Posts

Showing posts from October 5, 2021

INTRODUCTION KAAMAAKSHI TAAYI

Image
" శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయేత్" భగవత్స్వరూపులారా! నమస్కారములు. వాచక-కాయక-మానసిక పాపశేషములు జీవులను జన్మ అనే గుంజకు కర్మ అనే పాశముతో కట్టి,జనన-మరణ చక్రములో దారి-తెన్ను లేక తిరుగుతుండేలా నిర్దేశిస్తాయి.అమ్మలకన్న అమ్మ తన అవ్యాజకరుణతో (కరుణించుటకు మనకు ఏ అర్హత లేనప్పటికిని)మనలను ఉధ్ధరించుటకొక ఉపాధిని అనుగ్రహించి,మన కదలికలను ధర్మబధ్ధముగా జరుపుతు,మనలో మార్పులు తెస్తూ-తెస్తూ,ఏ మార్పులేని స్థితిని చేరుస్తుంది.పాశములను తొలగించివేసి,పశుపతితో/పశుపతిలో పరవశమయే భాగ్యమును ప్రసాదిస్తుంది. తల్లి నిర్హేతుక కృపాకటాక్షమేమో,ఏ మాత్రము పట్టులేని నా చేతిని పట్టుకుని, ద్రవిడభాషా శిరోభూషణములైన కామాక్షి అమ్మ విరుత్తము-నటరాజ పత్తులను స్పూర్తులుగా అనుగ్రహించి,ప్లవ నామ సంవత్సర దేవీ సరన్నవరాత్ర పుణ్యసమయమున, తమిళము నా మాతృభాష(తాయి మొళి) కాకపోయినప్పటికిని,వాటి అద్భుతానుగ్రహములను అందరికి పంచవలెనను చిన్న కోరికను నా మనసులో చిగురింపచేసి, " కామాక్షి-కామదాయిని" అను తెలుగు భాషారూపమును ప్రసాదించినది.నా ఈ దుస్సాహసమును మన్నించి,దీన...