా 
 కామ-క్రోథ-లోభ-మోహ-మద-మాత్సర్యములను అంతరంగశత్రువులను-బాహ్య శత్రువులను హరించివేస్తుంది.
  అంతే కాకుండ
 వత్స-అను వాత్సల్య పూరక సంబోధనము జరిగినది.
 వత్స అను సబ్దమునకు గోమాత యొక్క లేగ.గోవు తాను సాకాహారి.అయినప్పటికిని తన నుండి జన్మించిన బిడ్దను ఆవరించి యున్న నిషిద్ధమును ప్రేమతో శుభ్రం చేస్తుంది.దానికి స బాహ్య-అభ్యంతర శుచిని ప్రసాదిస్తుంది.
 శ్రీరాఘవం-ఆజానుబాహుం అన్నది మనము వింటూనే ఉంటాము.
 రామ-రామ మహాబాహో అన్న విశేషము కూడా వినిపిస్తుంది.
 మహా అవధులు లేని భుజపరాక్రమము కల శ్రీరామ
 నీవు రణ్ అమున చింతాక్రాంతుడవై ఉండుట తగదు.
 జగన్మాత యైన సీతను అయోధ్యకు తీసుకుని వెళ్ళవలసిన సమయమాసన్నమైనది.
 రామ-ఓ భగవానుడా!
 రామ-దుష్టశిక్షన-శిష్ట రక్షణ వ్రతముగా గల అవతారమా
 శ్ర్ణు-వినుము.
 నేను ఉపదేశించుచున్న స్తోత్రమును విని-పఠించుము.
  ఇది మానవధర్మాచరణము.ఆచరించి-అనుగ్రహపాత్రుడవు కమ్ము అంటూ రాముని కార్యోన్ముఖునిగా ఉత్తేజపరచిన శ్లోకమిది.
 తం సూర్యం ప్రణమామ్యహం.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...